S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/07/2016 - 13:19

తిరుమల: తిరుమలలో శాశ్వత ప్రాతిపదికన చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 3 వేల మందితో భద్రతను ఏర్పాటు చేయనున్నట్లు డీఐజీ ప్రభాకర్‌రావు బుధవారం తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అలిపిరి నుంచి సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. భద్రతా ఏర్పాట్లను డీఐజీ ప్రభాకర్‌రావు, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి పరిశీలించారు.

09/07/2016 - 11:59

విజయవాడ: రాజధాని నిర్మాణం కోసం పంటపొలాలను ఇచ్చిన రైతులకు అక్టోబర్ 14 నుంచి నెలరోజుల్లోగా ప్లాట్లను పంపిణీ చేస్తామని మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు. సింగపూర్ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన బుధవారం అమరావతి ప్రాంతంలో పర్యటించారు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులకు ఇప్పటికే 147 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

09/07/2016 - 11:59

విశాఖ: వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు చోటు చేసుకోవడంపై విశాఖ పోలీసు కమిషనర్ యోగానంద్ తీవ్రంగా స్పందిస్తూ ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు వేశారు. పుణ్యక్షేత్రమైన సింహాచలంలో మంగళవారం రాత్రి వినాయక చవితి ఉత్సవాల్లో అశ్లీల నృత్యాలు కొనసాగుతుండగా మద్యం సేవించిన నిర్వాహకులు అసభ్యకరంగా ప్రవర్తించడంపై కమిషనర్ ఆగ్రహం ప్రకటించారు.

09/07/2016 - 11:57

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకే తాము కేంద్రంతో పట్టుబడుతున్నట్లు మంత్రి సుజనా చౌదరి బుధవారం తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం కసరత్తు జరుగుతున్నప్పటికీ తమ డిమాండ్‌ను మరచిపోలేదన్నారు. సుజానాతో పాటు టిడిపి ఎంపీ సిఎం రమేష్ ఇక్కడ కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాజ్‌నాథ్ సింగ్‌లతో చర్చలు జరుపుతున్నారు.

09/07/2016 - 11:57

ఏలూరు: అర్ధరాత్రి వేళ దుండగులు ప్రవేశించి వృద్ధురాలిపై కత్తితో దాడి చేసి బంగారం అపహరించుకుపోయిన ఘటన జీలుగుమిల్లి మండలం ములగలపల్లిలో జరిగింది. ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న టి.గంగమహాలక్ష్మిపై దుండగులు దాడి చేసి ఆమె వొంటిమీది బంగారు నగలను దోచుకున్నారు. పెనుగులాటలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామస్థులు భయాందోళనలకు లోనయ్యారు.

09/07/2016 - 05:12

గుంటూరు, సెప్టెంబర్ 6: తూర్పుగోదావరి జిల్లా తుని రైలుదగ్ధం.. అల్లర్ల ఘటనలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని సిఐడి అధికారులు గుంటూరులో విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి ప్రభుత్వం సేకరించిన ఆధారాలలో భూమన కాల్‌డాటా ఆధారంగా సిఐడి విచారణ చేపట్టింది. ఈనెల నాలుగోతేదీన గుంటూరు లేదా రాజమండ్రిలో విచారణకు హాజరు కావాల్సిందిగా సిఐడి నోటీసులు జారీచేసింది.

09/07/2016 - 05:09

శ్రీశైలం, సెప్టెంబర్ 6: శ్రీశైలంలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో ఉన్న శ్రీమల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్ల బంగారు, వెండి ఆభరణాలు, నగదు వివరాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి నారాయణ భరత్‌గుప్త మంగళవారం పరిశీలించారు. దేవస్థానానికి సంబంధించిన అన్ని ఆర్థిక లావాదేవీలు స్థానిక ఆంధ్రాబ్యాంకు శాఖలో నిర్వహిస్తున్నారు.

09/07/2016 - 05:06

ఐరాల, సెప్టెంబర్ 6: చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. సోమవారం చవితి పర్వదినాన ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏటా వినాయకచవితి మరుసటిరోజు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడం ఆనవాయితీ. ఇందులో భాగంగా మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి అనంతరం ధ్వజారోహణం నిర్వహించారు.

09/07/2016 - 05:14

గుంటూరు, సెప్టెంబర్ 6: రాజధానిలో ఇనాం భూముల వివాదం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ల్యాండ్ పూలింగ్‌లో వివిధరకాల భూములను ప్రభుత్వం సమీకరించింది. వీటిని జరీబు, మెట్ట, అసైన్డు, అటవీ, ఇనాం, లంక భూములుగా వర్గీకరించి నష్టపరిహారం కౌలు చెల్లింపులు జరుపుతోంది. 1956 రైత్వారీ చట్టం కింద కౌలుదార్లు, హక్కుదార్లకు 1/3, 2/3 వంతున భూములు కేటాయించారు.

,
09/07/2016 - 05:14

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: విశాఖ ఎంవిపి కాలనీలో భారీ గణనాథుడు కొలువు తీరాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ భారీ గణనాథుని రూపకల్పన కూడా ఘనంగానే జరిగింది.

Pages