S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

09/01/2016 - 07:16

అమలాపురం, ఆగస్టు 31: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, దానిని సాధించేంతవరకూ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట చెబుతున్న టిడిపి, బిజెపిలకు చిత్తశుద్ధిలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం టైంపాస్ ముఖ్య మంత్రి అని ఆయన ఎద్దేవాచేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

09/01/2016 - 07:16

విజయవాడ, ఆగస్టు 31: ఎండిపోతున్న వేరుశనగతో సహా ఇతర ముఖ్యపంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన పంటతడి అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం నుంచి ఆయన బుధావరం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెభ్స్‌ను నిర్వహించారు.

09/01/2016 - 07:15

కాకినాడ, ఆగస్టు 31: తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ మందుల ఫ్యాక్టరీ బాధితులకు మద్దతుగా ఆందోళన బాట పట్టిన సిపిఎం నేతలను బుధవారం పోలీసులు అరెస్టుచేశారు. ఈ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించడానికి ప్రయత్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి అన్నవరం, తొండంగి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

09/01/2016 - 07:14

తాళ్లపూడి, ఆగస్టు 31: భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వచ్చిన వరద ప్రవాహానికి బుధవారం పశ్చిమ గోదావరిలో కాలువ దాటుతున్న ఒక రైతు, మరో వ్యవసాయ కూలీ గల్లంతయ్యారు. సాయంత్రానికి ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాలిలావున్నాయి...

09/01/2016 - 07:14

కాకినాడ, ఆగస్టు 31: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనే అభియోగంపై కాకినాడ రవాణా శాఖ కార్యాలయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నివాసంపై అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సదరు అధికారి నివాసంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుచోట్ల నిర్వహించిన సోదాల్లో సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఇందుకు సంబంధించి ఎసిబి అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

09/01/2016 - 05:51

విజయవాడ, ఆగస్టు 31: అధిక రక్తపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి స్థానిక ఆంధ్రా హాస్పిటల్‌లో బుధవారం నాటికి పూర్తిస్థాయిలో కోలుకోగల్గారు. ఈ సందర్భంగా ఆసుపత్రి న్యూరాలజిస్టు డాక్టర్ పవన్ మాట్లాడుతూ స్వామీజీకి సోడియం, బిపి, షుగర్ లెవల్స్ అన్నీ కూడా సాధారణ స్థాయికి చేరాయని, మాట్లాడగల్గుతున్నారన్నారు.

09/01/2016 - 05:27

అనంతపురం, ఆగస్టు 31: రాయలసీమను సస్యశ్యామలం చేయటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత కరవు జిల్లాగా పేరున్న అనంతపురం నుంచి శాశ్వతంగా ఆ మహమ్మారిని పారదోలుతానని ఆయన అన్నారు. నిర్దిష్ట గడువును విధించుకుని సీమలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి తీరుతానని ఆయన అన్నారు.

09/01/2016 - 05:21

విజయవాడ, ఆగస్టు 31: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదనీరుకు రాష్ట్రంలో అన్ని నదులు ఉప్పొంగుతున్నాయి. బహుళార్థ సాధక ప్రాజెక్టు అయిన పులిచింతలకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజీ చాలాకాలం తరువాత జలకళతో ఉట్టిపడుతోంది. బ్యారేజీ 20 గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు.

09/01/2016 - 05:13

విశాఖపట్నం, ఆగస్టు 31: విపత్తుల నిర్వహణలో లోపాలను గుర్తించి వాటిని అధిగమించేందుకే ‘ప్రకంపన’ పేరుతో విపత్తు నిర్వహణ విన్యాసాలను చేపట్టిన్నట్లు తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిస్త్ తెలిపారు.

08/31/2016 - 17:58

విజయవాడ : జయేంద్ర సరస్వత్రిని ఐసీయూ నుంచి మెడికల్‌ వార్డకు తరలించినట్లు ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ రవిరాజు తెలిపారు. షుగర్‌ లెవెల్స్‌ సాధారణ స్థితికి వచ్చాయన్నారు. జయేంద్ర సరస్వత్రి ఆరోగ్యం నిలకడగా ఉంది, గురువారం ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తామని రవిరాజు వివరించారు.

Pages