S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/25/2016 - 13:52

కడప: ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికల్లో గెలిపించుకోవాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ టిడిపి అధినేత చంద్రబాబుకు సవాల్ చేశారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, అక్రమ సంపాదనతో ఎమ్మెల్యేలను కొంటున్న చంద్రబాబు విలువలకు తిలోదకాలిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబులా తనకు వెన్నుపోటు రాజకీయాలు చేతకావని జగన్ అన్నారు.

02/25/2016 - 13:51

తిరుపతి: రేణిగుండ, కుకునూరు ప్రాంతాల్లో గురువారం ఉదయం ఫారెస్టు అధికారులు ఆకస్మిక దాడులు చేసి ఓ కంటైనర్‌లో ఉంచిన 10 కోట్ల రూపాయల విలువ చేసే 290 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా వీటిని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వారి కోసం గాలిస్తున్నారు.

02/25/2016 - 12:26

హిందూపురం: ప్రపంచానికంతటికీ తెలిసేలా లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్థానిక ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. ఉత్సవాలకు ప్రచారం కల్పించేందుకు ఆయన గురువారం ఉదయం ఇక్కడ 5కె రన్‌ను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు రన్‌లో పాల్గొన్నారు.

02/25/2016 - 11:50

తిరుపతి: నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో కడుపు నొప్పితో తల్లి ఆత్మహత్య చేసుకోగా, ఆమె మరణాన్ని చూసి తట్టుకోలేక కుమారుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. తల్లీ, కొడుకు ఒకేరోజు మృతి చెందడం ఈ ప్రాంతంలో విషాదాన్ని నింపింది.

02/25/2016 - 11:50

నెల్లూరు: అనంతసాగరం మండలం పాతలాపల్లిలో బుధవారం అర్ధరాత్రి ఐదిళ్లలో చోరీలు జరిగాయి. రెండు లక్షల నగదు, ఐదు తులాల బంగారం, పది సెల్‌ఫోన్లను దొంగలు చోరీ చేశారు.

02/25/2016 - 11:50

కడప: తన పార్టీలోంచి టిడిపిలోకి వలసలు ప్రారంభం కావడంతో ఎమ్మెల్యేలను కాపాడుకొనే దిశగా వైకాపా అధినేత జగన్ పార్టీ నేతలతో సమీక్షలు జరుపుతున్నారు. దిల్లీ నుంచి బుధవారం ఆయన హుటాహుటిన పులివెందులకు చేరుకుని పలువురు ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. రెండో రోజు గురువారం కూడా పార్టీ ముఖ్యులతో భేటీ అయ్యారు.

02/25/2016 - 11:49

కాకినాడ: చంద్రబాబు కుమారుడు లోకేశ్ కారణంగా తెలంగాణలో టిడిపి ఉనికిని కోల్పోయిందని, భవిష్యత్‌లో ఎ.పి.లోనూ ఆ పార్టీకి అదే గతి పడుతుందని వైకాపా ఎమ్మెల్యే రోజా అన్నారు. ఆమె గురువారం అన్నవరం ఆలయాన్ని సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టిడిపి నేతలు ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.

02/25/2016 - 11:49

కర్నూలు: నందికొట్కూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో గురువారం ఉదయం విద్యార్థులపై తేనెటీగలు దాడి చేశాయి. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. తేనెటీగల బెడద కారణంగా ఈ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

02/25/2016 - 11:48

ఒంగోలు: ముండ్లమూరు మండలం రెడ్డినగర్ వద్ద గురువారం ఉదయం ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా విజయవాడ నుంచి హనుమంతునిపాడు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

02/25/2016 - 07:09

కర్నూలు: వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి మంత్రి మండలిలో స్థానం ఖాయమైనట్లు సమాచారం. ఆయనకు విద్యుత్, పౌర సరఫరాలశాఖలో ఏదోఒకదాన్ని కేటాయిస్తారని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలో మంత్రివర్గంలో సర్దుబాట్లు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Pages