S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/16/2016 - 06:27

విజయవాడ, జూన్ 15: తుని ఘటనలో అరెస్టయిన వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలే ప్రసక్తి లేదని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సిఎం క్యాంప్ కార్యాలయంలో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి గంటా, హోం మంత్రి చినరాజప్ప మాట్లాడారు. తుని ఘటనలో అరెస్టయిన వారిని విడుదల చేయటానికి ప్రభుత్వం అంగీకరించిందని ముద్రగడ కుమారుడు చెప్పటంలో వాస్తవంలేదని అన్నారు.

06/16/2016 - 06:26

రాజమహేంద్రవరం, జూన్ 15:ప్రభుత్వ సానుకూల దృక్పథంతో జరిపిన చర్చలు ఫలప్రదమై ఎట్టకేలకు కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలకు అంగీకరించారు. సాంకేతిక సమస్యల అనంతరం జైలు నుంచి బెయిలుపై ముద్రగడ అనుచరులను బయటకు తీసుకువచ్చిన తరువాత దీక్ష విరమణకు అంగీకారం కుదిరింది.

06/15/2016 - 17:45

రాజమండ్రి: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం వైద్య చికిత్స తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారని, తనకు ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు ఆయన అంగీకరించారని బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బుధవారం సాయంత్రం తెలిపారు. ప్రభుత్వానికి, కాపు నేతలకు మధ్య జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలను ముద్రగడ ముందు ఉంచామన్నారు.

06/15/2016 - 17:43

గుంటూరు: ఎపిలో గురువారం నుంచి ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సిఎం చంద్రబాబు తెలిపారు. ఆయన వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం పనులను పరిశీలించిన అనంతరం ‘బడి పిలుస్తోంది’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. బడి ఈడు పిల్లలందర్నీ ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సహకరించాలన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలను మెరుగు పరచి, నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు.

06/15/2016 - 17:08

విజయవాడ: రాజమండ్రి ఆస్పత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంకు కోర్టు ఆదేశాల మేరకు వైద్య చికిత్స అందిస్తామని, చర్చల పేరిట కాలయాపన జరిపే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుధవారం తెలిపారు. అయితే, తుని విధ్వంసకాండలో అరెస్టు చేసిన వారిని విడిచిపెట్టే అవకాశం లేదని, చట్ట ప్రకారం కేసులు నడుస్తాయన్నారు.

06/15/2016 - 17:07

అనంతపురం: వైకాపా నుంచి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని ఇటీవల టిడిపిలో చేరిన ఎమ్మెల్యే చాంద్‌పాషా అన్నారు. వైకాపా ఎమ్మెల్యేలు స్వేచ్ఛగానే టిడిపిలోకి వెళుతున్నారే తప్ప అమ్ముడు పోవాల్సిన అగత్యం వారికి పట్టలేదన్నారు. చంద్రబాబు వల్లే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల అభివృద్ధి సాధ్యమన్నారు. ఈసారి క్యాబినెట్ విస్తరణ జరిగితే మైనార్టీల నుంచి ప్రాతినిధ్యం ఉంటుందన్నారు.

06/15/2016 - 17:06

విజయవాడ: రాష్ట్ర రాజకీయాల్లో అసలైన విలన్ వైఎస్ జగన్ అని, ఆయన ఏనాడూ హీరో కాలేడని టిడిపి నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం ఇక్కడ మీడియాతో అన్నారు. సిఎం పదవి, అవినీతి సంపాదన తప్ప మిగతా విషయాలేవీ జగన్‌కు పట్టవన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైకాపాకు ప్రజల నుంచి తిరస్కారం తప్పదన్నారు. కులాల పేరిట చిచ్చు రేపేందుకే ముద్రగడ దీక్షపై జగన్ మొసలికన్నీరు కార్చుతున్నారని విమర్శించారు.

06/15/2016 - 17:06

రాజమండ్రి: ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో విశాఖ రేంజి డిఐజి శ్రీకాంత్, ఎస్‌పిలు రవిప్రకాష్, రాజకుమారి బుధవారం భేటీ అయ్యారు. దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వ ప్రతిపాదనలపై వారు ఆయనతో చర్చించినట్లు సమాచారం.

06/15/2016 - 17:06

గుంటూరు: వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్ని సమస్యలున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాహితమే ప్రథమ కర్తవ్యం అని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పరిపాలనా వ్యవస్థ అంతా నవ్యాంధ్ర రాజధానికి తరలిరావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

06/15/2016 - 17:05

హైదరాబాద్: వైకాపా అధినేత జగన్‌కు మరో షాక్ తగలనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ప్రస్తుతం వినిపిస్తోంది. కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో పిఎసి అధ్యక్ష పదవి దక్కనందున ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

Pages