S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/17/2017 - 03:41

విజయవాడ, ఏప్రిల్ 16: పోలవరం ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేసేందుకు వీలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పనులను పరిశీలించనునున్నారు. ఆశించినంత వేగంగా ప్రాజెక్టు పనులు జరగకపోవటం, ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రాజెక్టు సైట్ వద్దకు చేరుకుని పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తారు.

04/17/2017 - 03:40

విజయవాడ, ఏప్రిల్ 16: విశాఖ జిల్లా నక్కపల్లి ప్రాంతంలోగల మెట్రోడ్రగ్స్ అండ్ లేబ్స్ కంపెనీలో క్యాజువల్ కార్మికులు ఈ నెల 13 నుండి నిరవధిక సమ్మెలో ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలో ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ కంపెనీ కార్మికులు 14 నుండి సమ్మెలో ఉన్నారు. అదే విధంగా రాజమండ్రి ఐపి పేపర్ మిల్లులో యజమాన్యం అక్రమంగా 10 మంది కార్మికులను తొలగించినందుకు నిరసనగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు.

04/17/2017 - 03:39

అమరావతి, ఏప్రిల్ 16: మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిల తిరుగుబాటుతో పాటు ప్రతి జిల్లాలో వినిపిస్తున్న ధిక్కార స్వరాలకు తమ నాయకత్వ స్వయం కృతాపరాధమే కారణమని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ మీద పట్టు సాధించలేకపోవడానికి కారణం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలేనని అంటున్నారు.

04/17/2017 - 03:38

ప్రొద్దుటూరు టౌన్, ఏప్రిల్ 16:కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి రసాభాసగా ముగిసింది. కాగా అధికార తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందంటూ వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తన చెప్పుతో తానే కోట్టుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. చంద్రబాబు అధికారంలో ఉన్నంతవరకూ శాసనసభలో కాలు పెట్టనని ఆయన శపథం చేశారు.

04/17/2017 - 03:32

విశాఖపట్నం, ఏప్రిల్ 16: పార్టీ అంతర్గత వ్యవహారాలపై బహిరంగ వేదికపై చర్చించడం ద్వారా పార్టీని రచ్చకెక్కించే వైఖరి తప్పని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఇంధన శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు స్పష్టం చేశారు. విశాఖలో ఆదివా రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్ది రోజులుగా చిత్తూరు ఎంపి శివప్రసాద్ వ్యాఖ్యలపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయ న పరోక్షంగా స్పందించారు.

04/17/2017 - 03:30

కొత్తగూడెం, ఏప్రిల్ 16: సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల చట్టబద్ధత కోసం సమ్మె చేయనున్నట్లు జాతీయ కార్మిక సంఘాల జెఎసి నాయకులు ప్రకటించారు.

04/17/2017 - 03:29

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 16: తిరుపతి వచ్చి నీ బండారం బయటపెడతానంటూ తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎంపీ శివప్రసాద్‌ను హెచ్చరించారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందాన చిత్తూరు ఎంపీ మాట్లాడుతున్నాడంటూ మండిపడ్డారు. సినిమాల్లో నటించే వ్యక్తిని తీసుకొచ్చి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబుపై ఆరోపణలు చేయడం నీచ నైజాన్ని చాటుతోందని విమర్శించారు.

04/17/2017 - 03:49

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 16: మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య అసంతృప్తే కాదు..ప్రజల్లోనూ టిడిపి ప్రభుత్వం పట్ల అసంతృప్తి వుందని నగరి ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో కోర్టు జోక్యం చేసుకోవాల్సి వుందని అభిప్రాయపడుతున్నానన్నారు.

04/17/2017 - 03:27

భీమవరం, ఏప్రిల్ 16: పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాతలు ‘చలో ఢిల్లీ’కి పయనం కానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కలిసి బహుళార్ధ సాధక ప్రాజెక్టు పోలవరం గురించి ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లోని అన్నదాతలు, ఎంపీలను సమీకరించే పనిలో రైతు కార్యాచరణ సమితి ఉంది.

04/17/2017 - 03:26

విజయవాడ, ఏప్రిల్ 16: కొద్దిరోజులుగా అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఐఎఎస్, ఐపిఎస్ అధికారుల బదిలీలు మరో రెండు, మూడురోజుల్లో కొలిక్కిరానున్నాయి. సోషల్ మీడియాలో మరికొద్ది గంటల్లో బదిలీలు అంటూ హడావుడి చేస్తున్నప్పటికీ కొంత సమయం వేచి ఉండక తప్పని పరిస్థితి. కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి, ఆయన స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర ఐఎఎస్‌ల బదిలీలపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు.

Pages