S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/27/2016 - 06:18

విజయవాడ, మే 26: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో వౌలిక వసతులు పక్కాగా లేకపోతే ఆ కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న వసతులు, వౌలిక సదుపాయాల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అన్నారు.

05/27/2016 - 06:17

విజయవాడ, మే 26: రోహిణీ కార్తె ప్రవేశించడంతో ఉష్ణోగ్రతలు పెరిగి వడగాల్పుల తాకిడి మరింత పెరగగలదని ప్రజలందరూ భయాందోళన చెందుతున్న తరుణంలో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కురుస్తుండటంతో స్పైస్‌జెట్ విమానం ల్యాండ్ కావడానికి అనుకూలంగా లేకపోవ డంతో రాజధాని తుళ్లూరు ప్రాంతంలో దాదాపు ఆరేడుసార్లు చక్కెర్లు కొట్టి వెనక్కి వెళ్లిపోయింది.

05/27/2016 - 06:16

విజయవాడ, మే 26: ఈ ఏడాది ఏప్రిల్‌లో నిర్వహించిన ఆంధ్ర ప్రదేశ్ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలను మంత్రి గంటా గురువారం విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 63.86 శాతం మంది, పదో తరగతి పరీక్షల్లో 61.43 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఎస్‌ఎస్‌సిలో 81.83 శాతం ఫలితాలతో విశాఖ జిల్లా మొదటి స్థానంలో ఉంది. 80.52 శాతంతో అనంతపురం జిల్లా రెండో స్థానంలో, 75.72 శాతంతో పశ్చిమ గోదావరి మూడో స్థానంలో ఉంది.

05/27/2016 - 06:15

ఒంగోలు/నెల్లూరు, మే 26: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. తాజాగా ప్రకాశంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలో త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వినికిడి. ఈమేరకు మంతనాలు కూడా జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది.

05/27/2016 - 06:14

విశాఖపట్నం, మే 26: రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యానికి సంబంధించి విధానాన్ని తిరుపతిలో జరుగనున్న మహానాడులో ప్రకటించాలని లోక్‌నాయక్ ఫౌండేన్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ డిమాండ్ చేశారు. విశాఖలో గురువారం విలేఖరులతో మాట్లాడుతూ తిరుపతిలో జరుగనున్న మహానాడులో ఈ విషయాన్ని చర్చించి విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

05/27/2016 - 06:13

విశాఖపట్నం, మే 26: ఎండలు మండుతున్నాయి. వాయువ్య దిశగా వస్తున్న వేడుగాలులతో వడగాల్పులు వీస్తున్నాయి. గురువారం కోస్తాలో సాధారణ స్థాయి కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాయలసీమలో మాత్రం రెండు డిగ్రీలు అధికంగా నమోదైంది. రాష్ట్రంలో మరో 24 గంటల పాటు వడగాల్పులు కొనసాగుతాయని విశాఖలోని తుపాను హెచ్చరిక కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు.

05/27/2016 - 06:13

తుళ్లూరు, మే 26: రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణ సాయం అందించేందుకు సూచనప్రాయంగా అంగీకరించింది. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం పర్యటించారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం, కృష్ణాతీర ప్రాంతంలో పర్యటించిన ప్రపంచబ్యాంకు బృందం తుళ్లూరు సీఆర్డీయే కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు.

05/27/2016 - 06:12

విశాఖపట్నం, మే 26: విశాఖ నగరంలో 11 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రాంబాబు, సుధారాణి కుమారుడు 11 నెలల నవదీప్ గురువారం కిడ్నాప్‌కు గురయ్యాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలుడిని సెల్లార్‌లో ఉయ్యాలలో నిద్రపుచ్చి రాంబాబు, సుధారాణి తమ పనులు చూసుకుంటున్నారు.

05/27/2016 - 06:10

విశాఖపట్నం, మే 26: ఎపిఎంసెట్-2016లో ర్యాంక్‌లు దక్కించుకున్న విశాఖకు చెందిన విద్యార్థులు టిఎంసెట్‌లోనూ ర్యాంక్‌లు సాధించారు. విశాఖకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎపిఎంసెట్‌లో, టిఎంసెట్‌లో మొదటి పది ర్యాంక్‌ల్లో ఉండటం గమనార్హం. ఎపిఎంసెట్‌లో ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించిన ఎస్.వంశీకృష్ణారెడ్డి టిఎంసెట్‌లో 10వ ర్యాంక్ సాధించాడు.

05/27/2016 - 06:09

మడకశిర, మే 26: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో జరిపిన విదేశీ పర్యటనల కారణంగా దేశంలో ఆహార ఉత్పత్తులు, వస్తువుల ఎగుమతులు తగ్గిపోయి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు.

Pages