S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/11/2016 - 17:34

ఒంగోలు : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నరుూంతో సంబంధాలు కలిగివుండి ప్రయోజనాలు పొందినవారిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సిపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన గురువారంనాడు ఒంగోలులో విలేకరులతో మాట్లాడుతూ.. నరుూంను పెంచిపోషించింది ప్రభుత్వాలేనని అన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు వత్తిడి తీసుకురావటం లేదని అన్నారు.

08/11/2016 - 17:34

హైదరాబాద్ : నరుూం ఎన్‌కౌంటర్ కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారంనాడు ఆయన ఎన్టీయార్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ అలాగే ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత ముప్పయి ఐదేళ్ల నుంచి ఎలిమినేటి మాధవరెడ్డి కుటుంబం మచ్చలేని రాజకీయాల్లో ఉందని, ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వెల్లడించారు.

08/11/2016 - 16:21

హైదరాబాద్: ఈ నెల 12 నుంచి ఎపిలో జరిగే కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఆహ్వానించారు. ఆయన గురువారం ఎన్టీఆర్‌ను కలిసి ప్రభుత్వం తరఫున ఆహ్వానపత్రిక అందజేశారు.

08/11/2016 - 15:45

హైదరాబాద్‌: జీవో 150ని వెంటనే రద్దు చేయాలని, గ్రూప్స్‌ పరీక్షలు పాత పద్ధతి ప్రకారమే నిర్వహించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయం ఎదుట గురువారం గ్రూప్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళన చేపట్టారు.

08/11/2016 - 15:40

విజయవాడ: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంగమం వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాత్రి 8.15 గంటలకు సీఎం చంద్రబాబు పవిత్ర సంగమం వద్ద నమూనా దేవాలయాలను ప్రారంభిస్తారు. సీఎం ప్రసంగించిన అనంతరం లేజర్‌షో ప్రదర్శించనున్నారు. కృష్ణా హారతి కార్యక్రమాన్ని దీపం వెలిగించి చంద్రబాబు ప్రారంభిస్తారు.

08/11/2016 - 12:27

విజయవాడ: కృష్ణా పుష్కరాలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ గురువారం ఉదయం నగరంలో పుష్కర పరుగు నిర్వహించారు. డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో ఈ రన్ ప్రభుత్వ సంగీత కళాశాల నుంచి కృష్ణవేణి పుష్కర్ ఘాట్ వరకూ కోలాహలంగా సాగింది. ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఎమ్మెల్యే బోండా ఉమా తదితరులు పాల్గొన్నారు.

08/11/2016 - 12:25

కర్నూలు: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న అనుమానంతో ముగ్గురు వ్యక్తులను అవుకు మండలం రామవరం వద్ద గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు స్థానికంగా ఓ ఇరిగేషన్ ప్రాజెక్టులో కూలీలుగా పనిచేస్తూ మావోయిస్టులక సహకరిస్తున్నట్లు సమాచారం. బుగ్గ వద్ద ఓ ప్రైవేటు అతిథిగృహంలో ఈ ముగ్గురినీ పోలీసు అధికారులు విచారిస్తున్నారు.

08/11/2016 - 08:46

విజయవాడ, ఆగస్టు 10 : భగవంతుడి అవతారమైన దత్తాత్రేయుడు కృష్ణానదిలో అంతర్లీనంగా ఉన్నారని భగవాన్ విశ్వయోగి విశ్వంజీ పేర్కొన్నారు. శుక్రవారం నుండి ప్రారంభమయ్యే కృష్ణాపుష్కరాల సందర్భంగా ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, కృష్ణానది జన్మస్థలమైన సహ్యాద్రి దత్తాత్రేయుడి స్థిరనివాసమని గుర్తు చేశారు.

08/11/2016 - 08:44

ముత్తుకూరు, ఆగస్టు 10: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరు గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో మూడో యూనిట్‌కు సంబంధించి భూమిపూజ బుధవారం జరిగింది. ప్రాజెక్టు డైరెక్టర్ రాఘవేంద్రరావు, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖరరావు ఇంజనీర్ల బృందంతో కలిసి మూడో యూనిట్‌కు భూమిపూజ చేశారు.

08/11/2016 - 08:43

విజయవాడ, ఆగస్టు 10: క్రిస్ అప్రూవ్ సాఫ్ట్‌వేర్ పరిజ్ఞానంతో స్నానఘట్టాల వద్దనే సాధారణ రైల్వే టిక్కెట్ల జారీకి 40 యూనిట్లతో విజన్ టెక్ సంస్థ ముందుకొచ్చింది. స్థానిక కలెక్టరు ఛాంబరులో బుధవారం రైల్వే శాఖ అనుమతితో రూపొందించిన ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ పరికరం ద్వారా స్వచ్ఛందంగా యాత్రికులకు టిక్కెట్ల జారీపై వివరాలను కంపెనీ ప్రతినిధి రమేష్, టెక్నికల్ సహాయకులు హేమంత్ వివరించారు.

Pages