S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/12/2016 - 02:59

గుంటూరు, ఆగస్టు 11: కృష్ణా పుష్కరాల సందర్భంగా అన్ని పుష్కర ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లను నియమించారు. రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా నాటు పడవలలో ఘాట్ల వద్ద పహారాకు సిద్ధం చేశారు. గుంటూరు జిల్లాలోని 72 ప్రధాన ఘాట్లకు నాలుగువేల మంది నియమితులయ్యారు. ప్రమాదవశాత్తు స్నానాల సందర్భంగా భక్తులు గల్లంతు కాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలిస్తున్నారు. రోజుకు రూ.

08/12/2016 - 02:58

విజయవాడ, ఆగస్టు 11: పుష్కర యాత్రికుల సేవలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పుష్కరాలపై తన నివాసం నుంచి గురువారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో 1120 మంది ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎవరికి వారు తమ తమ నియోజకవర్గాల్లో పుష్కర ఏర్పాట్లను, యాత్రికుల సదుపాయాలను దగ్గరుండి పర్యవేక్షించాలని సిఎం స్పష్టం చేశారు.

08/12/2016 - 03:03

కర్నూలు, ఆగస్టు 11 : కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరం ఆలయానికి దేశంలో ఏ ఆలయానికి లేని ఓ విశిష్టత ఉంది. ఈ ఆలయం రెండు పుష్కరాల్లో భక్తుల పూజలనందుకుంటోంది. దేశంలో పుష్కరాలు నిర్వహించే 12 పుణ్య నదులు ఉండగా అందులో గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవహిస్తున్నాయి. వీటిలో కృష్ణా, తుంగభద్ర నదుల పుష్కరాలకు సంగమేశ్వరం ఆతిథ్యమిస్తోంది.

08/12/2016 - 02:55

బెంజిసర్కిల్, ఆగస్టు 11: పుష్కరాల్లో అత్యంత ప్రధానమైన పిండ ప్రదానం కార్యక్రమాన్ని నిర్వహించే బ్రాహ్మణులకు నగరంలో చెదు అనుభవం ఎదురైయ్యింది. ప్రభుత్వ నిర్దేశించిన ఘాట్లలో వీరు పిండ ప్రధానం చేసేందుకు ప్రభుత్వం వీరి నుండి దరఖాస్తులను స్వీకరించారు. పుష్కరాల సమయం రావడంతో వీరంతా గురువారం ఉదయం పలు ప్రాంతాల నుండి నగరంలోని రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

08/12/2016 - 02:54

విశాఖపట్నం, ఆగస్టు 11: ప్రయాణికుల సుదీర్ఘ కల నెరవేరింది. డబుల్‌డెక్కర్ రైలు శుక్రవారం నుంచి పట్టాలెక్కుతుంది. ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించుకున్న డబుల్ డెక్కర్‌ను కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రయాణికులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించిన దక్షిణమధ్య రైల్వే పలుప్రాంతాల మధ్య దీనిని నడుపుతుంది. విశాఖపట్నం-సికింద్రాబాద్, విశాఖపట్నం-తిరుపతి, విశాఖపట్నం-విజయవాడ మధ్య ఇది తిరుగుతుంది.

08/12/2016 - 02:53

విజయవాడ, ఆగస్టు 11: కృష్ణా పుష్కరాల స్నానాల కోసం జలవనరుల శాఖ అధికారులు 12 లక్షల ఎకరాలకు సాగు నీరందించే తూర్పు, పశ్చిమ డెల్టా కాలువలకు చుక్క నీరు వెల్లకుండా పూర్తిగా కట్టివేశారు. ఇక ప్రకాశం బ్యారేజీ దిగువ స్నాన ఘట్టాల నుంచి 10 అడుగుల వెడల్పులో వారధి వరకు మరో వైపు ఇసుక బస్తాలను అడ్డు వేసి తాత్కాలికంగా పుష్కర కాలువను ఏర్పాటు చేయటం జరిగింది.

08/11/2016 - 17:42

విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో కోస్తాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని తెలిపారు.

08/11/2016 - 17:38

విశాఖ : విశాఖపట్నంలోని కేడీపేట్ హైస్కూల్‌లో టెన్త్‌విద్యార్థిని లోవలక్ష్మి హోమ్ వర్క్ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు ఆమెచేత వంద గుంజీలు తీయించాడు. దీనిపై ఆగ్రహించిన విద్యార్థిని తల్లిదండ్రులు డీఇఓ కృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు.

08/11/2016 - 17:37

హైదరాబాద్ : కృష్ణాపుష్కరాలకు ఘనంగా స్వాగతం పలుకుతామని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియోషన్ వెల్లడించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించామని అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. పుష్కర ఆరతి కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.

08/11/2016 - 17:35

విజయవాడ : పుష్కరయాత్రికుల కోసం విజయవాడ గొల్లపూడి మార్కెట్‌యార్డులో ఏర్పాటుచేసిన అక్షయపాత్ర వంటశాలను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. వంటకాలను రుచి చూసి తగు సూచనలు ఇచ్చారు.

Pages