S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/01/2016 - 13:22

విజయవాడ: కృష్ణా జిల్లా డీఆర్డీఏలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ అజయ్‌ కార్యాలయంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పెనమలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అజయ్‌ అవివాహితుడు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

09/01/2016 - 11:47

విజయవాడ: ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో తొలిసారిగా మంత్రి వర్గ ఉపసంఘం బేటీ అయింది. ‘పట్టణాభివృద్ధి విధానం- సంస్కరణల’పై ఉప సంఘం చర్చిస్తోంది. గురువారం నుంచి వరుసగా 5 మంత్రివర్గ ఉపసంఘం సమావేశాలను యనమల చేపట్టనున్నారు. వెలగపూడి కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ప్రారంభమైంది.

09/01/2016 - 11:42

విజయవాడ : ఆరోగ్యం మెరుగుపడటంతో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని గురువారం ఉదయం విజయవాడ ఆంధ్రా ఆసుపత్రి నుంచి డి శ్చార్జి చేశారు. 3 రోజుల క్రితం శ్వాస సంబంధిత సమస్యతో జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్‌ టి.రవిరాజు పర్యవేక్షణలో వైద్యం అందించారు.

09/01/2016 - 11:31

ఒంగోలు: సింగరాయకొండ మండలం కనుమళ్లలో గురువారం ఆయిల్ మాఫియా పై కేసు నమోదు చేసి రూ.8 లక్షల విలువ చేసే డీజిల్‌ను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి వస్తున్న డీజిల్ ట్యాంకర్లను తరలించి అందులో నీళ్లు, ఎల్‌డీవో ఆయిల్ కలిపి కల్తీ చేస్తున్నారని తెలిపారు.

09/01/2016 - 11:27

విజయవాడ: ఓటుకు నోటు కేసులో ఏమీ లేదని, వైసీపీ ఉత్త పుణ్యానికే అల్లరిచేస్తోందని కేసు ప్రాతిపదికే చెల్లదని హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టుకు వెళ్లడంలో అర్థం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతూ ఉంటే, వైసీపీ నేతలు కేసులు వేసి వెనక్కు లాగాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

09/01/2016 - 11:23

విశాఖ : రైల్వే న్యూ కాలనీలోని అమ్మవారి ఆలయ ద్వారం దగ్గర గురువారం రెండు సూట్‌కేస్‌లు అనుమానాస్పదంగా కనిపించడంతో ఆలయ ధర్మకర్త పోలీసులకు సమాచారం అందించారు. బాంబ్‌స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు చేశారు. సూట్‌కేస్‌లో పేలుడు పదార్థాలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

09/01/2016 - 07:36

హైదరాబాద్, ఆగస్టు 31: మహిళలపై అత్యాచారాల గణాంక వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసింది. సైబర్ నేరాలు ఆంధ్రాలో పెరిగితే, తెలంగాణలో తగ్గాయి. దేశం మొత్తం మీద సైబర్ నేరాల్లో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో నిలిచింది. ఆర్ధిక నేరాల్లో తెలంగాణలో 8979 కేసులు, ఆంధ్రాలో 6669 కేసులు నమోదయ్యాయి. 2015లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాల కేసులు 1027, తెలంగాణలో 1105 నమోదయ్యాయి.

09/01/2016 - 07:33

హైదరాబాద్, ఆగస్టు 31: నవ్యాంధ్రలో అధికార తెలుగుదేశం పార్టీ సొంతిల్లు చక్కదిద్దుకునే పనిలోఉంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు పార్టీ రంగంలోకి దిగింది. ఆ మేరకు గత పదిరోజుల నుంచి పార్టీ నెంబరు ఫోన్ల నుంచి వివిధ వర్గాల ప్రజల సెల్‌ఫోన్లకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి.

09/01/2016 - 07:18

రాజమహేంద్రవరం, ఆగస్టు 31: తూర్పు ఏజెన్సీలోని ఆదివాసీ గ్రామాల్లో మలేరియా వ్యాధి నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం రూ.1.50 కోట్లతో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. మూడేళ్లపాటు నిర్వహించే ఈ ప్రాజెక్టును ఆయూష్ మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహిస్తున్నారు. మలేరియా నిర్మూలనకు, సోకకుండా ముందస్తు నివారణ మందులు హోమియోపతి వైద్యంలోనేవుంది.

09/01/2016 - 07:17

విజయనగరం, ఆగస్టు 31: రాష్ట్ర అసెంబ్లీ ప్రస్తుత వర్షాకాల సమావేశాలు హైదరాబాద్‌లోనే జరుగుతాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. అదే విధంగా స్వల్పకాల వ్యవధితో జరిగే శీతాకాల సమావేశాలు కూడా హైదరాబాద్‌లోనే నిర్వహిస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాలు మాత్రం అమరావతిలో జరుగుతాయని స్పష్టం చేసారు.

Pages