S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/17/2016 - 03:55

తిరుమల, అక్టోబర్ 16: రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన స్పిల్ వే గేట్ల డిజైన్లు సిద్ధమయ్యాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వెల్లడించారు.

10/17/2016 - 03:52

అనంతపురం, అక్టోబర్ 16: అనంతపురం నగర పాలక సంస్థ మేయర్ మదమంచి స్వరూపకు పదవీ గండం పొంచి ఉంది. సొంత పార్టీ వారే ఆమె పదవికి ఎసరు పెడుతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి వెనకుండి పావులు కదుపుతున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ పనుల కేటాయింపులో తలెత్తిన వివాదాలే మేయర్ మార్పునకు కారణమని తెలుస్తోంది.

10/17/2016 - 03:51

విశాఖపట్నం, అక్టోబర్ 16: ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో అంతే స్థాయిలో సైబర్ దాడులు కూడా ఎక్కువ అవుతున్నాయి. సైబర్ దాడుల్లో ప్రధానంగా ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు ఎక్కువగా దాడుల బారిన పడుతున్నాయి. సైబర్ దాడుల నుంచి రక్షణకు సాఫ్ట్‌వేర్ వినియోగంతో పాటు క్లిష్టమైన పాస్‌వర్డ్ ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

10/17/2016 - 03:17

హైదరాబాద్, అక్టోబర్ 16: ‘విభజన జరిగిన ఏడాదిన్నర వరకూ చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి పాలిస్తున్నారని విమర్శించాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి కూడా అంతే ఉంది. అన్ని పార్టీలు బెజవాడకు వస్తే జగన్ హైదరాబాద్‌లో ఉండి పార్టీని నడిపిస్తున్నారు. దానివల్ల జగన్ బెజవాడ వచ్చేందుకు భయపడుతున్నారన్న సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంది. జగన్ ఏపికి మారకుండా, బెజవాడలో ఆఫీసు లేకపోతే గౌరవం ఉండదు’ ఇదీ వైసీపీ నేతల మనోగతం.

10/17/2016 - 03:12

మడకశిర, అక్టోబర్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిన సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతానికి పలు చర్యలు చేపట్టిందని, అయితే ముఖ్యమంత్రి నేడు దానికి పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.

10/17/2016 - 03:11

హైదరాబాద్, అక్టోబర్ 16: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆతిథ్య రంగంలో 20 హోటళ్లను నెలకొల్పే విషయమై ఈ నెల 18వ తేదీన ఉన్నత స్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ఈ వివరాలను ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వెల్లడించారు. అమరావతిని ఆతిథ్య రంగంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

10/16/2016 - 08:50

హైదరాబాద్, అక్టోబర్ 15: వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్‌లో 6.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2011 లెక్కల ప్రకారం పక్కా ఇళ్లు లేని కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో 33.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 6.5 లక్షల కుటుంబాలున్నాయి. ప్రతి ఏటా కనీసం 10 లక్షల ఇళ్లను నిర్మించడం ద్వారా 2022 నాటికి అందరికీ గృహవసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

10/16/2016 - 08:49

పెడన, అక్టోబర్ 15: సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఇకపై ఆ పార్టీలో తాను కొనసాగలేనని తేల్చి చెప్పారు. గత కొంత కాలంగా వేదవ్యాస్ అధినాయకత్వంపై తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని అవమానాలు వైసిపి అధినేత జగన్ వల్ల ఎదుర్కొన్నానని వేదవ్యాస్ ఆవేదన వ్యక్తం చేశారు.

10/16/2016 - 08:32

విశాఖపట్నం, అక్టోబర్ 15: రాబోయే మున్సిపల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బిజెపి సిద్ధంగా ఉందని, అయితే సీట్ల సర్దుబాటు, పొత్తుల విషయాలు టిడిపి, బిజెపి అధిష్ఠానాలు చూసుకుంటాయని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు.

10/16/2016 - 08:31

గుంటూరు, అక్టోబర్ 15: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అటు గుంటూరు, ఇటు విజయవాడ వైపు వచ్చే రహదార్లలో కొన్ని మాస్టర్ ప్లాన్‌లో చోటుకు నోచుకోలేదు. కొత్త రోడ్ల మాట అటుంచి ఉన్న రహదార్ల విస్తరణ జరిపితే సచివాలయ ఉద్యోగులకు సౌలభ్యంగా ఉంటుంది. పాలనా యంత్రాంగం ఇక్కడ కొలువు తీరిన తరువాత ప్రాధాన్యతలు గుర్తుకు వస్తున్నాయి.

Pages