S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/11/2016 - 06:11

విజయవాడ, ఆగస్టు 10: ప్రతిష్ఠాత్మక కృష్టా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ టెక్నాలజీని ఆయుధంగా మలుచుకుంది. అందుబాటులో ఉన్న ఏ సరికొత్త ప్రపంచస్థాయి సాంకేతికతను వినియోగించుకునేందుకు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఆధునిక పరిఙ్ఞన నిఘా, సమాచార వ్యవస్థను అనే్వషించి ఒడిసిపట్టుకున్న పోలీసుశాఖ పుష్కరాలను విజయవంతంగా నడిపేందుకు ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అమలు చేస్తోంది.

08/11/2016 - 06:07

విజయవాడ, ఆగస్టు 10: పని చేయకపోవడాన్ని అలవాటుగా మార్చుకున్న కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు తమ పనితీరు మార్చుకోపోతే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా హెచ్చరించారు. ఇంజనీర్లకు కూడా ఇందులో మినహాయింపు లేదని చెప్పారు. గృహ నిర్మాణ శాఖపై గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. బిల్లుల చెల్లింపులో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

08/10/2016 - 17:58

విజయవాడ: శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా వూరుకునేది లేదని,అమలాపురంలో దళితులపై దాడి ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీజీపీకి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారు.

08/10/2016 - 16:01

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో గురువారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.

08/10/2016 - 14:17

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో గోదావరి అంత్యపుష్కరాలు గురువారం ముగియనున్నాయి. పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమం నిర్విహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు పుష్కరఘాట్‌లో నిర్వహించే హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.

08/10/2016 - 12:18

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం బి-బ్లాకులో రాష్ట్ర ఆర్థికశాఖ కార్యాలయాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం ప్రారంభించారు. ఈనెల 29 నుంచి ఇక్కడ ఆర్థికశాఖ పూర్తిస్థాయిలో పనిచేస్తుందన్నారు. గత ఏడాది 11 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే ఎపి అగ్రభాగాన నిలిచిందని, కేంద్రం నుంచి తగినంతగా గ్రాంట్లు వస్తే పరిపాలన ఇంకా మెరుగుపడుతుందన్నారు.

08/10/2016 - 12:17

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ ప్రాంగణంలో ఎపి సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ కార్యాలయాలను మంత్రి రావెల కిశోర్‌బాబు బుధవారం ప్రారంభించారు. వారంలోగా పూర్తిస్థాయిలో కార్యాలయాలు సిద్ధమవుతాయని, తగినంత వసతి కోసం వీటిని ప్రారంభించడంలో ఆలస్యం జరిగిందన్నారు.

08/10/2016 - 12:17

విశాఖ: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇఇ వీర మాధవరావు ఆస్తులపై ఎసిబి అధికారులు బుధవారం సోదాలు ప్రారంభించారు. విశాఖలో ఆరు ప్రాంతాల్లో ప్రారంభించిన సోదాల్లో ఇప్పటికే భారీగా అక్రమాస్తులున్నట్టు ఎసిబి అధికారులు కనుగొన్నారు.

08/10/2016 - 12:08

కర్నూలు : శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 865.80 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 20,483 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తూ, కుడివైపు విద్యుత్‌ కేంద్రంలో 3 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1045 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 1043 అడుగులకు చేరింది.

08/10/2016 - 06:13

విజయవాడ, ఆగస్టు 9: భద్రతే లక్ష్యంగా పుష్కర ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ ఎన్ సాంబశివరావు తెలియచేశారు. మంగళవారం ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పుష్కర విధుల నిర్వహణకు 30 మంది ఐపిఎస్ అధికారుల సహా 31,401 మంది సిబ్బందిని నియమించామని తెలియచేశారు.

Pages