S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

10/05/2016 - 01:39

విజయవాడ, అక్టోబర్ 4: ఏపిలో పలు జిల్లాలకు చెందిన మహిళలు, యువకులను ప్రలోభపెట్టి గల్ఫ్ దేశాలకు తరలించి, వారి శ్రమను దోపిడీ చేస్తున్న నకిలీ ఏజెంట్లపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర సమాచార, ఐటి, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల మంత్రి డా. పల్లె రఘునాథరెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు. గల్ఫ్ మోసాలపై ఇటీవల పలు దినపత్రికల్లో వస్తున్న కథనాలపై మంత్రి స్పందించారు.

10/05/2016 - 01:38

విజయవాడ, అక్టోబర్ 4: ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన నామినేటెడ్ పదవుల పందారం మిత్రపక్ష భారతీయ జనతా పార్టీలో చిచ్చురేపుతోంది. క్రమశిక్షణకు పేరుగాంచిన బిజెపిలో పరిణామాలు పార్టీ నాయకత్వంపై తిరుగుబాటు బయలుదేరుతోంది.

10/04/2016 - 05:14

విజయవాడ, అక్టోబర్ 3: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో మూడోరోజైన అశ్వయుజ శుద్ధ విదియ సోమవారం జగన్మాత దుర్గమ్మ వేదమాత గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చింది. చతుర్వేదాలకు అమ్మగా పంచభూతాత్మగా సృష్టి, స్థితి, లయలను సమన్వితం చేసే వేదమాత గాయత్రిగా దర్శనమిచ్చిన జగన్మాత దుర్గాదేవిని కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తెల్లవారుఝాము నుంచే తరలివచ్చి పునీతులయ్యారు.

10/04/2016 - 05:13

విశాఖపట్నం(క్రైం), అక్టోబర్ 3: మావోయిస్టు పార్టీకి చెందిన ఓ దళ సభ్యుడుసహా మరో ఆరుగురు మిలీషియా సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో వీరిని హాజరు పరిచి, వివరాలను ఎస్పీ తెలిపారు.

10/04/2016 - 05:13

విజయవాడ, అక్టోబర్ 3: వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన నామినేటెడ్ పదవుల పందారంలో, ముఖ్యంగా బిజెపికి చెందిన మాణిక్యరావు నిర్వహిస్తున్న దేవాదాయ శాఖకు సంబంధించి విజయవాడ దుర్గగుడి, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయ పాలకవర్గాల్లో పార్టీ కార్యకర్తల్లో ఏ ఒక్కరికీ స్థానం లభించకపోవటంపై బిజెపి కార్యకర్తలు ఆగ్రహోదగ్రులయ్యారు.

10/04/2016 - 05:12

శ్రీశైలం, అక్టోబర్ 3: శ్రీశైలం మహాక్షేత్రంలో జరుగుతున్న శ్రీభ్రమరాంబదేవి శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు సోమవారం అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి, అమ్మవార్లకు రావణవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు.

10/04/2016 - 05:10

హైదరాబాద్,అక్టోబర్ 3: దేశంలో సంచలనం సృష్టించిన పత్తి అక్రమ కొనుగోల్‌మాల్ కథ కంచికి చేరే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుమారు 700 కోట్ల రూపాలయ మేరకు జరిగిన ఈ కుంభకోణంలో నిందితులెవరన్నది దర్తాప్తు సంస్థలు విచారించి నివేదికలిచ్చినా, ఇప్పటివరకూ వారిపై చర్యలు తీసుకోకపోవడంపై కొనుగోల్‌మాల్ నివేదికను సమాధి చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

10/04/2016 - 05:09

రాజమహేంద్రవరం, అక్టోబర్ 3: నగరాలు, పట్టణాల్లోని పేద, మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్టవ్య్రాప్తంగా 222 ఇ పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 21, విశాఖపట్నంలో 26 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

10/04/2016 - 05:09

విశాఖపట్నం, అక్టోబర్ 3: గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఇక నుంచి ఎపిలో సొంతంగా వ్యాపారం చేసుకోనుంది. తెలంగాణ గిరిజన సహకార సంస్థ(టిజిసిసి)గా రిజిస్ట్రేషన్ చేయించుకునేందకు అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. ఇటీవల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో తెలంగాణాతో ఆంధ్రా జిసిసి తెగతెంపులు చేసుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ లభించినట్టు అయ్యింది.

10/04/2016 - 03:53

హైదరాబాద్, అక్టోబర్ 3: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ నీటి భద్రతతోపాటు నీటి బాధ్యత కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. నీరు-ప్రగతిపై వివిధ శాఖల అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసం నుండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pages