S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/31/2016 - 06:27

విజయవాడ, ఆగస్టు 30: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కదలిక వచ్చింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ల మధ్య మంగళవారం ఒప్పందం జరిగింది. నాలుగేళ్లలో మెట్రో ప్రాజెక్టు పూర్తయ్యే వరకు ఈ ఎంవోయు అమల్లో ఉంటుంది. ఏడాదికాలంగా ఈ అగ్రిమెంట్ కుదరనందునే రైల్వేస్టేషన్ - నిడమానూరు కారిడార్ నిర్మాణం కోసం రూ.780 కోట్ల వ్యయంతో పిలువబడిన టెండర్లను కూడా రద్దు చేశారు.

08/31/2016 - 06:14

హైదరాబాద్, ఆగస్టు 30: కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నందున పోలీసు వ్యవస్థను సైతం పునర్ వ్యవస్థీకరించాలని పలువురు శాసన సభ్యులు కోరారు. సైబరాబాద్ మహానగర పోలీసు సవరణ బిల్లును హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మంగళవారం శాసన సభలో ప్రవేశపెట్టిన తరువాత జరిగిన చర్చలో పలువురు శాసన సభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.

08/31/2016 - 06:13

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: హోమియో వైద్య పరీక్షల్లో అవకతవకలు వెలుగు చూశాయి. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమి యో కళాశాలలో పరీక్షల ఒఎంఆర్ షీట్లు తారుమారైన విషయం యూనివర్శిటీ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ప్రిన్సిపాల్‌ను పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాలు జారీచేశారు. అసలు విషయంలోకెళితే..

08/31/2016 - 06:12

విశాఖపట్నం, ఆగస్టు 30: వాతావరణ శాఖ నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి ఒక వ్యవస్థను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ) అభివృద్ధి చేస్తోంది.

08/31/2016 - 05:25

మార్కాపురం/మనుబోలు, ఆగస్టు 30: పంటలు ఎండిపోతున్న అనంతపురం రైతులను ఆదుకునేందుకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలనుంచి వాటర్ ట్యాంకర్లను పంపించాలని స్థానిక అధికారులకు సోమవారం రాత్రి ఆదేశాలు అందాయి.

08/31/2016 - 04:44

హైదరాబాద్, ఆగస్టు 30: నెలరోజులుగా వర్షాలు లేక అల్లల్లాడి పోతున్న రాష్ట్రానికి బంగాళాఖాతంలో అల్పపీడనం రూపంలో వరుణుడు కరుణించాడు. తీవ్ర కరవు బాధతో కనాకష్టం పడుతున్న సీమ రైతుకు వర్షం ఒక్కసారిగా ఊరట కలిగించింది. రాయలసీమలోని నాలుగు జిల్లాలు మంగళవారం వాన రాకడతో పులకించిపోయాయి. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో పొలాలన్నీ ఒక్కసారిగా తడిసాయి. మరోవైపు గుంటూరు నుంచి నెల్లూరు దాకా భారీ వర్షపాతం నమోదైంది.

08/31/2016 - 04:41

విజయవాడ, ఆగస్టు 30: కంచికామకోటి పీఠాధిపతి శ్రీజయేంద్ర సరస్వతి స్వామి(82) హైబిపితో మంగళవారం ఉదయం ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లగా పక్కనే ఉన్న ఆయన శిష్యులు, పీఠం సిబ్బంది హుటాహుటిన ఇక్కడి ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు.

08/31/2016 - 04:36

విజయవాడ, ఆగస్టు 30: కరవుపై యుద్ధం ప్రకటించాం. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన అసాధారణ కరవు నివారించేందుకు అధికార యంత్రాంగాన్ని, సాంకేతిక వ్యవస్థను సమాయత్తం చేశానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. స్థానిక కమాండ్ కంట్రోల్ రూంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షపు నీటిని ఒడిసి పట్టి, పంటలను కాపాడేందుకు తీసుకున్న చర్యలు ఫలప్రదమయ్యాయని ఆయన చెప్పారు.

08/31/2016 - 04:31

విజయవాడ, ఆగస్టు 30: ఓటుకు నోటు కేసు విషయమై ఎక్కువగా మాట్లాడ్డానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. మంగళవారం కమాండ్ కంట్రోల్ రూంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఓటుకు నోటు కేసు విషయమై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఘాటుగా స్పందించారు. క్లుప్తంగా సమాధానం చెప్పారు. ఏసిబి ఈ కేసును వచ్చే నెల 29లోగా విచారించాలని ఆదేశించింది కదా? అని ప్రశ్నించగా, ‘అందులో ఏముంది? మీరు చదివారా? ఏం చేస్తారు?

08/30/2016 - 16:05

విజయవాడ: నిడమానూరు - నెహ్రూ బస్‌స్టేషన్ మెట్రో రైల్‌ కారిడార్‌ను 2019 ఫిబ్రవరికి పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నట్లు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఢిల్లీ మెట్రోరైల్‌ కార్పొరేషన్‌తో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. నాలుగేళ్లలో మెట్రోను పూర్తి చేయాలని ఒప్పందం చేసుకున్నారు.

Pages