S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/18/2017 - 00:23

సీలేరు, మార్చి 17: బలిమెల జలాశయం నీటి వినియోగంపై ఆంధ్రా-ఒడిశా జెన్‌కో అధికారులు శుక్రవారం ఉదయం ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని చిత్రకొండ ఒడిశా అతిథి గృహంలో సమావేశమై చర్చించారు. ఇప్పటి వరకు బలిమెల జలాశయం నుంచి ఇరు రాష్ట్రాలు ఎంతెంత నీటిని వాడుకున్నారనే దానిపై మాట్లాడారు.

03/18/2017 - 00:22

మార్కాపురం, మార్చి 17: పొగాకు లోడుతో వస్తున్న ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మృతి చెందగా 15మందికి తీవ్రగాయాలైన సంఘటన కంభం సమీపంలోని పోరుమామిళ్ళపల్లి మూలమలుపు వద్ద శుక్రవారం జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామానికి చెందిన 23మంది కూలీలు తురిమెళ్ళలో పొగాకు వేసుకొని వస్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి మూలమలుపు వద్ద బోల్తాపడింది.

03/18/2017 - 00:22

మడకశిర, మార్చి 17: పదవ తరగతి పరీక్ష ప్రారంభమైన 20 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. వాట్సాప్‌లో హల్‌చల్ చేసింది. వెంటనే అప్రమత్తమైన విద్యాశాఖ అధికారులు సంబంధిత ఇన్విజిలేటర్‌పై వేటు వేశారు. అదే విధంగా ప్రశ్నపత్రం బయటకు పంపిన విద్యార్థినిపై మాల్‌ప్రాక్టీస్ కింద కేసు నమోదుచేశారు. అనంతపురం జిల్లా మడకశిరలో శుక్రవారం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

03/18/2017 - 00:15

గుంటూరు, మార్చి 17: అమెరికాలోని భారతీయులపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికైనా స్పందించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో చర్చించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ డిమాండ్ చేశారు. గుంటూరులో శుక్రవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల క్రితం ఉద్యోగాలు, వ్యాపారాల కోసం అమెరికా వెళ్లి స్థిరపడిన వివిధ దేశస్తులపై దాడులు చేయటం దారుణమన్నారు.

03/18/2017 - 00:14

విజయవాడ, మార్చి 17: హేవలంబి నామ ఉగాది ఉత్సవాల నిర్వహణ, కళారత్న పురస్కారాల ఎంపికకు సలహా మండలిని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మండలికి శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ అధ్యక్షునిగా వ్యవహరిస్తారని, వివిధ విభాగాలకు చెందిన 12 మంది ప్రముఖులు సభ్యులుగా ఉంటారని తెలిపింది.

03/18/2017 - 00:14

అమరావతి, మార్చి 17: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమవుతోంది. మణిపూర్, పంజాబ్, యుపి, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల్లో ఓటమిపాలవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.

03/18/2017 - 00:13

విజయవాడ, మార్చి 17: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పంచాంగకర్త గార్గేయ సిద్ధాంతి, కంచికామకోటి పీఠం సిద్ధాంతి ఎల్ సుబ్రహ్మణ్యం, హనుమంత వజ్జల సుబ్రహ్మణ్యం కలిశారు. అనేక రాష్ట్రాల్లో ఈ నెల 28న ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నారని, నాసా చెప్పిన పద్ధతిలో 29న పాడ్యమి లేదని ముఖ్యమంత్రికి గార్గేయ వివరించారు. మన రాష్ట్రంలోనూ 28న నిర్వహించాలని సూచించారు.

03/18/2017 - 00:12

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 17: రాష్ట్భ్రావృద్ధితో పాటు పరిపాలనలో కీలక పాత్ర వహించే బడ్జెట్ ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానురాను అపహాస్యం చేస్తున్నారని, ప్రస్తుత వార్షిక బడ్జెట్‌ను చూస్తే ఈవిషయం స్పష్టంగా అవగతమవుతుందని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి శుక్రవారం ఇక్కడ విమర్శించారు. గత మూడు బడ్జెట్‌ల మాదిరిగానే ప్రస్తుత బడ్జెట్ కూడా నిరాశాజనకంగా వుందన్నారు.

03/17/2017 - 04:10

రాజమహేంద్రవరం, మార్చి 16: ఏ సాగునీటి ప్రాజెక్టుకైనా అంచనాలకు అనుగుణంగా ఆయకట్టు వుంటుంది.. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తికాకపోతే.. రోజులు గడిచే కొద్దీ అంచనాలు పెరగడం కూడా రివాజు.. మధ్యతరహా భూపతిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం అంచెలంచెలుగా అంచనాలు పెరిగాయి.. కానీ ఆయకట్టు మాత్రం అంతకంతకూ తగ్గిపోయింది.. ప్రాజెక్టు డిజైన్ చేసిన నిర్దేశిత ఆయకట్టు మాయమైంది..

03/17/2017 - 04:07

విశాఖపట్నం, మార్చి 16: ఆంధ్రా యూనివర్శిటీ, అనుబంధ కళాశాలల్లో జరుగుతున్న బిఎస్సీ పరీక్షల్లో గురువారం మ్యాథ్స్ పేపర్-3 లీక్ అయింది. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ఈ పరీక్ష జరగాల్సి ఉండగా, 12.30 గంటలకే పేపర్ వాట్స్‌ఆప్‌ల్లో వెలిగిపోయింది. వెంటనే ఆంధ్రా యూనివర్శిటీ పరీక్షల నిర్వహణ విభాగానికి సమాచారం అందింది.

Pages