S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/25/2017 - 03:57

నెల్లూరు, జనవరి 24: ప్రజలను దోచుకోవటం ప్రజాపాలన కాదని, దాచుకున్నది ప్రజలకు పంచి పెట్టటమే ప్రజాపాలన అని, రామరాజ్యంలో ఇదే అమలయ్యేదని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. జిల్లా కేంద్రంలోని దర్గామిట్టలో ఉన్న అష్టలక్ష్మీ సమేత స్వర్ణ మహాలక్ష్మీ ఆలయంలో మంగళవారం నిర్వహించిన బ్రహ్మ కలశాభిషేక మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు అనుగ్రహభాషణ చేశారు.

01/25/2017 - 03:55

హైదరాబాద్, జనవరి 24: విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో మూడు దశల ఆందోళన కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది.

01/25/2017 - 03:54

శ్రీ కాళహస్తి, జనవరి 24: ప్రత్యేక హోదా కోసం జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ చేస్తున్న పోరాటాన్ని స్వాగతిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం చిత్తూరుజిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు.

01/25/2017 - 03:53

అనంతపురం, జనవరి 24: ప్రత్యేక హోదా.. ఆంధ్రుల హక్కు నినాదంతో అనంతపురం జిల్లాలో మళ్లీ ఆందోళనలు చేపట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, యువత, విద్యార్థులు సమాయత్తమవుతున్నారు.

01/25/2017 - 03:50

న్యూఢిల్లీ, జనవరి 24: ఢిల్లీ దగ్గరలో ఉన్న గుర్గావ్‌లో పేదలకోసం కేంద్రం నిర్మిస్తున్న గృహాలను ఏపీ పురపాలకశాఖ మంత్రి నారాయణ మంగళవారం నాడు సందర్శించారు. గుర్గావ్‌లో టనె్నల్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మిస్తున్న ఇళ్లలో నాణ్యతా ప్రమాణాలు,వాటికయ్యే ఖర్చు,నిర్మాణానికి పడుతున్న సమయం తదితర వివరాలను అక్కడి అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.

01/25/2017 - 03:50

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హిందూదేవాలయాల్లో పనిచేస్తున్న అర్చకులను వంచిస్తోందని, రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఎపి అర్చక సమాఖ్య ఆరోపించింది. అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎ. ఆత్రేయబాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి పెద్దింటి రాంబాబు ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

01/25/2017 - 03:49

హైదరాబాద్, జనవరి 24:ద్యావుడా తెలుగు సినిమాపై హైదరాబాద్ హైకోర్టు మంగళవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేషన్‌కు నోటీసు జారీ చేసింది. దేవుళ్లను కించ పరిచే విధంగా సినిమాలో కొన్ని దృశ్యాలు ఉన్నాయని నగరానికి చెందిన సుభద్రమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్న ఇలాంటి సినిమాకు ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు.

01/25/2017 - 03:48

ఏలూరు, జనవరి 24 : రాష్ట్రంలో ఇంత వరకూ పది జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటించామని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనరు ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. మరో మూడు నెలల్లో రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలను కూడా సారా రహితంగా తీర్చిదిద్దుతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా నాటుసారా లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.

01/25/2017 - 03:48

తిరుపతి, జనవరి 24: చంద్రబాబు నాయుడు సిఎం అయ్యాకే శేషాచలం కొండల్లోని విలువైన ఎర్రచందనం అక్రమంగా తరలిపోతోందని, దీని వెనుక సిఎం హస్తముందుని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమరవాణాను ఉక్కుపాదంతో అణచివేస్తామని, స్మగ్లర్ల అంతు చూస్తానని బాబు బీరాలు పలికారని అన్నారు.

01/23/2017 - 04:39

హిరమండలం/ ఎల్.ఎన్‌పేట, జనవరి 22: సమస్యలు పరిష్కరించకుండా వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు పోలీసుల పహరాతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో సహనం కోల్పోయిన నిర్వాసితులు ఆగ్రహం ఉగ్రరూపం దాల్చింది. రిజర్వాయర్ నిర్మాణ చరిత్రలో లేని విధంగా వంశధార నిర్వాసితులు కట్టలు తెంచుకోవడంతో ఆందోళనలు పెల్లుబికాయి. సోమా గుత్తేదారుల ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి.

Pages