S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/10/2016 - 03:19

విజయవాడ, నవంబర్ 9: దేశంలో 500, 1000 రూపాయి నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఈ నెల లక్ష్యాలను ఎలా అధిగమించాలా? అని రిజిస్ట్రేషన్ల శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బ్యాంక్‌లకు సెలవులు, నగదు విత్‌డ్రాలపై పరిమితుల నేపథ్యంలో లక్ష్యాన్ని సాధించడం కష్టమని ఉన్నతాధికారులకు తెలియచేసే ప్రయత్నం చేశారు. పెద్ద నోట్ల రద్దు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కొన్ని ప్రభుత్వ శాఖల ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది.

11/10/2016 - 03:19

విశాఖపట్నం, నవంబర్ 9: దేశంలో 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో దాని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై పడింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగానికి శరాఘాతంగా మారింది. మరో ఏడాది వరకూ కోలుకోలేమంటున్నారు బిల్డర్లు. ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేసి, వాటిని తిరిగి అమ్మలేక రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుప్పకూలిపోయారు.

11/10/2016 - 03:18

విజయవాడ, నవంబర్ 9: అగ్రిగోల్డ్ బాధితుల ఆగ్రహం మరోసారి కట్టలు తెంచుకుంది. మంగళవారం వివిధ రాష్ట్రాల నుండి విజయవాడకు తరలివచ్చిన వేలాది బాధితులు టిడిపి ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఈ సమస్యకు పరిష్కారం చూపకుండా ప్రభుత్వమే అడ్డుకుంటోందని, దీని వెనుక పెద్ద కుట్ర దాగివుందంటూ దుమ్మెత్తి పోశారు.

11/10/2016 - 03:18

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 9: క్రికెట్ అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తుకు రావాలని, మెరిట్ ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులే ముందుటారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని ఎసిఎ క్రికెట్ మైదానాలకు బుధవారం నామకరణం చేశారు.

11/10/2016 - 03:17

తిరుపతి, నవంబర్ 9: దేశంలో నల్లధనం నివారించే పేరుతో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడం చూస్తే ప్రధాని మోదీ, సి ఎం చంద్రబాబు నాయుడుతోపాటు తమవారంతా అంతా సర్ధుకున్నట్లు కనిపిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అరోపించారు. బుధవారం తిరుపతిలోని సిపిఐ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దును తాము స్వాగతిస్తున్నామన్నారు.

11/10/2016 - 03:16

ఒంగోలు అర్బన్, నవంబర్ 9:కార్పొరేట్ శక్తులతో కేంద్రప్రభుత్వం కుమ్మకై ఐదువందలు, వెయ్యిరూపాయల నోట్లను రద్దుచేసిందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘవీరారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఒంగోలులో జిల్లాకాంగ్రెస్‌పార్టీకార్యాలయంలో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక నల్లధనాన్ని వెలికితీస్తామని పదేపదే మాట్లాడిన మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని విస్మరించారన్నారు.

11/10/2016 - 03:16

కాకినాడ, నవంబర్ 9: దేశంలో నల్లకుబేరుల భరతం పట్టేందుకే పెద్దనోట్లను రద్దు చేశారని, ఇదొక చారిత్రక సంచలనమని బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. దేశంలో పెద్ద ఎత్తున నల్లధనం పెరగడం వల్లనే భారత ప్రభుత్వం 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసిందన్నారు. కాకినాడ నగరంలో బుధవారం వీర్రాజు విలేఖర్లతో మాట్లాడారు. 500, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేయటాన్ని తాము సమర్ధిస్తున్నట్టు చెప్పారు.

11/10/2016 - 03:15

ఒంగోలు అర్బన్, నవంబర్ 9: ప్రధాని నరేంద్రమోదీ 500,1000 నోట్లను రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్మ్రాకమని కేంద్రమాజీ మంత్రి, ఆ పార్టీ జాతీయ మహిళామోర్చా ఇన్‌చార్జీ దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. బుధవారం ఒంగోలులో జిల్లాపార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికితీసేందుకే ప్రధాని ఈ నిర్ణయం తీసుకోవటం హర్షణీయమన్నారు.

11/10/2016 - 03:15

విజయవాడ, నవంబర్ 9: విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో ఉన్న తుమ్మపాల చక్కెర కర్మాగారం నిర్వహణ బాధ్యతలను విశాఖ డెయిరీకి అప్పగించనున్నారు. ఇందుకు ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, రైతు ప్రతినిధులతో కలిసి చర్చించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనకాపల్లి సమీపంలో ఉన్న చక్కెర కర్మాగారం ఆధునీకరణకు నోచుకోకపోవడంతో గత రెండు సీజన్లుగా చక్కెర ఉత్పత్తి నిలిచిపోయింది.

11/10/2016 - 03:14

రావులపాలెం, నవంబర్ 9: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో అమెరికా దేశంలో రిపబ్లికన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో సైతం సంబరాలు జరుపుకొన్నారు.

Pages