S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/19/2016 - 03:17

హైదరాబాద్, నవంబర్ 18: ప్రత్యేక హోదా చెల్లని నోటు అంటూ కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడడం, ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు తీసుకోవడం అవినీతి నిరోధక చట్టం కిందకు రాదని కోర్టులో చంద్రబాబు న్యాయవాది వాదించడంపై వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

11/19/2016 - 03:09

గుంటూరు, నవంబర్ 18: ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఆవరణలో మొబైల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయాలని మహిళా ఉద్యోగ సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శుక్రవారం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఎన్ సత్యసులోచన, అదనపు కార్యదర్శి కె జానకమ్మ తదితరులు కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.

11/19/2016 - 03:09

విశాఖపట్నం నవంబర్ 18: సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను, అణు, అంతరిక్ష ప్రయోగాల్లో అగ్ర రాజ్యాల వైఖరిని దృష్టిలో పెట్టుకుని ప్రపంచ భద్రతకు ఐద్యరాజ్యసమితి అంతరిక్ష చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సి ఉందని బెంగుళూరు నేషనల్ లా యూనివర్సిటీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ ఆర్.వెంకటరావు అన్నారు.

11/18/2016 - 04:28

గుంతకల్లు, నవంబర్ 17: అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలోఉన్న రోగిని వార్డులో చేర్చేందుకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది సహకరించలేదు. కనీసం స్ట్రెచర్ అయినా ఇవ్వండని ప్రాధేయపడినా వారు స్పందించలేదు. దీంతో చేసేది లేక భర్తను భార్యే ర్యాంప్‌పై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వార్డులో చేర్పించింది. ఈ హృదయ విదారక సంఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగింది.

11/18/2016 - 04:26

విజయవాడ 17: రిజర్వ్ బ్యాంకుకు మరోసారి లేఖ రాసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు.

11/18/2016 - 04:23

హైదరాబాద్, నవంబర్ 17: కారెం శివాజీ ఇచ్చిన బయోడేటా ప్రాతిపదికపై అతడిని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఎలా నియమించారో వివరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. గురువారం హైకోర్టు ధర్మాసనం ఏపి ప్రభుత్వం, కారెం శివాజీ దాఖలు చేసిన పిటిషన్లను విచారించింది.

11/18/2016 - 04:21

హైదరాబాద్, నవంబర్ 17: సీజనల్ ఇన్‌ఫ్లూయెంజా నివారణకు కాడిలా ఫార్మాస్యూటికల్స్, నోవారాక్స్ ఐఎన్‌సి, సిపిల్ బయోలాజికల్ సంస్థలు దేశీయంగా కాడిఫ్లూ ఎస్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాయి. ఈ వ్యాక్సిన్ వేయించుకున్న వ్యక్తి ఎలాంటి ఇన్‌ఫెక్షన్ల బారినపడే అవకాశాలు లేవని కాడిలా ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఎండి డాక్టర్ రాజీవ్ మోదీ తెలిపారు.

11/18/2016 - 04:20

న్యూఢిల్లీ, నవంబర్ 17: ఏపిలోని మంగళగిరిలో ఎయిమ్స్ నిర్మాణం 2018 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కార్యాలయంలో గురువారం ఏపిలో ఎయిమ్స్ నిర్మాణం, పిజి సీట్ల పెంపుతో పాటు ఆరోగ్యశాఖకు సంబంధించిన పలు పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం జరిగింది.

11/18/2016 - 04:18

విజయవాడ, నవంబర్ 17: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో, సాగుచేసే పద్ధతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఇస్రో సాంకేతిక బృందం, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, వ్యవసాయ, తదితర శాఖల అధికారులతో గురువారం సదస్సు నిర్వహించారు.

11/18/2016 - 04:17

విజయవాడ, నవంబర్ 17: నగరంలోని సిద్ధార్థ విద్యా సంస్థలకు కోట్ల రూపాయల విలువైన భూములు అప్పగించటం వెనుక అవినీతీ వ్యవహారం దాగి వుందని వైకాపా అధికార ప్రతినిధి గౌతంరెడ్డి ఆరోపించారు. విజయవాడలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడుతూ ఏడాదికి కోటి రూపాయల మేర ఆదాయం లభించే అవకాశం ఉన్నా వాటిని వదులుకోడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధపడిందని ప్రశ్నించారు. టిడిపి నేత లోకేష్ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం జరిగిందన్నారు.

Pages