S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/13/2016 - 07:00

కర్నూలు, అక్టోబర్ 12: కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలు నివారించడానికి అధికారులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానం అనాదిగా భక్తులు పాటిస్తున్న సంప్రదాయం ముందు తలవంచాల్సి వచ్చింది. డ్రోన్ కెమెరా, సీసీ కెమెరాలు, హైమాస్ట్ లైట్లు వంటి ఆధునిక పరిజ్ఞానం వినియోగించడంతో పాటు, కర్రలతో కొట్టుకుంటే నిందితులను గుర్తించి కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు చేసిన హెచ్చరికలు పని చేయలేదు.

10/13/2016 - 06:59

ఆదోని, అక్టోబర్ 12: సంప్రదాయం, సంస్కృతి పేరుతో సాగిన బన్ని ఉత్సవం ఈ సంవత్సరం కూడా రక్తసిక్తంగా మారింది. వంద మందికిపైగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాగడాలు విసరడంతో పలువురికి గాయాలయ్యాయి. కర్నూలు జిల్లా హొళగుంద మండలం నెరణికి నుంచి ఊరేగింపుగా బయలుదేరిన నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు తమ దేవుళ్లను రక్షించుకుంటామని డోళ్ళబండ వద్ద పాల బాసలు చేశారు.

10/13/2016 - 06:28

విజయవాడ, అక్టోబర్ 12: సమాచార వ్యవస్థలో ఎనె్నన్నో విప్లవాత్మక మార్పులు వచ్చి సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ నుంచి ఎన్ని పోటీలు ఎదురవుతున్నా ప్రభుత్వ తపాలా, టెలికం రంగాలకు ప్రాధాన్యం తగ్గబోదని కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు అన్నారు. రాష్ట్ర విభజనలో నిన్నటివరకు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ వచ్చిన పోస్టల్, టెలికం సర్కిల్స్ విడిపోయి విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్స్ ఏర్పాటయ్యాయి.

10/13/2016 - 06:26

విజయవాడ, అక్టోబర్ 12: విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా మహోత్సవాలు మంగళవారం రాత్రితో విజయవంతంగా ముగిశాయి. ఈ 11 రోజుల్లో దాదాపు 14 లక్షల మంది పైగా భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటంలో ఆలయ ఇవో ఎ సూర్యకుమారి, నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ సఫలీకృతులయ్యారు.

10/13/2016 - 05:50

తిరుమల, అక్టోబర్ 12: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం చక్రస్నానంతో వైభవంగా ముగిశాయని టిటిడి ఇఓ సాంబశివరావు చెప్పారు. ఈ తొమ్మిదిరోజులు శ్రీవారిని దర్శించుకున్న భక్తులు హుండీలో సమర్పించిన కానుల ద్వారా టిటిడికి రికార్డు స్థాయి ఆదాయం వచ్చిందన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భక్తుల సంఖ్య కూడా పెరిగిందన్నారు.

10/13/2016 - 05:47

విజయవాడ, అక్టోబర్ 12: రాష్ట్రంలో నౌకా నిర్మాణం, రేవులు, తయారీ రంగం, వౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అణు విద్యుత్, రక్షణావసరాలు, తదితర ముఖ్యమైన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశానికి చెందిన సంస్థలు ఉత్సుకత చూపుతున్నాయని రష్యన్ ఫెడరేషన్ పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి డెనిస్ మాంతురోవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగస్వామి కావడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

10/13/2016 - 05:44

గుంటూరు, అక్టోబర్ 12: ‘నూతన శకం ఆరంభమైంది.. అనేక ఒడిదుడుకులు అనుభవించాం.. గంపెడు కష్టాలతో తిరిగొచ్చాం.. అన్యాయం చేసి అవమానించారు.. అన్యాయాన్ని న్యాయంగా నిరూపించుకోగలం.. కానీ అవమానం భరించలేనిది..

10/11/2016 - 06:56

విశాఖపట్నం, అక్టోబర్ 10: ఇస్రో, ప్రభుత్వం కలిసి సమన్వయంతో పని చేస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇస్రో విజ్ఞానాన్ని జన జీవన ప్రగతి దిశగా మళ్లించాలని, ఇందుకు రాష్ట్రాన్ని మోడల్‌గా తీసుకోవాలన్నారు.

10/11/2016 - 06:52

హైదరాబాద్, అక్టోబర్ 10: ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖలో అధికార కేంద్రాలు పెరుగుతుండటంతో గందరగోళం మొదలయింది. ఎవరు ఎవరికి బాధ్యులో, ఏ అంశాన్ని ఎవరితో చర్చించాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. తాజాగా విజయదశమి పర్వదనం సందర్భంగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరుతో విడుదలయిన బహిరంగలేఖ గురించి సమాచారశాఖకే సమాచారం లేని వైచిత్రిపై చర్చ జరుగుతోంది.

10/11/2016 - 06:50

విశాఖపట్నం, అక్టోబర్ 10: స్వార్థ రాజకీయాలకు పాల్పడే వారికి భవిష్యత్ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. సోమవారం చంద్రబాబు విశాఖలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను కేంద్రం కొన్ని కారణాల వలన ఇవ్వలేకపోయింది. హోదాకు సరిపడ ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేదు. రాష్ట్రం బాగుపడాలన్న ఉద్దేశంతో ప్యాకేజీని తీసుకున్నాం. దీన్ని కూడా కొంతమంది రాజకీయం చేస్తున్నారు.

Pages