S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/26/2016 - 00:46

ఏలూరు, మార్చి 25: రాష్ట్రంలో రుణ విష వలయంలో చిక్కుకున్న రైతాంగాన్ని వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం ప్రస్తుతం అమలవుతోందని, అయితే రైతులను పూర్తిగా ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారన్నారు.

03/25/2016 - 17:59

విజయవాడ: ఎపి రాజధాని అమరావతిలో నిర్మించే భవనాలకు సంబంధించి పలు డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం పరిశీలించారు. ఇక్కడ జరిగిన సమావేశంలో పలువురు మంత్రులు, సిఆర్‌డిఎ అధికారులు, వాస్తుశిల్పులు పాల్గొన్నారు. రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, హైకోర్టు వంటి భవనాలను నిర్మించేందుకు నిపుణుల నుంచి ప్రభుత్వం డిజైన్లను ఆహ్వానించింది.

03/25/2016 - 17:58

నెల్లూరు: ఇక్కడి పెన్నా నదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న తొమ్మిదో తరగతి విద్యార్థులు ఫైజుద్దీన్, లతి, వర్షిత్ శుక్రవారం ఉదయం రంగనాథస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను చూసేందుకు వచ్చారు. ఆలయంలోకి వెళ్లే ముందు పెన్నా నదిలో స్నానం చేసేందుకు దిగారు. నీట మునిగిన వీరు ఈత రాకపోవడంతో మరణించారు.

03/25/2016 - 12:48

గుంటూరు: అమరావతి ప్రాంతంలో ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం పర్యటిస్తున్న సందర్భంగా సిపిఎం నేతలను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సిపిఎం నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్‌లోనే ఆందోళనకు దిగారు.

03/25/2016 - 12:46

విజయవాడ: గుడ్ ఫ్రైడే సందర్భంగా విజయవాడ వద్ద గుణదల చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. నగర వీధుల్లో పలుచోట్ల క్రైస్తవులు ర్యాలీలు జరిపారు. విశాఖ, రాజమండ్రితో పాటు మరికొన్ని చోట్ల కూడా శాంతిర్యాలీలు నిర్వహించారు.

03/25/2016 - 12:45

తిరుపతి: చిత్తూరు జిల్లా నాగపట్ల అటవీప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు ఎర్రచందనం స్మగర్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. తమకు తారసపడిన ఇద్దరు కూలీలను పోలీసులు అరెస్టు చేసి గొడ్డళ్లు, రంపాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించి 16 మంది కూలీలు పరారయ్యారు.

03/25/2016 - 05:21

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న ఈ-పోస్ విధానాన్ని పర్యవేక్షించేందుకు గాను మహిళా, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

03/25/2016 - 05:30

హైదరాబాద్, మార్చి 24: రోడ్లు,డ్రైనేజీ వంటి వౌలిక సదుపాయాలతోనే రానున్న రోజుల్లో గృహనిర్మాణం జరపాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 8 నుంచి ఇంటింటా ఉగాది, ఇంటికి పునాది కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు చేయాలని ఆదేశించారు.

03/25/2016 - 05:18

శ్రీకాకుళం, మార్చి 24: జిల్లాలోని ప్రధాన దేవాలయాల అర్చకులు ఆందోళన బాట పట్టారు. జిల్లా అర్చకుల సంఘం ఆధ్వర్యంలో గురువారం అర్చకులంతా భిక్షాటనతో నిరసన నిర్వహించారు. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగం, రావివలస, ఉమారుద్ర కోటేశ్వర ఆలయాల అర్చకులు దేవాదాయశాఖ అనుచిత వైఖరి, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు నిరసనగా ఉత్తరాంధ్ర అర్చక సంఘం సూచన మేరకు గురువారం జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శన చేసారు.

03/25/2016 - 02:26

కాకినాడ, మార్చి 24: మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం, పౌష్టికాహారాన్ని అందించడానికి మహిళా-శిశు సంజీవని మిషన్ పేరుతో వినూత్న పథకాన్ని తూర్పు గోదావరి జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం ప్రయోగాత్మకంగా అమలుచేస్తోంది. ఏజన్సీ, మారుమూల గ్రామాల్లో మాతా-శిశు ఆరోగ్య పరిరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని ప్రభుత్వ యంత్రాంగం-యునిసెఫ్ సంయుక్తంగా అమలుచేస్తున్నాయి.

Pages