S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/24/2016 - 04:39

హైదరాబాద్, డిసెంబర్ 23: ఈ ఏడాదితో కలిపి వచ్చే మూడేళ్లకు 2018-19 సంవత్సరం వరకు ప్రైవేట్ బిఇడి కాలేజీల ప్రవేశానికి ఫీజును నిర్ణయించాలని హైకోర్టు శుక్రవారం ఏపి ఫీజు రెగ్యులేషన్ కమిషన్‌ను ఆదేశించింది. ఏపిఫీజు రెగ్యులేషన్ కమిషన్ ఫీజును నిర్ధారించకపోవడాన్ని సవాలు చేస్తూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కాలేజీ యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ పి నవీన్ రావువిచారించారు.

12/24/2016 - 04:38

శ్రీశైలం, డిసెంబర్ 23: కర్నూలు జిల్లా శ్రీశైలం ఘాట్‌లో టూరిస్టు బస్సు శుక్రవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరంతా భవాని మాలధారులు కావడం గమనార్హం. వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా మార్టురు గ్రామానికి చెందిన 45 మంది భక్తులు భవానిమాల ధరించి దీక్ష విరమణ నిమ్తితం టూరిస్టు బస్సులో శ్రీశైలం బయలుదేరారు.

12/24/2016 - 04:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 23:జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలకు ఇచ్చే పరిహారాన్ని కేంద్రమే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించే పరిహారం విషయంలో కొన్ని వస్తువులపై సెస్ విధించాలన్న ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినట్టు ఆయన తెలిపారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన జీఎస్‌టి కౌన్సిల్ రెండోరోజు సమావేశంలో మంత్రి యనమల పాల్గొన్నారు.

12/24/2016 - 04:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 23:అమృత్ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో పట్టణాల అభివృద్ధికి 2,890 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదం తెలిపింది. ఈ పథకంలో భాగంగా వచ్చే మూడేళ్లలో ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న 14 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన వివరాలను పట్టణాభివృద్ధి శాఖ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

12/24/2016 - 04:37

హైదరాబాద్, డిసెంబర్ 23: శాసనసభలో జరిగిన గలాభాపై వైకాపా ఎమ్మెల్యేలను ఏపిప్రివిలేజి కమిటీ సభ్యులు విచారించేందుకు పిలిచి, సభ్యులు తమ వాదనలు చెబుతున్నప్పుడు అసంబద్ధమైన అంశాలను ప్రస్తావించారని హక్కుల కమిటీ సభ్యుడు పి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ అంశంపై ఆయన శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్‌రావుకు లేఖ రాశారు.

12/24/2016 - 04:36

డోన్, డిసెంబర్ 23: కర్నూలు జిల్లా డోన్ వద్ద జాతీయరహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులోప్రయాణిస్తున్న అనంతపురం నగరానికి చెందిన వైకాపా నేత. మాజీ కౌన్సిలర్ వైఎస్ రామమోహన్‌రెడ్డి(50).

12/24/2016 - 04:36

హైదరాబాద్, డిసెంబర్ 23: జిల్లాకలెక్టర్ల సదస్సులో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల సమస్యలు చర్చించకుండా కాలక్షేపం చేశారని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, రబీ సీజన్‌లో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా అనవసరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. దేశ వ్యాప్తంగా సాగు పెరిగితే, ఆంధ్రాలో మాత్రం రబీ సాగు తగ్గిందన్నారు.

12/24/2016 - 04:35

అమరావతి, డిసెంబర్ 23: రావెల కిశోర్‌బాబు.. రైల్వే అధికారి నుంచి రాజకీయ నేతగా అవతారమెత్తి, తొలి పోటీతోనే మంత్రి పదవి పొందినవారు. కొత్తగా పార్టీలో చేరి మంత్రి పదవి పొందిన ఆయన తీరు ఆ నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నా, నాయకత్వం ఉపేక్షించడంపై జిల్లా నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

12/23/2016 - 05:39

కాకినాడ, డిసెంబరు 22: అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందని ఎపిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి చెప్పారు. అందుకే రాష్ట్రంలో ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వచ్చే రెండు నెలల్లో ఈ ప్రజాబ్యాలెట్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజాబ్యాలెట్ ద్వారా రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తున్నట్టు తెలిపారు.

12/23/2016 - 05:37

విజయవాడ, డిసెంబర్ 22: మన చెంతనే వున్న సాంకేతికతను ఉపయోగించుకోవాలని అందరిలో ఉండాలని, నూటికి 10 శాతం మించి మాత్రమే వారిలో వచ్చే మంచి ఆలోచనలను ఆచరణలో పెడతారని, వారు మాత్రమే వున్నత స్థాయికి చేరుకుంటారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 90 శాతం మంది వారి ఆలోచనలను ఆచరణలో పెట్టకపోవటం వల్ల అంత గుర్తింపు పొందలేకపోతున్నారని తెలిపారు.

Pages