S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/18/2017 - 02:42

కాకినాడ సిటీ, ఫిబ్రవరి 17: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇద్దరు బాలికలు చెరువులో పడి మృతిచెందిన విషాద ఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం చోటుచేసుకుంది. కాకినాడ వన్‌టౌన్ సిఐ ఎఎస్ రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక అన్నమ్మఘాటి ప్రాంతంలో నివాసం ఉంటున్న మందపల్లి వీర్రాజు అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం ఒక శుభకార్యం జరిగింది.

02/18/2017 - 02:40

మచిలీపట్నం, ఫిబ్రవరి 17: కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలోని కృష్ణా విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో స్థానిక హిందూ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు.

02/18/2017 - 02:38

హైదరాబాద్, ఫిబ్రవరి 17: ఒక డిటెన్యూను నిర్బంధించేందుకు కారణాలను వివరిస్తూ ఇచ్చే ఉత్తర్వులు, ఇతర డాక్యుమెంట్లను మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో ఇచ్చినందుకు చిత్తూరు జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌కు హైకోర్టు 25వేల రూపాయల పెనాల్టీని విధిస్తూ తీర్పు ఇచ్చింది. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ యు దుర్గాప్రసాద్‌రావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

02/17/2017 - 05:11

అనంతపురం సిటీ, ఫిబ్రవరి 16: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ, పట్ట్భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వర్న రఘురామయ్య, పట్ట్భద్రుల స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా కర్నూలు జిల్లా మిడుతూరు మండలం నాగలూటి గ్రామానికి చెందిన వై.ఓబులన్న నామినేషన్ వేశారు.
42.60 లక్షల మందికి

02/17/2017 - 05:07

విజయవాడ, ఫిబ్రవరి 16: పూర్తిస్థాయిలో నగదు రహిత లావాదేవీలు జరుపుకునే దిశగా రాష్ట్రంలో ఉన్న అన్ని రేషన్ కార్డులను మరో వారం రోజుల్లో ఎన్‌పిసిఎల్ (పేమెంట్ గేట్వే) పరిధిలోకి తీసుకువచ్చి ఆన్‌లైన్‌లోకి అనుసంధానించాలని జిల్లా అధికారులను పౌరసరఫరాల కమిషనర్ బి.రాజశేఖర్ ఆదేశించారు.

02/17/2017 - 05:06

కడప, ఫిబ్రవరి 16: కడప జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్లాంట్ రెండవ గని నుంచి ముడి యురేనియం వెలికితీతకు రంగం సిద్ధమైంది. వేముల మండలం రాచగుంటపల్లె రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడంతో ముడి యురేనియం వెలికి తీసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేముల మండలం ఎం.తుమ్మలపల్లెలో 2012 ఏప్రిల్ 20న ముడి యురేనియం వెలికితీసే పనులు ప్రారంభమయ్యాయి.

02/17/2017 - 05:04

విశాఖపట్నం, ఫిబ్రవరి 16: సీషెల్ కోస్ట్‌గార్డ్ పెట్రోల్ వెసల్ టోపాజ్‌ను పూర్తి స్థాయిలో ఆధునీకరించి తిరిగి సీషెల్ కోస్ట్‌గార్డ్‌కు, భారత కోస్ట్‌గార్డ్ అధికారులు అప్పగించారు. నేవల్ డాక్‌యార్డ్‌లో గురువారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సీషెల్, భారత కోస్టగార్డ్ అధికారులు పాల్గొన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో విశాఖలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు టోపాజ్ విశాఖకు వచ్చింది.

02/17/2017 - 05:00

గుంటూరు (కల్చరల్), ఫిబ్రవరి 16: సకల సంపదలను ప్రసాదించి, మానవాళికి సర్వ శుభాలను అనుగ్రహించే కామధేనువులాంటి గో సంరక్షణకు పాటుపడటమే కాకుండా, అదేరీతిలో గోమాత సేవలో తరించాల్సిందిగా హిందూ బంధువులందరికీ హంపీ విరూపాక్ష పీఠాధిపతి, జగద్గురు శ్రీ విద్యారణ్య భారతీస్వామి పిలుపునిచ్చారు.

02/17/2017 - 04:03

అమరావతి, ఫిబ్రవరి 16: తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించి, దేశ రాజధానిలో పార్టీ పతాకానికి గౌరవం తెచ్చిన దివంగత మాజీ ఎంపి కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబంలో రాజకీయ అధిపత్యపోరు మొదలయింది. ఎర్రన్నాయుడి సోదరుడైన మంత్రి అచ్చెన్నాయుడుకు, ఎర్రన్నాయుడు కుటుంబానికి రాను రాను దూరం పెరిగి, అది చివరకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వరకూ వెళ్లిందన్న ప్రచారం ఆసక్తికరంగా మారింది.

02/17/2017 - 03:58

విజయవాడ, ఫిబ్రవరి 16: ఆడపిల్ల అంటే త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటున్నారని, ఆ విధానం నుంచి బయటకు వచ్చి బాలికలు చదువుకునేలాగా సహకరించి వారి కాళ్ల మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడేలా ఆసరా కల్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు.

Pages