S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/31/2016 - 17:52

విశాఖ : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా వాయువ్య దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఆవర్తనం ప్రభావంతో మరో 24 గంటలపాటు కోస్తా, తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

08/31/2016 - 17:37

మచిలీపట్నం: మచిలీపట్నంలో పేద వృద్ధ దంపతులపై గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం దాడి చేశారు. వృద్ధురాలు మృతిచెందగా ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చెమ్మనగిరిపేటలో పాండురంగారావు, ధనలక్ష్మీ దంపతుల ఇంటి తలుపులు తట్టారు. తలుపులు తీయగానే ఇద్దరు వ్యక్తులు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ధనలక్ష్మి అక్కడికక్కడే మృతిచెందింది.

08/31/2016 - 15:44

విజయవాడ : పులిచింతల ప్రాజెక్టు పరిధిలో తెలంగాణ ముంపు గ్రామాలకు పరిహారం ఇచ్చినా ఎందుకు ఖాళీ చేయించలేదని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించింది. గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించామని, గత ఏడాది ఇదే సమయంలో 13.5 టీఎంసీల నీళ్లు ఉన్నాయని తాము 15 టీఎంసీల నీళ్లు నిలవ చేస్తామని చెప్పింది.

08/31/2016 - 13:33

చిత్తూరు : సత్యవేడు మండలం దాసుకుప్పం దగ్గర మహిళలను అక్రమంగా రవాణా చేసే ముఠా సభ్యులను జిల్లా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రఫీ, పాండ్యరాజన్‌ అనే ఇద్దరు వ్యక్తులతోపాటు మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మహిళలను మలేషియా, దుబాయ్‌లకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.

08/31/2016 - 13:26

ఏలూరు : కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన బుధవారం గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో జరిగింది. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన మురళీ, వెంకటేష్‌ కొవ్వాడ కాలువలో పడి గల్లంతయ్యారు.

08/31/2016 - 13:23

గుంటూరు : క్రోసూరు మండలం బాలెమర్రులో బుధవారం ఉదయం విద్యుత్ షాక్‌తో ఒకరు మృతి చెందగా, మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వర్షాలకు పొలాల్లో విద్యుత్ స్తంభాలు కూలాయి. దీన్ని గమనించని ఇద్దరు అక్కడికి వెళ్లడంతో విద్యుత్ షాక్ తగిలింది.

08/31/2016 - 06:54

హిందూపురం, ఆగస్టు 30: ‘అన్నదాతలు ఎవరూ అధైర్యపడవద్దు.. ఇది మీ ప్రభుత్వం.... మీకు అన్నివిధాలా అండగా ఉండి ఆదుకుంటుంది... వీలైనంత ఎక్కువగా వేరుశెనగపంటను రెయిన్‌గన్ల ద్వారా కాపాడుకుందాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం రొద్దం మండలం పెద్దమంతూరులో మహిళా రైతు ఆదిలక్ష్మమ్మ పొలంలో ఏర్పాటు చేసిన రెయిన్‌గన్ పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

08/31/2016 - 06:54

అనంతపురం, ఆగస్టు 30: రాష్ట్రంలో నీతివంతమైన, సమర్థవంతమైన పాలన అందించడమే తన ధ్యేయమని, ఇందుకోసం అహర్నిశలు పనిచేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలుపుతానని ఆయన స్పష్టం చేశారు.

08/31/2016 - 06:53

కాకినాడ, ఆగస్టు 30: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలోని కోన తీర ప్రాంతంలో దివీస్ యాజమాన్యం మందుల ఫ్యాక్టరీ నిర్మాణానికి రంగం సిద్ధంచేస్తుండటాన్ని పరిసర ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ ఏ క్షణానైనా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ఆయా గ్రామాల్లో పోలీస్ పికెట్ ఏర్పాటుచేశారు.

08/31/2016 - 06:52

విశాఖపట్నం, ఆగస్టు 30: విపత్తుల నిర్వహణ సమగ్ర ప్రణాళికలో బీమా అంశాన్ని కూడా చేర్చాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్పీ టక్కర్ తెలిపారు. పట్టణీకరణ నేపథ్యంలో వస్తున్న వివిధ సమస్యలను దృష్టిలో ఉంచుకుని విపత్తుల నిర్వహణ ప్రణాళిక రూపొందించాల్సి ఉందన్నారు.

Pages