S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/24/2017 - 05:16

హైదరాబాద్, ఫిబ్రవరి 23: ఆంధ్రప్రదేశ్‌లో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు పాఠ్యపుస్తకాల ముద్రణకు సంబంధించి టెండర్ల ప్రక్రియలో తెలంగాణ వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్స్ అసోసియేషన్ కూడా పాల్గొనేందుకు అనుమతించాలని హైకోర్టు గురువారం ఏపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం జారీ చేసింది. అసోసియేషన్ అధ్యక్షుడు డి వినోద్‌కుమార్ తరఫున న్యాయవాది లంచ్ మోషన్‌ను గురువారం ప్రస్తావించారు.

02/24/2017 - 05:15

హైదరాబాద్, ఫిబ్రవరి 23: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలను ఈఏడాది జూన్ 18 నే నిర్వహించాలని యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ యోచిస్తోంది. ప్రతి ఏటా ప్రిలిమినరీ పరీక్షలను యుపిఎస్‌సి ఆగస్టులో నిర్వహిస్తోంది. 2013లో ప్రిలిమినరీ పరీక్షను మే 26న నిర్వహించారు.

02/24/2017 - 05:03

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: ప్రముఖ సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో సినిమా తీస్తానని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి ప్రకటించారు. గురువారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ వీరిద్దరితో సినిమా తీయాలని నిర్ణయించానని, అయితే ప్రస్తుతం సినిమా షెడ్యూల్స్‌తో విరామం లేకుండా ఉన్నారన్నారు. వీరిద్దరికి తగిన విధంగా సమతుల్యత కలిగి ఉండే కథ గురించి చూస్తున్నామన్నారు.

02/24/2017 - 05:01

అమరావతి, ఫిబ్రవరి 23: గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ విజయం అందించిన ఉభయ గోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ సీట్ల కోసం పెరుగుతున్న పోటీ నాయకత్వానికి అగ్నిపరీక్షగా పరిణమించింది. స్థానిక సంస్థల కోటాలో జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో తమకు సీట్లు ఇవ్వాలంటూ కులం కార్డుతో నేతలు చేస్తున్న ఒత్తిళ్లు నాయకత్వాన్ని హడలెత్తిస్తున్నాయి.

02/24/2017 - 05:00

విజయవాడ, ఫిబ్రవరి 23: రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలు, ఐరిస్ పడనివారికి ప్రతినెలా 12, 13 తేదీల్లో ఒక తేదీని నిర్ణయించి ప్రత్యేకంగా రేషన్ అందించడానికి సన్నాహాలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవారికి లబ్ధి చేకూర్చాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆశయం అని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు.

02/24/2017 - 04:59

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు వేలంలో ప్రభుత్వమే ఆయా ఆస్తులను కొనుగోలు చేసి పరిహార పంపిణీ చర్యలను వేగవంతం చేసేలా రాష్ట్ర గవర్నర్ సిఎల్‌ఎన్ నరసింహన్ చర్యలు తీసుకోవాలని ఎపిసిసి నేతలు కోరారు.

02/24/2017 - 04:59

విజయవాడ, ఫిబ్రవరి 23: రాజధాని పరిధిలోని 29 గ్రామాల అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, పెద్దఎత్తున జరుగుతున్న అభివృద్ధి ప్రక్రియలో వాటి ఉనికి కోల్పోకుండా ఆనవాళ్లను నిలుపుకోవాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్ సారధ్యంలోని నిష్ణాతుల కమిటీ నిర్ణయించింది.

02/24/2017 - 04:43

శ్రీశైలం, ఫిబ్రవరి 23: మహాశివరాత్రి రోజు మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు శ్రీగిరికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చేవారు కొందరు, వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో వచ్చే వారు మరికొందరు. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో శ్రీశైలం కిటకిటలాడుతోంది. గురువారం సాయంత్రానికి సుమారు 2 లక్షల మంది భక్తులు శ్రీగిరి చేరుకున్నారు.

02/24/2017 - 04:41

విశాఖపట్నం, ఫిబ్రవరి 23: మంత్రి గంటా శ్రీనివాసరావు, అతని బంధువులకు చెందిన కొన్ని ఆస్తుల స్వాధీనానికి ఇండియన్ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. గంటా శ్రీనివాసరావు, అతని బంధులకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోసం ఇండియన్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఈ నిర్ణయం తీసుకుకున్నారు.

02/24/2017 - 04:40

విజయవాడ, ఫిబ్రవరి 23: ఉపాధి హామీ పథకం నిధులను ప్రతి శాఖ అవకాశం ఉన్నంత మేరకు సమర్థవంతంగా, జవాబుదారీతనం ఉండేలా వినియోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.6 వేల కోట్ల వరకు ఉపాధిహామీ నిధులు ఖర్చు పెట్టగలిగామని, రానున్న ఆర్థిక సంవత్సరంలో ఇంతకుమించి రూ.7,200 కోట్ల నిధులను సద్వినియోగపరుచుకోవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించారు.

Pages