S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/27/2016 - 11:53

నెల్లూరు: నాయుడుపేట - తిరుపతి రహదారిపై చావలి వద్ద శనివారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొనడంతో ఇద్దరు మరణించారు. బొగ్గు లోడుతో వెళ్తున్న లారీలో డ్రైవర్, మరో లారీలో క్లీనర్ ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

02/26/2016 - 17:03

హైదరాబాద్: టిడిపిలోకి వలసలను నివారించేందుకు వైకాపా అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. అక్రమ ఆస్తుల కేసుల విచారణ సందర్భంగా ఆయన శుక్రవారం ఇక్కడి సిబిఐ కోర్టుకు హాజరై, అక్కడికే ఎమ్మెల్యేలను పిలిపించుకుని మట్లాడారు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఫోన్లకు అందుబాటులో లేకపోవడంతో వైకాపా నేతలు ఆందోళన చెందుతున్నారు.

02/26/2016 - 17:03

విజయవాడ: త్వరలో జరిగే కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం తగినంతగా రవాణా సౌకర్యాలు కల్పించాలని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. కృష్ణా పుష్కరాలపై ఆయన శుక్రవారం ఇక్కడ అధికారులతో సమీక్ష జరిపారు. ఆర్టీసీ ఎండి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. బస్సులు, రైళ్లలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అన్నారు.

02/26/2016 - 16:36

బెంగళూరు: మైసూర్‌కు చెందిన భారత క్రికెట్‌ కురువృద్ధుడు బీకే గరుడాచర్‌ (99) బెంగళూరులో కన్నుమూశారు. ఆయన ఒకే ఇన్నింగ్స్‌లో 7 సార్లు 5 వికెట్లు, 3 సార్లు 10 వికెట్లు పడగొట్టారు. 27 మ్యాచుల్లో 29.63 సగటుతో 1126 పరుగులు చేశారు.

02/26/2016 - 16:28

విజయవాడ: ఎటిఎం కేంద్రంలో బ్యాంకు ఉద్యోగులు మరచిపోయిన ఇరవై లక్షల రూపాయల నగదును తిరిగి వారికి అప్పగించిన ఓ వ్యక్తి అందరి నుంచి ప్రశంసలు అందుకున్నారు. కంచికచర్లలో ఐసిఐసిఐ ఎటిఎంలో నగదు నింపేందుకు శుక్రవారం ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చారు. నగదును నింపేసిన తర్వాత వారు 20 లక్షల రూపాయలను ఓ సంచీలో వదిలేసి వెళ్లిపోయారు.

02/26/2016 - 16:26

నెల్లూరు: రెండేళ్ల తర్వాత ముఖ్యమంత్రినవుతానని పదే పదే చెబుతున్న వైకాపా అధినేత జగన్ ఇపుడున్న వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. ఆయన శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, అవినీతి కేసుల్లో ఇరుక్కున్న జగన్ సిఎం అయ్యే అవకాశం లేదన్నారు. జగన్ నియంతృత్వ పోకడలు నచ్చకే ఆయన పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారని సోమిరెడ్డి అన్నారు.

02/26/2016 - 11:57

అనంతపురం: అనంతపురం జిల్లాలో పర్యాటక క్షేత్రమైన లేపాక్షిలో శుక్రవారం ఉదయం హెరిటేజ్ రన్ జరిగింది. హిందూపూర్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర మంత్రి పరిటాల సునీత, భారీ సంఖ్యలో యువతీ యువకులు పాల్గొన్నారు. లేపాక్షి నంది విగ్రహం నుంచి సభావేదిక వరకూ రన్ జరిగింది. శని, ఆదివారాల్లో జరిగే లేపాక్షి ఉత్సవాలకు ప్రచారం కల్పించేందుకు హెరిటేజ్ రన్ నిర్వహించారు.

02/26/2016 - 11:57

కడప: దువ్వూరు మండలం టంగుటూరిమెట్ట వద్ద ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన బస్సు బోల్తాపడగా, 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. ప్రొద్దుటూరుకు చెందిన విద్యార్థులు మూడు బస్సుల్లో కర్నూలు జిల్లా అహోబిలం పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

02/26/2016 - 11:55

గుంటూరు: రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని లక్షలాది రూపాయలను వసూలు చేసి నిరుద్యోగులను మోసగించిన రైల్వే గార్డు షేక్ మహబూబ్ పాషాను శుక్రవారం ఉదయం సిబిఐ ఉద్యోగులు అరెస్టు చేశారు. ఓ యువకుడి నుంచి మూడున్నర లక్షల రూపాయల నగదును బాషా తీసుకుంటున్నప్పుడు సిబిఐ సిబ్బంది పట్టుకున్నారు. నిందితుడి ఇంట్లో కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

02/26/2016 - 11:54

తిరుపతి: ఇక్కడి శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం ఉదయం వేద పండితులు అంకురార్పణ చేశారు. తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరిపేందుకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసింది. కాగా, ఎ.పి. హోంమంత్రి చినరాజప్ప ఈ రోజు ఉదయం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు.

Pages