S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/24/2016 - 17:12

కడప: రాష్ట్రం గురించి ఏనాడూ పట్టించుకోని వైకాపా అధినేత జగన్ దీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ జరిగిన టిడిపి మినీ మహానాడులో ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సహకరించడానికి బదులు అభివృద్ధి పథకాలకు ఆయన అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణలో అక్రమ నీటి ప్రాజెక్టులపై జగన్ దిల్లీలో నిరాహార దీక్షలు చేయాలని గంటా సూచించారు.

05/24/2016 - 16:53

విజయవాడ: ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించి ఈనెల 27న ఏపీ సర్కారు ప్రకటన చేయనుంది. జూన్‌ 6 నుంచి 9 వరకు ధ్రువ పత్రాలను పరిశీలిస్తారు. జూన్‌ 15 నుంచి ఆప్షన్లను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. జూన్‌ 27 నుంచి ఇంజినీరింగ్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి.

05/24/2016 - 14:16

విజయవాడ: 2014కు ముందు రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కాపులకు చేసిందేమీ లేదని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆయన మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, కాపులపై కాంగ్రెస్‌కు ఇన్నాళ్లూ లేని ప్రేమ ఇపుడు హఠాత్తుగా పుట్టుకొచ్చిందన్నారు.

05/24/2016 - 13:35

హైదరాబాద్: ఎపిలోని పది గురుకుల జూనియర్ కాలేజీలు, రెండు గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి ఎంట్రన్స్ ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ విడుదల చేశారు. గురుకుల విద్యాలయాల్లో అయిదో తరగతిలో ప్రవేశానికి సంబంధించిన ఎంట్రన్స్ ఫలితాలను కూడా ఆయన విడుదల చేశారు.

05/24/2016 - 13:34

విజయవాడ: నవ్యాంధ్ర నుంచి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తెలుగు మహిళగా నీలిమ చరిత్ర సృష్టించింది. పర్వతారోహణకు ఇటీవల బయలుదేరిన ఆమె మంగళవారం ఉదయం నాటికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినట్లు ఇక్కడికి సమాచారం అందింది. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం తురకపాలెంకు చెందిన నీలిమ కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటోంది.

05/24/2016 - 13:32

విశాఖ: ఇక్కడికి సమీపంలోని రాంకీ ఫార్మాసిటీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించి 8 మంది గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీకర్ కెమికల్స్‌లో అమ్మోనియం నైట్రేట్ ట్యాంకు పేలడంతో మంటలు వ్యాపించాయని సమాచారం. వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగినపుడు ఎక్కువ మంది కార్మికులు లేనందున ప్రాణనష్టం జరగలేదు.

05/24/2016 - 11:57

హైదరాబాద్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ తప్పనిసరి కావడంతో విద్యార్థులను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తామని ఎపి మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. ‘నీట్’ను ఈ ఏడాదికి మినహాయంపు ఇస్తూ కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్టప్రతి ఆమోదం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

05/24/2016 - 11:57

విజయవాడ: ఈ ఏడాది ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి కావాలని ఎపి సిఎం చంద్రబాబు వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం ఉదయం విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద పుష్కర ఘాట్ల పనులను పరిశీలించారు. నగరంలో ఫ్లయ్ ఓవర్ పనులను వేగవంతం చేయాలన్నారు.

05/24/2016 - 11:56

గుంటూరు: వెలగపూడిలో చేపట్టిన తాత్కాలిక సచివాలయం పనులను ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఉదయం ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణాల తీరుతెన్నులను గురించి అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. నిర్ణీత సమయానికి తాత్కాలిక సచివాలయం పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. నాణ్యత విషయంలో రాజీపడవద్దని సూచించారు. మంత్రులు దేవినేని, నారాయణ తదితరులు సిఎం వెంట ఉన్నారు.

05/24/2016 - 04:01

కోసిగి, మే 23: పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోని బురదలో దిగబడి ఊపిరాడక నలుగురు బాలురు మృతిచెందిన సంఘటన సోమవారం కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో చోటుచేసుకుంది. 8 నుంచి 12 ఏళ్ల వయసు కల్గిన ఆరుగురు బాలురు ఇంటి వద్ద మధ్యాహ్నం భోజనం చేసి ఈత కొట్టేందుకు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న బుగేనిచెరువుకు వెళ్లారు.

Pages