S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/26/2017 - 08:23

విశాఖపట్నం, జనవరి 25: అందరి దృష్టి విశాఖ పైనే ఉంది. మొన్నటి వరకూ అంతగా పట్టించుకోని ప్రత్యేక హోదా ఉద్యమం ఒక్క సారిగా ఊపిరిపోసుకుంది. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమంతో అనుకున్నది సాధించుకున్న తమిళుల పోరాటపటిమను స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని సమాయత్తం కావడం, దీనికి కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు పలకడంతో ఉద్యమానికి కొత్త రూపు సంతరించుకుంటోంది.

01/26/2017 - 08:18

హైదరాబాద్, జనవరి 25: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా గురువారం విశాఖపట్నం ఆర్‌కె బీచ్‌లో జరి గే కొవ్వొత్తుల ర్యాలీలో తాను స్వయం గా పాల్గొంటున్నానని, పోలీసులు ఆంక్ష లు పెట్టినా వెనుకడుగు వేసేది లేదని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. తనను అరెస్టు చేసినా చేసుకోవచ్చని ఆయన అన్నారు.

01/26/2017 - 08:17

విజయవాడ, జనవరి 25: ‘మీ కోసం నేను నిరంతరం ప్రయత్తిస్తున్నాను. యువత భవిష్యత్తు కోసం తాపత్రయ పడుతున్నా.. కానీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం యువతను, విద్యార్థులను రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం? అదీ భారత గణతంత్ర వేడుకల రోజున నిరసనలు తెలియజేయటం సబబేనా?’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.

01/25/2017 - 05:25

యాడికి, జనవరి 24: బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన సంఘటన ఇది. పనివేళలు ముగిసిన అనంతరం బ్యాంకుకు తాళం వేయకుండా వెళ్లిపోయారు అనంతపురం జిల్లా యాడికిలోని సిండికేట్ బ్యాంక్ సిబ్బంది. అర్ధరాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్‌ఐ ఇది గమనించి వెంటనే తన వద్ద బేడీలు వేసి సిబ్బందికి ఉదయం కబురుపెట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.

01/25/2017 - 05:23

కడప, జనవరి 24: జిల్లాలో నెలకొన్నకరవును కళ్లారా చూశామని, ప్రతి రైతు, ప్రతి కూలీకి న్యాయం జరిగేలా కేంద్రానికి నివేదిక ఇస్తామని కేంద్ర కరవు బృందం టీమ్‌లీడర్, సీనియర్ ఐఎఎస్ అధికారి అమితాబ్ గౌతమ్ పేర్కొన్నారు. కేంద్ర కరవుబృందం మంగళవారం కడప జిల్లా రామాపురం, రాయచోటి, సంబేపల్లె మండలాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి ముఖాముఖి నిర్వహించింది.

01/25/2017 - 05:18

అమరావతి, జనవరి 24: తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం వృధా అవుతోందా? విపక్షాలు ఏకమయి, సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నా ఇప్పటివరకూ అసలు ఆ సమస్యలనే గుర్తించడంలో మంత్రులు విఫలమవుతున్నారా? జిల్లాల్లో పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం సాధించడం, విపక్షాలపై ఎదురుదాడిలో మంత్రులు చేతులెత్తేశారా?

01/25/2017 - 05:17

విజయవాడ, జనవరి 24: కొత్త మద్యం లైసెన్సు విధానాన్ని జూన్‌లో ప్రకటించనున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్, బిసి సంక్షేమ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడుతూ ఈసారి బార్, వైన్ షాపులకు కలిపి ఒకేసారి లైసెన్సు విధానాన్ని ప్రకటించనున్నట్లు తెలిపారు.

01/25/2017 - 05:17

అమరావతి, జనవరి 24: ఉపాధి హామీ పనుల్లో దేశంలో మన రాష్టమ్రే ముందుండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు. ఢిల్లీ నుంచి ‘నీరు-ప్రగతి’ పురోగతిపై రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఎంపిడివోలు, ప్రజాప్రతినిధులతో ఆయన మంగళవారంనాడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

01/25/2017 - 05:13

విజయవాడ (క్రైం), జనవరి 24: రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రచారం ఆధారంగా చేపట్టే సమావేశాలు, సభలను అనుమతించబోమని డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో విజయవాడ, విశాఖ, తిరుపతి పట్టణాల్లో ఈ నెల 26న సమావేశమయ్యేందుకు తరలిరావాలంటూ సోష ల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఆగంతకుల పిలుపు మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తే అడ్డుకుంటామని చెప్పారు.

01/25/2017 - 05:13

విజయవాడ, జనవరి 24: ఢిల్లీలోని గుర్గావ్‌లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం సందర్శించారు. అక్కడ టెనె్నల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యతా ప్రమాణాలు, వాటికయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం తదితర వివరాలను అక్కడి అదికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణాల్లో పేదల కోసం 1,20,000 ఇళ్లను ప్రభుత్వం నిర్మించనుంది.

Pages