S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/28/2017 - 02:47

న్యూఢిల్లీ, జనవరి 27: జల్లికట్టు స్ఫూర్తి అయితే అదే ఆట ఆడుకోవాలి, లేకపోతే పందుల, కోళ్ల పందేలు ఆడుకోవచ్చని తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి క్షమాపణలు చెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఉద్దేశించి పందుల పందేలు అంటూ తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలయినా దెబ్బతిని వుంటే క్షమించాలని కోరారు.

01/28/2017 - 02:44

విజయవాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగుల, జర్నలిస్టుల ఆరోగ్య పథకం వైద్యసేవల ధరలపై ఇటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ అటు ఆం.ప్ర. స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ‘ఆషా’ల మధ్య నేటికీ ప్రతిష్టంబన కొనసాగుతున్నది.

01/28/2017 - 02:38

హైదరాబాద్, జనవరి 27: విద్యుత్ వినియోగదారులకు వారి హక్కుల గురించి చైతన్యపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి , ఏపి లీగల్ సర్వీసస్ అథారిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఈ నెల 28వ తేదీ శనివారం విజయవాడలోవిద్యుత్ వినియోగదారులకు విద్యుత్ చట్టాలపై చైతన్యం కల్పించేందుకు కార్యక్రమాలను చేపట్టననుంది. ఈ కార్యక్రమానికి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్ హాజరవుతారు.

01/28/2017 - 02:31

అమరావతి, జనవరి 27: ఇప్పటివరకూ మిత్రపక్షంగా ఉన్న అధికార తెలుగుదేశం పార్టీతో జనసేనాధిపతి ఇక తెగతెంపులు చేసుకున్నట్లేనా? ఇప్పటివరకూ కేవలం ఆ పార్టీ ఎంపీలనే లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసిన పవన్.. తాజాగా సీఎం, తెదేపా అధినేత చంద్రబాబునూ లక్ష్యంగా చేసుకుని సంధించిన ఘాటు విమర్శనాస్త్రాలు పరిశీలిస్తే ఈ వాదన నిజమేననిపించక మానదు.

01/28/2017 - 02:29

విజయవాడ, జనవరి 27: మహిళల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే దిశగా తొలిసారిగా ఫిబ్రవరి 10-12 తేదీల్లో విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద జరుగనున్న జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సులో సుదీర్ఘ చర్చలనంతరం మహిళా సాధికారతపై అమరావతి డిక్లరేషన్ చేయనున్నామని శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

01/28/2017 - 02:27

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 27: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికై చేపట్టిన భూ సమీకరణ పథకం అమలుపై అధ్యయనానికి మహారాష్ట్ర అధికారుల బృందం విచ్చేసింది. మహారాష్టల్రో చేపట్టనున్న రోడ్డు ప్రాజెక్టులు, స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం చేయాల్సిన భూ సమీకరణకు గాను చేయాల్సిన ప్రక్రియపై అధ్యయనం కోసం శుక్రవారం నగరానికి చేరుకొన్న అధికార బృందానికి సిఆర్‌డిఎ అదనపు కమిషనర్ ఎ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు.

01/28/2017 - 01:41

విజయవాడ, జనవరి 27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగుల, జర్నలిస్టుల ఆరోగ్య పథకం వైద్యసేవల ధరలపై ఇటు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ అటు ఆం.ప్ర. స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ‘ఆషా’ల మధ్య నేటికీ ప్రతిష్టంబన కొనసాగుతున్నది.

01/28/2017 - 01:40

న్యూఢిల్లీ,జనవరి 27: ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారనోయ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్‌రావు విమర్శించారు.

01/28/2017 - 01:39

విజయవాడ (క్రైం), జనవరి 27: ప్రతిపక్ష నాయకుని హోదాలోనే పోలీసులను, జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇక ముఖ్యమంత్రి అయితే సామాన్యులను బతకనిస్తాడా అంటూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు.

01/27/2017 - 05:16

విశాఖపట్నం, జనవరి 26: నవ్యాంధ్రలో విస్తృత పెట్టుబడుల సాధన లక్ష్యంగా శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు భాగస్వామ్య సదస్సు జరగనుంది. సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ పేరిట గతేడాది విశాఖలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సుకు కొనసాగింపుగా వరుసగా రెండోసారి కూడా విశాఖ కేంద్రంగానే ఈ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

Pages