S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/10/2016 - 11:46

తిరుపతి: వామపక్ష పార్టీలు, వైకాపా చేపట్టిన బంద్‌ చిత్తూరు జిల్లాలో శనివారం పాక్షికంగా సాగుతోంది. తిరుపతిలో వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డిని అరెస్టు చేసి తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టుకు నిరసనగా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట వైకాపా కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే జిల్లా వ్యాప్తంగా వైకాపా, వామపక్ష పార్టీలకు చెందిన 54 మందిని అదుపులోకి తీసుకున్నారు.

09/10/2016 - 11:37

హైదరాబాద్‌: అసెంబ్లీలో అమర్యాదకరంగా, అసభ్యకరంగా వప్రర్తించిన వైకాపా సభ్యులపై మూడేళ్లపాటు చర్య తీసుకోవాలని సభాహక్కుల సంఘానికి సిఫార్సు చేస్తూ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి యనమల శనివారం తీర్మానం ప్రవేశం పెట్టారు. తీర్మానాన్ని సభ ఆమోదించింది. వైకాపా సభ్యుల ప్రవర్తన దృశ్యాలను సభా హక్కుల సంఘానికి పంపాలని యనమల విజ్ఞప్తి చేశారు. గత 34 ఏళ్లుగా అసెంబ్లీలో చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎన్నడూ చూడలేదన్నారు.

09/10/2016 - 11:33

హైదరాబాద్‌: మూడు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు శనివారం ఉదయం ఎలాంటి చర్చ లేకుండానే నిరవధికంగా వాయిదాపడ్డాయి. వైకాపా సభ్యులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి ప్రత్యేక హోదాపై చర్చ కోరుతూ ఆందోళనకు దిగడంతో గందరగోళం నెలకొంది. వాయిదా అనంతరం తిరిగి సభ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో నిరవధికంగా వాయిదావేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

09/10/2016 - 07:27

విశాఖపట్నం (ఆరిలోవ), సెప్టెంబర్ 9: అవధాన విద్యలో మహోన్నత శిఖరాలు అధిరోహించిన కొప్పరపు కవుల పురస్కారం తనకు దక్కడం పూర్వ జన్మ సుకృతమని అవధాన సహస్ర ఫణి డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. కొప్పురపు కాళాపీఠం ఆధ్వర్యంలో మాగుడల నాగఫణి శర్మకు కొప్పరపు సోదర కవుల జాతీయ పురస్కారాన్ని విశాఖ కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

09/10/2016 - 07:26

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లో విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్లకు నాయకత్వ లక్షణాలపై వర్క్‌షాప్‌లను నిర్వహించనున్నట్టు రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం చెప్పారు. 304 నిబంధన కింద శాసనసభలో వై విశే్వశ్వరరెడ్డి, కాకాని గోవర్ధనరెడ్డి, అనిల్ కుమార్ పోలుబోయిన, డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.

09/10/2016 - 07:25

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో ఎపి రెసిడెన్షియల్, గిరిజన పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు తెలిపారు.

09/10/2016 - 07:24

హైదరాబాద్, సెప్టెంబర్ 9: అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ హుందాతనాన్ని దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీలో ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. వైకాపా సభ్యులు వ్యవహరించిన పద్దతి మంచిది కాదన్నారు.

09/10/2016 - 07:24

హైదరాబాద్, సెప్టెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడ్డ కరవు పరిస్థితిపై శాసనమండలిలో శుక్రవారం జరిగిన స్వల్పవ్యవధి చర్చకు సమాధానం ఇస్తూ, కరవు పరిస్థితితో తరచూ పంటలకు నష్టం జరుగుతున్న ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని వివరించారు.

09/10/2016 - 07:04

అనంతపురం, సెప్టెంబర్ 9: ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ అనంతపురం జిల్లాలో ప్రతిపక్షాలు, ఐక్యవిద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీలు, రాస్తారోకోలు, బైక్‌ర్యాలీలు నిర్వహించారు. అనంతపురం నగరంలో సిపిఐ, ఎఐఎస్‌ఎఫ్, ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. అలాగే బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హోదా కోసం నినాదాలు చేశారు.

09/10/2016 - 07:03

అల్లవరం, సెప్టెంబర్ 9: తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం తాడికోనలో మూసుకుపోయిన ఒఎన్‌జిసి బావి నుండి శుక్రవారం భారీగా గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. బావిలోకి సిబ్బంది రిగ్ ద్వారా రసాయనాలు పంపిస్తుండగా ఎయిర్ హౌస్ పగిలి గ్యాస్ లీకేజీ మొదలయ్యింది.

Pages