S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/12/2016 - 08:14

ఒంగోలు, నవంబర్ 11: నల్లకుబేరులు తమ నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు అన్ని అడ్డదారులను తొక్కుతూనే ఉన్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తిన వారు తమ నగదును డిపాజిట్‌లు చేసేందుకు బ్యాంకు ఖాతాలు ఉన్న సామాన్య, మధ్యతరగతి ప్రజలను ఆశ్రయిస్తూ వారి ఖాతాల్లోకి నగదును డిపాజిట్ చేస్తున్నారు. ఆ విధంగా చేసిన వారికి లక్ష రూపాయలకు పదినుండి 20వేల రూపాయల వరకు ముట్టచెప్పేపనిలో నిమగ్నమయ్యారు.

11/12/2016 - 07:49

గుంటూరు, నవంబర్ 11: ఆక్షేపణలేని భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా ఒకే విధానాన్ని అనుసరించాలని, ప్రస్తుతం అమలులో ఉన్న జీవో 118, 296లకు అనుగుణంగా క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు రూపొందించి ఒకే జీవోను ప్రవేశపెట్టాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

11/12/2016 - 07:47

గుత్తి, నవంబర్ 11: నిత్యం కరవుకాటకాలతో విలవిల్లాడుతున్న అనంతపురం జిల్లా నుండి కరవును తరిమేద్దామని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. శుక్రవారం అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన బిటెక్ విద్యార్థులతో ఇష్టాగోష్టి కార్యక్రమంలో ఆయన ఆవేశంగా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో చెలగాటమాడుతున్నాయన్నారు.

11/12/2016 - 07:46

విజయవాడ, నవంబర్ 11: నూతన రాజధాని నిర్మాణం అరుదుగా వచ్చే అవకాశమని, అమరావతిని స్మార్ట్ సిటీగా రూపొందించడంలో బ్రిటన్, భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగం కానున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. స్థానిక తాజ్ గేట్‌వేలో బ్రిటీష్ డెప్యూటీ హై కమిషనర్ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ నిర్మాణ సామర్థ్యం, అనుభవం, అమరావతికి సహకారంపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.

11/11/2016 - 07:54

అమరావతి, నవంబర్ 10: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గత కొద్దినెలల నుంచి రాష్ట్రంలో వరసగా నిర్వహిస్తోన్న సభల లక్ష్యమేమిటన్నది అనంతరపురం బహిరంగసభతో తేలిపోయింది. ఆయన లక్ష్యం కేంద్రమంత్రి, రాష్ట్రంలో బిజెపికి కర్త, కర్మ , క్రియగా ఉన్న వెంకయ్యనాయుడునేనన్న విషయం తేలిపోయంది. ఇది బిజెపిలోని వెంకయ్య వ్యతిరేక వర్గానికి ఆనందం కలిగిస్తుండగా, తెదేపాలోని ఆయన అభిమానులను అసంతృప్తికి గురిచేసింది.

11/11/2016 - 07:44

విజయవాడ, నవంబర్ 10: నోట్ల రద్దు ఘనతను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు సొంతం చేసుకుంటానంటే తమకు అభ్యంతరమేమీ లేదని బిజెపి జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు.

11/11/2016 - 05:30

అనంతపురం, నవంబర్ 10: ‘రాజకీయాలపై ఆసక్తి లేదు. సమకాలీన రాజకీయ దోపిడీ వ్యవస్థపైనే నా పోరాటం. గెలుపోటములతో సంబంధం లేదు. ఓట్లు వేస్తారో, లేదో తెలీదు. మీరంతా తోడుగా ఉండండి. నేను మీకు అండగా ఉంటా. రానున్న తరాల వారి కోసమే నా పోరాటం’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘2019 ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది.

11/11/2016 - 05:28

అమరావతి, నవంబర్ 10: నల్లకుబేరులు ‘తెల్ల’ మార్గం పడుతున్నారు. అది కూడా దర్జాగా. మహిళా పొదుపు సంఘాల పేరుతో పెద్దనోట్లను చెలామణి చేసేందుకు తెరలేపారు.ప్రభుత్వం మహిళల జోలికి పోదన్నదే వారి ధీమాకు కారణం. తమ దగ్గర ఉన్న పెద్దనోట్లను డ్వాక్రా బృందాలకు ఇచ్చి వారి లోన్లు తామే కట్టేస్తున్నారు. కొత్తగా డిపాజిట్లూ కట్టించి తర్వాత వాటిని విత్‌డ్రా చేసుకుని దర్జాగా వైట్ చేసుకుంటారు.

11/10/2016 - 03:21

విజయనగరం, నవంబర్ 9: నల్లధనాన్ని వెలికితీసేందుకు ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదేనని సామాన్యులు అభిప్రాయపడుతున్నప్పటికీ వారికి తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు వ్యాపారులు బేఖాతరు చేయడంతో అన్ని వర్గాల ప్రజలు ముప్పతిప్పలు పడ్డారు. రైల్వే, ఆర్టీసీ, ఆసుపత్రుల్లో ఈ నోట్లు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఎక్కడా అమలు కాలేదు.

11/10/2016 - 03:20

యలమంచిలి, నవంబర్ 9: పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ వశిష్ఠ వంతెనపై నుండి బుధవారం తెల్లవారుజామున కంటెయినర్ గోదావరి లంకలో పడిన ప్రమాదంలో డ్రైవరు, క్లీనరు మృతి చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఎస్‌కెబిఎస్ పేరు గల కంటెయినర్ ఒంగోలు నుండి రొయ్యల లోడుతో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ బయలుదేరి వెళ్లింది.

Pages