S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2017 - 04:07

విజయవాడ, మార్చి 18: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆదిత్య యోగినాథ్ దాస్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుండటంతో ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. లక్నోలో మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే కార్యక్రమానికి విజయవాడ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు ఆయన బయలుదేరి వెళ్లనున్నారు.
సిఎంకు కాపు నేతల కృతజ్ఞతలు

03/19/2017 - 04:07

మచిలీపట్నం (కల్చరల్), మార్చి 18: కృష్ణా జిల్లా గూడూరు మండల పరిధిలోని ముక్కొల్లు గ్రామంలో క్రీ.శ 1403వ సంవత్సరంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని కనుగొన్నట్లు చరిత్ర పరిశోధకుడు ఎండి సిలార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బందరు చరిత్ర పుస్తక రచయిత సిలార్ ముక్కొల్లు జెడ్పీ హైస్కూల్ సమీపంలోని పూడిపోయిన చెరువును ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ డా.

03/19/2017 - 04:00

కదిరి: అనంతపురం జిల్లా కదిరిలో వేంచేసిన శ్రీ ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శనివారం వేడుకగా జరిగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణ మధ్య రథం ముందుకు కదిలింది. కాటమరాయుడి బ్రహ్మరథోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాక, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. తొలుత ఆలయంలోని యాగశాలలో శ్రీవారికి నిత్యహోమం నిర్వహించారు.

03/19/2017 - 03:58

విశాఖపట్నం, మార్చి 18: విద్యా శాఖలో కొద్ది రోజులుగా ప్రశ్నాపత్రాల లీక్‌ల పరంపర కొనసాగుతోంది. పరీక్షలకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ పక్క ప్రకటిస్తున్నా, లీకులు మాత్రం యథావిధిగా జరిగిపోతున్నాయి. ఈ దుస్థితి ఎక్కువగా విద్యాశాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే జరగడం గమనార్హం.

03/19/2017 - 03:54

కాకినాడ, మార్చి 18: రాష్ట్రాల పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ ప్రస్తావన అనేది లేదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిపక్షాలు అవగాహన రాహిత్యంగా విమర్శలు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని ఎవి నగరంలో శనివారం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో యనమల పాల్గొన్నారు.

03/19/2017 - 03:52

విశాఖపట్నం(జగదాంబ), మార్చి 18: విశాఖలో అరుదైన శస్తచ్రికిత్స జరిగింది. శరీర నిర్మాణ లోపంతో నెలలు నిండకుండా జన్మించి, బ్లూ బేబీగా మారిపోయి, ప్రమాదస్థితిలో ఉన్న నవజాత శిశువుకు సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు శనివారం అరుదైన శస్తచ్రికిత్స జరిపి, కాపాడారు. పిల్లల వైద్యనిపుణుడు డాక్టర్ ఎల్.విజయ్, కార్డియాలజిస్ట్‌లు కిరణ్‌బాబు, రంజని ముఖర్జీ సంయుక్త ఆధ్వర్యంలో శస్తచ్రికిత్స చేశారు.

03/19/2017 - 03:52

ఏలూరు, మార్చి 18 : రాష్ట్రంలో పరిపాలనా పరంగా మరో కొత్త సంస్కరణ తెరపైకి వస్తుందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఉన్నత స్థాయిలో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే రానున్న రోజుల్లో ఈ భారీ సంస్కరణ వైపు అడుగులు పడతాయన్న పరిస్థితే కనిపిస్తోంది. ఈ సంస్కరణకు సంబంధించి ఇంతకుముందు కూడా దాదాపు రెండు మూడుసార్లు ప్రయత్నాలు జరిగినా రాజకీయ కారణాలతో అవి వెనక్కి వెళ్లినట్లు తెలుస్తోంది.

03/19/2017 - 03:51

అనంతపురం సిటీ, మార్చి 18: లా 3, 5 సంవత్సరాల న్యాయశాస్త్ర కోర్సులు, 2 సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం పిజి కోర్సులకు సంబంధించిన ప్రవేశపరీక్ష ఏప్రిల్ 19వ తేదీ నిర్వహిస్తున్నట్లు లాసెట్ ఛైర్మెన్, ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ తెలిపారు.

03/19/2017 - 03:51

విజయనగరం, మార్చి 18: రాష్ట్రంలో త్వరలో 45 మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ఏర్పాటు చేయనున్నట్టు పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ కె.కృష్ణమూర్తి వెల్లడించారు. ప్రస్తుతం టెండర్లు దశలో ఉన్నాయన్నారు. ఈ మేరకు శనివారం ‘ఆంధ్రభూమి’తో మాట్లాడారు. ప్రతి జిల్లాకు మూడు మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు రాబోతున్నాయని, వీటితో పాడిపశువులకు వైద్య సేవలు అందిస్తామని వివరించారు.

03/19/2017 - 03:50

నార్పల, మార్చి 18: భైరవుని సన్నిధిలో గంగమ్మ ఉబికి ఉబికి వస్తోంది. ఒకటి రెండు కాదు ఏకంగా 175 బోరు బావుల్లో నీరు పుష్కలంగా పడింది. ఈ బోర్లన్నీ పక్కపక్కనే ఉండడం గమనార్హం. ఏడాది పొడవునా బోర్లలో నీరు వస్తుండడంతో గ్రామంలోని రైతులు అరటితోటలు పండించి లాభాలు గడిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ శివారులోని భైరవుడి ఆలయం, అక్కడి బోర్ల సంగతి ఓసారి పరికిద్దాం..

Pages