S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/12/2017 - 00:50

విజయవాడ, ఏప్రిల్ 11: ప్రతినెలా రాష్ట్రంలో కోటీ 30 లక్షల మంది కార్డుదారులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న 13 జిల్లాలకు చెందిన 30వేల మంది డీలర్ల కోసం ప్రత్యేకంగా ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దివి లీలామాధవరావు నాయకత్వంలో ఓ ప్రతినిధి బృందం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును కోరింది

04/12/2017 - 00:49

విజయవాడ, ఏప్రిల్ 11: ఎన్టీఆర్ ట్రస్ట్ విద్యా విభాగం ద్వారా విద్యార్హత ఉండి బోధనానుభవం లేనివారికి సీనియర్ అధ్యాపకులతో హైదరాబాద్ గండిపేట్‌లోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్‌లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

04/12/2017 - 00:49

విజయవాడ, ఏప్రిల్ 11: డిజైన్ల ఖరారులో జాప్యం కారణంగా రాజధాని అమరావతి నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు, ఐకానిక్ భవనాల డిజైన్లు ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవటంతో రాజధాని నిర్మాణ పనులు ముందుకు కదలటం లేదు. 900 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్, హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు సంబంధించి తొలుత జపాన్‌కు చెందిన మాకీ సంస్థను కన్సల్టెంట్‌గా నియమించారు.

04/12/2017 - 00:48

విజయవాడ, ఏప్రిల్ 11: నగరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ద్వారా సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను రూపొందించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేస్తున్నారని ఈ సెంటర్ ప్రత్యేకాధికారి వల్లీకుమారి అన్నారు. సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థను దిగువస్థాయి వ్యక్తి వరకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెంటర్‌ను ఏర్పాటు చేసిందన్నారు.

04/12/2017 - 00:48

విజయవాడ, ఏప్రిల్ 11: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వస్తు సేవల పన్ను (జిఎస్టీ) విధానం పట్ల దేశవ్యాప్తంగా అనుకూలత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. గత ఏడాది 1.71 లక్షల కోట్ల మేర వ్యయం చేసినట్లు తెలిపారు. వాణిజ్య పన్నులు, ఆర్థిక శాఖ అధికారులతో ఆయన మంగళవారం వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

04/12/2017 - 00:47

అమరావతి, ఏప్రిల్ 11: త్వరలో జరగనున్న నంద్యాల శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక తెలుగుదేశం నాయకత్వానికి తలనొప్పిలా పరిణమించింది. భూమా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన నంద్యాల సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, సీటు ఆశిస్తున్న వారంతా ప్రముఖులే కావడంతో ఎవరికి ఇవ్వాలో అర్ధంకాని గందరగోళ పరిస్థితి నెలకొంది. వీరిలో ఒకరికి సీటు ఇస్తే మరొకరు వారిని ఓడిస్తామంటూ బహిరంగంగా హెచ్చరికలు చేస్తున్నారు.

04/11/2017 - 02:27

మచిలీపట్నం, ఏప్రిల్ 10: విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఎనిమిదేళ్లు న్యాయ పోరాటం చేసి విజయం సాధించిన పిడతల సత్యంబాబు నేడు జీవన పోరాటం సాగిస్తున్నాడు. ఈ నెల 2న జైలు నుండి బయటికొచ్చిన సత్యంబాబు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నాడు. ‘చేయని నేరానికి నన్ను ఎనిమిదేళ్లు జైలులో బందీని చేశారు. నా కుటుంబం దిక్కులేనిదయింది. ఆర్థికంగా ఛిన్నాభిన్నమైంది.

04/11/2017 - 02:25

నంద్యాల, ఏప్రిల్ 10: కర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు మాజీమంత్రి శిల్పా వర్గీయులు సోమవారం రహస్య సమావేశం నిర్వహించి పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీచేసినట్లు సమాచారం.

04/11/2017 - 02:22

విశాఖపట్నం, ఏప్రిల్ 10: పరిశ్రమల్లో ఉపయోగించే యంత్రాల దీర్ఘకాలిక మన్నికకు, కాలానుగుణంగా వాటిలో తలత్తె లోపాలను పర్యవేక్షించడానికి రిమోట్ కంట్రోల్‌తో సంబంధం లేకుండా స్వయం చోదకంగా సేవలందించే రోబోల తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి.

04/11/2017 - 02:22

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 10: రోజు రోజుకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న పారిశ్రామిక కాలుష్య నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మం డలి వినూత్న తరహాలో నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. కాలంచెల్లిన కాలుష్య నియంత్రణ విధానాలకు స్వస్తిపలికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని ఈ సదస్సుల్లో నిపుణులు సూచిస్తున్నారు.

Pages