S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/18/2017 - 09:15

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 17: ఏపి అవినీతి నిరోధక శాఖాధికారుల దాడుల్లో మరో అవినీతి తిమింగలం ఆస్తులు రట్టయ్యాయి. వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఆర్జించిన ఫిర్యాదులపై ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపిఇడబ్ల్యూఐడిసి) చీఫ్ ఇంజనీరు భూమిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి ఇళ్ళపై ఏసిబి అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

04/17/2017 - 04:10

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రభుత్వం నవయుగ వైతాళికుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతిని ప్రభుత్వ అధికారిక పండుగగా నిర్వాహించేందుకు ప్రకటించింది. ఈ మేరకు కందుకూరి జయంతి రోజును నాటకరంగ దినోత్సవంగా వెల్లడించింది. నాటక రంగానికి విశేష కృషిచేసిన కందుకూరి జయంతిని పురస్కరించుకుని ప్రతీ ఏటా కందుకూరి నాటక రంగ పురస్కారాలను ఇవ్వనుంది. కందుకూరి ఈ జయంతి నుంచే ఈ పురష్కరాల ప్రదానం ఆరంభమైంది.

04/17/2017 - 04:08

అనంతపురం, ఏప్రిల్ 16 : విభేదాల కుంపటితో రగులుతున్న అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో సమన్వయమే పెద్ద సవాల్‌గా మారింది. ‘కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల తీరు కొనసాగుతోంది. అధినేత, సిఎం నారా చంద్రబాబునాయుడు పలుమార్లు హెచ్చరించినా విభేదాల కుంపట్లు ఆరడం లేదు.

04/17/2017 - 04:07

విశాఖపట్నం, ఏప్రిల్ 16: ఆర్టీసీ సంస్థ రూ.800 కోట్లకు పైగానే నష్టాలు ఎదుర్కొంటుందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమశాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రూ.2.5 కోట్ల విలువైన పది తెలుగు-వెలుగు ఆర్టీసీ బస్సులను ఆదివారం విశాఖ మద్దిలపాలెం కాంప్లెక్స్‌లో మంత్రి పచ్చా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

04/17/2017 - 04:13

విశాఖపట్నం, ఏప్రిల్ 16: అరకు పర్యాటక రైలు పట్టాలెక్కింది. ఆదివారం ఉదయం 10.30 గంటలకు భువనేశ్వర్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

04/17/2017 - 04:05

రేణిగుంట, ఏప్రిల్ 16: తిరుపతి సమీపంలోని రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది హై అలర్ట్ ప్రకటించారు. ఆదివారం ఢిల్లీ ఇంటెలిజన్స్ హెచ్చరికల మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

04/17/2017 - 04:05

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: సినీ నిర్మాతలకు స్టార్ గుర్తింపు రావాల్సి వుంది.. ఎన్నో ఉత్తమ విలువలు కలిగిన చిత్రాలను సమాజానికి అందించిన విజయా ప్రొడక్షన్స్ నుంచి బి.నాగిరెడ్డి మెమోరియల్ అవార్డును అందుకోవడమంటే ఎంతో విశిష్టమైన గౌరవాన్ని పొందడమేనని సినీ హీరో జగపతిబాబు అన్నారు.

04/17/2017 - 03:45

విజయవాడ, ఏప్రిల్ 16: విద్యుత్ రంగంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్‌గా నిలిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్రాల విద్యుత్ మంత్రుల జాతీయ సదస్సు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘2014కు ముందు అధఃపాతాళంలో ఉన్నాం.

04/17/2017 - 03:43

విజయవాడ, ఏప్రిల్ 16: సోమవారంను పోలవారంగా మార్చుకొని ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషిచేస్తుంటే ఢిల్లీకి మూటలు మోసిన కెవిపి రామచంద్రరావు కేంద్ర మంత్రి ఉమాభారతికి లేఖలు రాయడం దుర్మార్గమని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు విమర్శించారు.

04/17/2017 - 03:41

విజయవాడ, ఏప్రిల్ 16: ముఖ్యమంత్రి దృష్టికి నేరుగా తమ సమస్యలు తీసుకెళ్లేందుకు, పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూపొందించిన కైజాలా యాప్ ‘కనెక్ట్ ఎపి సిఎం’లో తాజాగా మరో ప్రశ్న సంధించారు. ఈ నెల 14న ఈ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించగా, డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ‘ప్రభుత్వ పనితీరు పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా?’ అంటూ తొలి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు ‘సంతృప్తిగా ఉన్నాం..

Pages