S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/21/2017 - 03:12

విజయవాడ, ఫిబ్రవరి 20: రాష్ట్రంలోని పాఠశాలల్లో మార్చి నాటికి పూర్తిస్థాయిలో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలని అధికారులను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. విజయవాడలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈమేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.

02/21/2017 - 03:11

విశాఖపట్నం, ఫిబ్రవరి 20: ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఘట్టం మొదలైనప్పటి నుంచి శనివారం వరకూ 21 మంది నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు సోమవారం 13 మంది తమ నామినేషన్ పత్రాలను సహాయ రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

02/21/2017 - 03:11

అనంతపురం, ఫిబ్రవరి 20: అనంతపురం, కడప, కర్నూలు పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగిసింది. సోమవారం ఆఖరి రోజు 53 నామినేషన్లు దాఖలయ్యాయి.

02/21/2017 - 03:10

వేలేరుపాడు, ఫిబ్రవరి 20: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కటుకూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో 39 గృహాలు దగ్ధమయ్యాయి. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. ఆదివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో పెరుమళ్ల శ్రీను అనే వ్యక్తి ఇంట్లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి.

02/21/2017 - 03:10

మదనపల్లె, ఫిబ్రవరి 20: చేసింది చిన్నతప్పైనా.. ఎటువంటి విచారణ లేకుండా కేసు నమోదు చేశారు. పోలీసుల దృష్టిలో ఆ నేరం పెద్దదే. చేసిన చిన్నతప్పుకు చింతిస్తునే పాఠశాలకు వెళ్ళగా ఆపాఠశాల ప్రధానోపాధ్యాయుడు లోనికి రానివ్వకుండా అడ్డుకున్నాడు. మరోవైపు పోలీసులు 324సెక్షన్‌పై జూవైనల్ కేసునమోదు చేసి వెంటాడటం మొదలు పెట్టారు. దీంతో ఓ బాలుడు మనస్తాపంతో పరార్ కాగా, మరోబాలుడు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు.

02/21/2017 - 03:08

అమరావతి, ఫిబ్రవరి 20: జనసేన దళపతి పవన్ కల్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ ఖరారయింది. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా సోమవారం చేనేతల ఐక్యవేదికపై ఆయన చేసిన ప్రసంగం దీనిని స్పష్టం చేసింది. చాలాకాలం తర్వాత రాజధాని అమరావతిలో పవన్ హాజరైన బహిరంగసభ విజయవంతమయింది. ప్రధానంగా చేనేత కార్మికులు భారీ సంఖ్యలో దీనికి హాజరయి, పవన్ కోటిమందితో సమానమంటూ కీర్తించారు.

02/21/2017 - 02:08

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఎమ్మార్ కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ కొడుకు కోనేరు ప్రదీప్ నివాసంలో సిబిఐ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ప్రసాద్ నివాసంలో సిబిఐ అధికారులు సోమవారం సోదాలు జరిపారు. ఢిల్లీ, చెన్నైలోని ఆయన కార్యాలయాలలో చేపట్టిన సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లో కూడా సిబిఐ సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

02/21/2017 - 02:07

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎమ్.ఎస్.ఎస్.వై) పథకం కింద రాష్ట్రంలోని ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జెపి నడ్డా, అనిల్ మాధవ్ ధవేలతో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ భేటీ అయ్యారు.

02/20/2017 - 12:32

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు నేడు శాసనసభ, శాసన మండలి భవనాలను పరిశీలించారు. స్పీకర్‌తోపాటు డిప్యూటీ స్పీకర్‌, మండలి ఛైర్మన్‌ ఉన్నారు. వివిధ పేషీలు, మంత్రుల ఛాంబర్లు, గ్యాలరీలను వారు పరిశీలించారు.

02/20/2017 - 12:31

అమరావతి: నీటిపారుదల ప్రాజెక్టులపై ఏటా వేల కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. రాబోయే ఎన్నికలకు ముందే రాష్ట్రంలో అందరికీ నీటి భద్రత కల్పించాలని సీఎం చంద్రబాబు సూచించారు. నీరు-ప్రగతిపై కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటివరకు 2,40,444 పంటకుంటల తవ్వకం పూర్తయిందన్నారు. ఏప్రిల్‌ నాటికి 4 లక్షల పంటకుంటల తవ్వకం పూర్తి చేయాలని ఆదేశించారు.

Pages