S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

12/21/2016 - 03:55

విజయవాడ డిసెంబర్ 20: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి సన్నిధిలో ‘ అమ్మవారి భవానీల దీక్ష’ విరమణ కార్యక్రమం ప్రారంభమైంది.

12/21/2016 - 03:53

మలికిపురం, డిసెంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కేశనపల్లి ఒఎన్‌జిసి వెస్ట్ స్ట్రక్చర్ పరిధిలోని తూర్పుపాలెం ఎడబ్ల్యూబిహెచ్ సైట్ నుండి కెడబ్ల్యూఎఎ సైట్‌కు అనుసంధానం చేసిన పైప్‌లైను నుండి మంగళవారం భారీఎత్తున క్రూడాయిలు లీకయ్యింది. దాదాపు యాభై మీటర్ల మేర ఎత్తుకు క్రూడాయిలు ఎగసిపడటంతో స్థానిక రైతాంగం ఆందోళనకు గురయ్యింది.

12/21/2016 - 03:52

నర్సీపట్నం(టౌన్), డిసెంబర్ 20: నగదు రహిత లావాదేవీలను పూర్తిగా అమలు చేయడంలో విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం ధర్మసాగరం పెనుమార్పుకు శ్రీకారం చుట్టనుందని జిల్లా జాయింట్ కలెక్టర్ జి.సృజన ప్రశంసించారు. ఈ చిన్న గ్రామంలో తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదిగా పేర్కొన్నారు. మంగళవారం ఆమె గ్రామాన్ని సందర్శించి నగదు రహిత గ్రామంగా రూపొందేందుకు తీసుకున్న చర్యలను పరిశీలించారు.

12/21/2016 - 03:49

విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 20: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆనాలోచితంగా తీసుకొన్న నోట్ల రద్దు నిర్ణయంతో దేశం ఆర్ధిక సంక్షోభంలోకి కూరుకుపోయిందని, నోటుకు పాట్లు పడుతున్న ప్రజల కష్టాలను తీర్చడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం, ఆయా చర్యలను సమర్ధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పాలకులను పార్టీల రహితంగా రూపొందించిన ప్రశ్నిద్దాం రండి..

12/21/2016 - 03:48

విజయవాడ, డిసెంబర్ 20: తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. విజయవాడలో మంగళవారం జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల వర్క్‌షాప్‌లో ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు.

12/21/2016 - 03:48

అడ్డతీగల, డిసెంబర్ 20: ఎఒబి మావో దళంలో 2011 ముందు వరకు కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం (పాత్రో) అలియాస్ నాగరాజును అడ్డతీగల జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపర్చారు. 2011 సంవత్సరంలో పోలీసులకు చిక్కిన ఈ మావోయిస్టు నేత ఎఒబి స్పెషల్ జోనల్ మిలటరీ కమిషన్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. ఆంధ్రా, ఒడిస్సా రాష్ట్రాల్లో 160 కేసులు వరకు భూషణంపై ఉన్నాయి.

12/21/2016 - 03:47

తిరుపతి, డిసెంబర్ 20: కలియుక ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తల్లిగారైన వకుళామత ఆలయం పునర్నిర్మాణానికి టిటిడి బోర్డు అంగీకరించిందని టిటిడి పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి స్పష్టం చేశారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం బోర్డు తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం చదలవాడ విలేఖరులకు వివరించారు.

12/21/2016 - 03:47

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: హిందూమత పటిష్ఠానికి దేవాదాయ శాఖ చేపట్టిన వినూత్న పథకం ‘దివ్య దర్శనం’ జనవరి 2 నుంచి ప్రారంభం కానుంది. తొలివిడతగా ఇటు కృష్ణా నుంచి అటు శ్రీకాకుళం వరకు ఆరు జిల్లాల పరిధిలో ముందుగా ఈ పథకం అమలుచేయనున్నారు. విజయవాడలో జనవరి 2వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభిస్తారు.

12/21/2016 - 03:46

రాజమహేంద్రవరం, డిసెంబర్ 20: కోస్తా నేలల్లో కొత్త వరి వంగడంగా పరిచయమైన ఆర్‌సి బయో 226 రకం సాగుచేసి నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదు. తుపాను గాలులకు తట్టుకుని ఒరిగిపోకుండా ఉంటుందని, దోమపోటు, ఆకు ముడత వంటి తెగుళ్లను తట్టుకుని, భరోసాగా దిగుబడి ఇస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు ఈ కొత్త వంగడాన్ని ఖరీఫ్ కాలంలో సాగుచేయించారు.

12/21/2016 - 03:45

అమరావతి, డిసెంబర్ 20: ‘విద్యార్థులకు ఏడాదికి ఒకసారి, రాజకీయ నాయకులకు ఐదేళ్లకు ఒకసారి పరీక్షలు వస్తాయి. నాకు మాత్రం ప్రతి మూడు నెలలకు ఒకసారి పరీక్షలు వస్తాయి’ అని గతంలో కలెక్టర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారంనుంచి రెండు రోజులపాటు జరిగే జిల్లాల కలెక్టర్ల సమావేశంలో మొదటి అర్ధ సంవత్సరం పరీక్షా ఫలితాలను విశే్లషించనున్నారు.

Pages