S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/26/2017 - 08:17

అమరావతి, ఏప్రిల్ 25: తన సొంత జిల్లాలో నాయకులు సఖ్యతగా లేకపోవడం సరైంది కాదని, ఇసుక, మద్యం దందాలు చేసి పార్టీ పరువు, తన ప్రతిష్ఠ దెబ్బతీయవద్దని టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

04/26/2017 - 07:43

ధర్మవరం, ఏప్రిల్ 25: బాహుబలి-2 మానియా ధర్మవరం పట్టుచీరపైకి ఎక్కింది. చిత్రం పేరు, నటీనటులు, నిర్మాతల పేర్లు పట్టుచీరపై నేసి ధర్మవరం పట్టుకు ఉన్న స్థానాన్ని మరోసారి రుజువు చేశాడు అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన కళాకారుడు అన్వర్ బాషా. పట్టణంలోని కొత్తపేటకు చెందిన అన్వర్ బాషా బాహుబలి-2 చిత్రం పేరును ధర్మవరం పట్టుచీరపై అత్యంత నైపుణ్యంతో ఆవిష్కరించాడు.

04/26/2017 - 07:39

గుంటూరు, ఏప్రిల్ 25: రాజధాని భూ సేకరణ విషయంలో యథాతధ స్థితిని అమలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఏ రకంగా ముందడుగు వేయాలనే విషయమై ఏపి సర్కార్ మల్లగుల్లాలు పడుతోంది. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో 29 గ్రామాలలో ఇప్పటికే ప్రభుత్వం సామాజిక ప్రభావిత సర్వే పూర్తి చేసింది. కొన్ని గ్రామాలకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది.

04/26/2017 - 07:39

తిరుపతి, ఏప్రిల్ 25: ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్‌లైన్‌లో విడుదలచేసే ఆర్జిత సేవ టిక్కెట్లు, ఈ- దర్శన్ కౌంటర్లలో అందుబాటులో ఉన్న సేవా టిక్కెట్ల బుకింగ్‌లో మరింత పారదర్శకత పెంచేందుకు జూన్ మొదటి వారం నుంచి ‘ శ్రీవారి అనుగ్రహం’ పేరుతో లక్కీడిప్ విధానాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు.

04/26/2017 - 07:37

హైదరాబాద్, ఏప్రిల్ 25: ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య వివిధ అంశాలపై వేసిన కార్టూన్లకు, పద్య కవితలకు అపూర్వ ఆదరణ లభించింది. బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్-3లో గల జర్నలిస్టుల కాలనీలో గోతె-జంట్రుమ్ హాలులో మంగళవారం బిపి ఆచార్య కార్టూన్లు, పద్య కవితల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు.

04/26/2017 - 06:15

విజయవాడ, ఏప్రిల్ 25: ఇంట్లో మరుగు దొడ్డి కట్టించనివారిని స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించే చట్టాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మరుగు దొడ్డి కట్టించుకోవడాన్ని తప్పనిసరి చేసే ఉద్దేశంతోనే ఈ చట్టాన్ని తీసుకురానున్నట్టు ఆయన తెలిపారు.

04/26/2017 - 06:14

విశాఖపట్నం, ఏప్రిల్ 25: వచ్చే నెలలో తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే 45 నుంచి 47 డిగ్రీలకు చేరుకున్న ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో మరింత పెరగనున్నాయి. వీటితోపాటు రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరగనున్నాయి.

04/26/2017 - 06:12

గుంటూరు, ఏప్రిల్ 25:ప్రభుత్వం మిర్చికి మద్దతుధర ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు మిర్చియార్డుకు భారీగా సరకు తరలివస్తోంది. ప్రభుత్వం ఈనెల 20 నుంచి 15 వందల రూపాయలు అదనంగా మద్దతు ధర ఇస్తుండటంతో లక్షలాది టిక్కీల మిర్చిని రైతులు తరలిస్తున్నారు. కోల్డు స్టోరేజీలలో నిల్వలకు మద్దతుధర వర్తించదనే నిబంధన విధించడంతో నేరుగా యార్డుకే పంటను తీసుకొస్తున్నారు.

04/26/2017 - 06:05

అమరావతి, ఏప్రిల్ 25: విద్యుత్ సంరక్షణ, పొదుపుతో సహా ఈ రంగంలో అనతికాలంలోనే ఆంధ్రప్రదేశ్ సాధించిన గణనీయ విజయాలు కేంద్ర ఇంధన రంగ సంస్థలను ఆకర్షించేలా చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనా విధానంతో భాగస్వామి అయ్యేందుకు దాదాపు 100 దేశాల్లో అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసిన ప్రఖ్యాత ది ఎనర్జీ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (టెరి) ముందుకు వచ్చింది.

04/25/2017 - 07:45

ఒంగోలు అర్బన్, ఏప్రిల్ 24: మానవాళికి నాగరికత, సంస్కృతి నేర్పింది రచయితలేనని, అలాంటి రచయితలకు రసస్పృహ అవసరమే కాని రాజకీయ స్పృహ అవసరం లేదని ప్రముఖ చారిత్రక నవలా రచయిత, ఫ్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ అన్నారు. సోమవారం ఒంగోలులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ వారోత్సవాలు తెలుగురాష్ట్రాల్లో మొక్కుబడిగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Pages