S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/28/2016 - 05:41

హైదరాబాద్, ఆగస్టు 27: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బహిరంగంగానే సంకేతాలివ్వడంతో తెలుగుదేశం పార్టీ ఆశావహుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

08/28/2016 - 05:41

అనంతపురం సిటీ, ఆగస్టు 27: అనంతపురం నగరంలోని తపోవనంలో శనివారం నాటు బాంబు పేలింది. దీంతో చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఏరుకునే ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నగరానికి చెందిన కమలమ్మ చెత్తలో ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు ఏరుకుని విక్రయించి పొట్టపోసుకుంటోంది.

08/28/2016 - 05:39

విజయవాడ, ఆగస్టు 27: చెన్నై కేంద్రంగా పలు విద్యా సంస్థలు నడుపుతున్న ఎస్‌ఆర్‌ఎం గ్రూప్ విద్యా సంస్థల అధినేత టిఆర్ పచముత్తును చెన్నై సిటీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్‌ఆర్‌ఎం డీమ్డ్ యూనివర్శిటీ కింద మెడికల్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ ఇలా పలు విద్యా సంస్థలను ఆయన నడుపుతున్నారు.

08/28/2016 - 05:37

హైదరాబాద్, ఆగస్టు 27: అగ్రి గోల్డ్ ఆస్తులపై హైకోర్టు పర్యవేక్షిస్తుండగా, కొన్ని బ్యాంకులు ఈ సంస్థ ఆస్తుల వేలానికి చర్యలు తీసుకుంటున్నాయంటూ ఆంధ్ర సిఐడి అధికారులు శనివారం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సిఐడి తరఫున న్యాయవాది కృష్ణ ప్రసాద్ హైకోర్టు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. ఆంధ్రాబ్యాంకు అగ్రి గోల్డ్ ఆస్తుల వేలానికి నోటీసులు జారీ చేసిందన్నారు.

08/28/2016 - 05:36

హైదరాబాద్, ఆగస్టు 27: అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాలకు పాల్పడుతున్నారని, సింగపూర్ జపం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ హితవుచెప్పారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములను బలవంతంగా సేకరించడం, స్విస్‌చాలెంజ్ పద్ధతిపై తాను చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. తన సవాలును స్వీకరించి మంచి వాతావరణంలో చర్చకు రావాలని ఆయన టిడిపి నేతలను కోరారు.

08/28/2016 - 05:35

హైదరాబాద్, ఆగస్టు 27: చంద్రబాబు మంకుపట్టును వీడి అమరావతి రాజధాని నిర్మాణంలో అమలు చేయనున్న స్విస్‌చాలెంజ్ పద్ధతిని వదులుకోవాలని పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్, వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. శనివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విదేశీ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్‌ను తాకట్టు పెట్టే ధోరణిని మానుకోవాలన్నారు.

,
08/28/2016 - 05:29

విజయవాడ (స్పోర్ట్స్) ఆగస్టు 27: విద్యార్థులు దగ్గరలోని గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధికి విశేష కృషి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల ఆవరణలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా సిఎం చంద్రబాబునాయుడు మొక్కలు నాటారు.

08/28/2016 - 05:26

విజయవాడ, ఆగస్టు 27: వ్యవసాయ అనుమంధ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, చేపల పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. రైతులు పూర్తిగా వ్యవసాయం మీదే ఆధారపడి జీవించడం సాధ్యం కానందున అనుబంధ రంగాలను ప్రోత్సహించి వారిని ఆదుకోవాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచ ప్రఖ్యాత పశుసంపద జన్మస్థలం ఆంధ్రప్రదేశ్.

08/28/2016 - 05:26

శ్రీకాకుళం, ఆగస్టు 27: రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా టిడిపి ప్రభుత్వం కృషిచేస్తోందని ఎపి రాష్ట్ర రజక సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు రాజమండ్రి నారాయణ పేర్కొన్నారు.

08/28/2016 - 05:25

విశాఖపట్నం, ఆగస్టు 27: కాపులను బీసీల్లో చేర్చే సమయం ఆసన్నమైందని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. శనివారం గాజువాకలో మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడి ఇబ్బంది పడుతున్న కాపులను ఎన్నికలకు ముందు చంద్రబాబుబీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తక్షణమే కాపులను బీసీల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు.

Pages