S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/18/2016 - 01:11

రాజమహేంద్రవరం, నవంబర్ 17: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పదవ షెడ్యూలులో భాగంగా రాజమహేంద్రవరం సమీపంలోని దివాన్ చెరువువద్ద ఫారెస్టు అకాడమీ ఏర్పాటవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ సమీపంలోని దులపల్లి వద్ద వుండే ఫారెస్ట్ అకాడమీని విభజించడంతో దివాన్‌చెరువు వద్ద ఎపి ఫారెస్టు అకాడమీ మంజూరయింది.

11/17/2016 - 08:29

అమరావతి, నవంబర్ 16: కాపుల ఒత్తిడికి సర్కారు తలొగ్గకుండా తాము కూడా అందుకు ప్రతిగా ఒత్తిడి రాజకీయానికి తెరలేపే ప్రణాళికలకు బీసీలు పదునుపెడుతున్నారు. ‘కాపులకు ఏమైనా ఇవ్వండి. రాజకీయ రిజర్వేషన్లు తప్ప’ అనే నినాదంతో ఫిబ్రవరిలో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

11/17/2016 - 08:28

అనంతపురం, నవంబర్ 16: అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం కన్వీనర్ కందికుంట వెంకటప్రసాద్‌ను పార్టీలో చేర్చుకునేందుకు వైకాపా నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పార్టీలో చేర్చుకునే విషయమై జిల్లా వైకాపా నేతలు పలుదఫాలుగా కందికుంట సన్నిహితుల ద్వారా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

11/17/2016 - 08:27

గుంటూరు, నవంబర్ 16: హోంశాఖ పరిధిలో ఇకపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. మీకోసం వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదులు పంపాలన్నారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎవరైనా తాముచేసే ఫిర్యాదుతో పాటు ఆధార్‌కార్డు నెంబరును కూడా పొందుపరచాల్సి ఉంటుందన్నారు.

11/17/2016 - 08:27

రాజంపేట, నవంబర్ 16: ప్రత్యేక హోదాకు సాటిరాగల అన్నిరకాల ప్రయోజనాలతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని కేంద్ర మాజీమంత్రి, బిజెపి జాతీయ మహిళామోర్చా ఇన్‌ఛార్జి దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు.

11/17/2016 - 08:24

సింహాచలం, నవంబర్ 16: భారతదేశ చరిత్రలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న హంపీ విజయనగర సంస్థానాధీశుడు శ్రీకృష్ణదేవరాయల చరిత్రను పరిరక్షించునేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్టు కృష్ణదేవరాయల 19వ తరం వారసుడు రాజాకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. బుధవారం తన తల్లి రత్నశ్రీ చంద్రకాంతదేవి, కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించుకున్నారు.

11/17/2016 - 07:59

అమరావతి, నవంబర్ 16: రాయలసీమలో వైసీపీని ఆదరిస్తున్న రెడ్డి వర్గాన్ని ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ తన వ్యూహం మార్చుకుంది. అందులో భాగంగా త్వరలో టీచర్, గ్రాడ్యుయేట్, స్థానిక సంస్థల ద్వారా శాసనమండలికి జరిగే ఎన్నికల్లో రెడ్డి సామాజికవర్గ అభ్యర్థులనే ఎంపిక చేసింది. అదే సమయంలో అటు బీసీలకూ పట్టం కట్టడం ద్వారా కులసమీకరణ విషయంలో తనదైన శైలి ఎంపికకు తెరలేపింది.

11/17/2016 - 07:13

హైదరాబాద్, నవంబర్ 16: ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నిందితుడిగా చేర్చాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టును కోరారు. హైకోర్టు విస్తృతమైన న్యాయాధికారాలను ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయిన అరుణ్‌కుమార్ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి ధర్మాసనం ఎదుట తన వాదన వినిపించారు.

11/17/2016 - 07:12

గూడూరు, నవంబర్ 16: అందరూ కలసికట్టుగా ఐకమత్యంగా ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ప్రముఖ క్రికెటర్ ,రాజ్యసభ సభ్యుడు సచిన్ తెండూల్కర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన తాను దత్తత తీసుకున్న నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని పుట్టంరాజువారి కండ్రిగ (పిఆర్ కండ్రిగ)గ్రామాన్ని సందర్శించి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

11/17/2016 - 06:33

విజయవాడ, నవంబర్ 16: సంక్షేమ పథకాల అమలులో టెక్నాలజీని వినియోగించడం వల్ల పారదర్శకత పెరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన నివాస గృహం నుంచి ఆయన బుధవారం వివిధ సంక్షేమ శాఖల పనితీరుపై టెలికాన్ఫరెన్సును నిర్వహించారు.

Pages