S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/14/2016 - 04:26

హైదరాబాద్, అక్టోబర్ 13: 2018లో జాతీయ క్రీడల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సన్నద్ధమవుతోంది. గతంలో జాతీయ, అంతర్జాతీయ క్రీడలను ఘనంగా నిర్వహించిన అనుభవంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండేళ్ల తర్వాత జరిగే జాతీయ క్రీడలను ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తుందని ప్రకటించారు. అందుకు తగ్గట్టు క్రీడల శిక్షకులను, క్రీడా ప్రాంగణాలను, హోటళ్లను, ఇతర సౌకర్యాలను పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

10/14/2016 - 04:25

గుంటూరు, అక్టోబర్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన దాదాపు ఖరారయింది. వచ్చే నెల 12 నుంచి పదిరోజుల పాటు సాగే ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుని ఎన్నిక, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన అంశాలని తెలుస్తోంది.

10/14/2016 - 04:25

గుంటూరు, అక్టోబర్ 13: రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి, సంస్కృతి పరిరక్షణ, వారసత్వ సంపదను కాపాడేందుకు ‘ఆంధ్రప్రదేశ్ టూరిజం, కల్చర్ అండ్ హెరిటేజ్ బోర్డు’ను త్వరలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

10/14/2016 - 03:52

విజయవాడ, అక్టోబర్ 13: వేల అబద్ధాలతో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై దండయాత్ర చేస్తూ పాలన సాగిస్తోందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు సమర్ధవంతంగా ఎదుర్కొనేలా ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు కృషి చేయాలని ఏపిపిసిసి అధ్యక్షుడు డా. ఎన్ రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం విజయవాడలో ఏపిపిసిసి అధికార ప్రతినిధుల రెండ్రోజుల శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు.

10/14/2016 - 03:50

విజయవాడ, అక్టోబర్ 13: విజయనగరం జిల్లాలో ఇనుము, మాంగనీసు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించామని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి పీతల సుజాత తెలిపారు. రాష్ట్రంలో అపారమైన భూగర్భ ఖనిజ నిక్షేపాలు వున్నాయని, ఇతర జిల్లాల్లోనూ వీటిని గుర్తించేందుకు ముందుకెళుతున్నామని చెప్పారు.

10/14/2016 - 03:49

గుంటూరు, అక్టోబర్ 13: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భారీ నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ దశలవారీగా పూర్తి చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వెల్లడించారు. గురువారం ఇక్కడి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ తెలుగుగంగ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేసి పులివెందుల, లింగాలకు నీరందించటమే తమ ప్రధాన కర్తవ్యమని చెప్పారు.

10/14/2016 - 03:47

విశాఖపట్నం, అక్టోబర్ 13: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ రావడం మాట ఎలా ఉన్నా ఇప్పుడు వాల్తేర్ డివిజన్ మాత్రం రెండు రైల్వేజోన్ల మధ్య నలిగిపోతోంది. ఏడు వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాల్తేర్ డివిజన్‌ను వదులుకునేది లేదంటూ ఒడిశా పేచీ పెడుతోంది. జోన్ కోసం చేస్తున్న ప్రయత్నాలను ఒడిశా అడ్డుకుంటోంది. మరోపక్క వాల్తేరు డివిజన్‌తోనే కొత్త జోన్ సాధ్యపడుతుందని దక్షిణమధ్య రైల్వే చెబుతోంది.

10/14/2016 - 03:42

విజయనగరం, అక్టోబర్ 13: నామినేటెడ్ పోస్టుల భర్తీపై త్వరలోనే పార్టీ తుది నిర్ణయం తీసుకోనుందని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావు వెల్లడించారు. గురువారం ఇక్కడ మాట్లాడుతూ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల పదవులకు ఇప్పటికే నియామకాలు పూర్తిచేసామని, ఈరెండేళ్ల కాలంలో భర్తీచేసిన సంస్థల పాలకవర్గాల గడువు ముగిసిన వాటి స్థానే కొత్తకమిటీల ఎంపిక, గ్రంథాలయ సంస్థల పదవుల భర్తీ వంటివి ఉన్నాయని వివరించారు.

10/14/2016 - 03:42

విజయవాడ, అక్టోబర్ 13: రాష్ట్రంలో ధన రాజకీయాలకు శ్రీకారం చుట్టింది, సంతలో పశువుల్ని కొన్నట్లు కోట్ల రూపాయలు ఎరవేసి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ధ్వజమెత్తారు.

10/14/2016 - 03:41

కాకినాడ, అక్టోబర్ 13: ఇటీవలి కాలంలో తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీ ప్రాంతంలో సంభవిస్తున్న వరుస మరణాలను ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోందని, అక్కడి మాతా శిశు మరణాలపై సమగ్రంగా విచారించి, అందుకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో గురువారం వైద్యారోగ్య శాఖాధికారులతో ఏజన్సీ మరణాలపై శివాజీ సమీక్ష నిర్వహించారు.

Pages