S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/09/2016 - 04:47

విజయవాడ, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల్లో ప్రధానంగా పవిత్ర స్నానమాచరించే వారికోసం కోట్లాది రూపాయలతో నిర్మితమైన స్నాన ఘట్టాలు విద్యుత్ కాంతులతో ధగద్ధగాయమానంగా వెలుగులీనుతున్నాయి. వీటిని అందమైన టైల్స్‌తో తీర్చిదిద్దటంతో తిలకించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తూ మెట్లపై కూర్చుని గ్రూప్ ఫొటోలు దిగుతున్నారు.

08/09/2016 - 04:45

సింహాచలం, ఆగస్టు 8: భక్తుల సేవే భగవంతుడి సేవగా భావించి భక్తితో, బాధ్యతతో విధులు నిర్వహించాలని స్వచ్ఛంద సేవకులకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె. రామచంద్రమోహన్ పిలుపునిచ్చారు. దేవాలయాల్లో స్వచ్ఛంద సేవకుల భాగస్వామ్యాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు సింహాచలం దేవస్థానం ప్రయోగాత్మకంగా తొలిసారిగా నృసింహ సేవాదళం పేరుతో ఒక వ్యవస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.

08/09/2016 - 04:42

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అనంతపురం జిల్లాకు ప్రధాన మంత్రి పసల్ బీమా పథకాన్ని విస్తరించాలని టిడిపి సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి లోక్‌సభలో డిమాండ్ చేశారు. సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. అనంతపురం కరవుబాధిత ప్రాంతం, ఇక్కడ వర్షపాతం కూడా చాలా తక్కువ అని చెబుతూ జిల్లా రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాన మంత్రి పంటల బీమా పథకాన్ని ఈ జిల్లాలో వెంటనే అమలు చేయాలన్నారు.

08/09/2016 - 04:39

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు విజయవాడ తదితర ప్రాంతాలకు ప్రయాణీకుల సౌకర్యార్థం 275ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ రామకృష్ణ వెల్లడించారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేఖర్లతో మాట్లాడారు.

08/09/2016 - 04:39

ఖమ్మం (ఖానాపురం హవేలి), ఆగస్టు 8: రాష్ట్రంలో 6,400 కోట్ల రూపాయల వ్యయంతో 320 గురుకులాలు ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు.. సోమవారం ఖమ్మం నగరంలో జిల్లా ప్రవాస భారతీయులు (జిల్లా ఎన్‌ఆర్‌ఐ ఫోరం) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు మోటివేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ ఏ ప్రభుత్వమూ చేపట్టని పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.

08/09/2016 - 04:38

కాకినాడ, ఆగస్టు 8: దైవ దర్శనంతో అన్నీ శుభాలే జరుగుతాయని భావించే భక్తులకు మొక్కలను పెంచడం ద్వారా కూడా అంతే మేలు చేకూరుతుందనే సందేశంతో ప్రభుత్వ యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. భగవంతుడిని పూజించే భక్తులు మొక్కల పట్ల కూడా అదే భక్త్భివాన్ని ప్రదర్శించిన పక్షంలో భావి తరాలకు మేలు చేకూరుతుందన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు.

08/09/2016 - 04:38

విజయపూరి సౌత్, ఆగస్టు 8: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యత్ కేంద్రం ద్వారా కృష్ణాడెల్టాకు సోమవారం మధ్యాహ్నం సాగర్ జెన్కో ఎస్‌సి రాజనరసయ్య నీటిని విడుదల చేశారు. కృష్ణా పుష్కరాలు ఈ నెల 12న ప్రారంభం కానున్న నేపథ్యంలో కృష్ణా ఆయకట్టు ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉండటంతో కృష్ణా రివర్ బోర్డు ఐదు టిఎంసిల నీటిని తక్షణమే విడుదల చేయాలని సాగర్ ప్రాజెక్టు అధికార్లకు సూచించింది.

08/09/2016 - 04:37

రోలుగుంట, ఆగస్టు 8: విశాఖ జిల్లా రోలుగుంట మండలం వడ్డిపలో సోమవారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. పాత పెంకుటిల్లు కూలుస్తుండగా గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమించడంతో విశాఖ కెజిహెచ్‌కు తరలించారు.

08/09/2016 - 04:37

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: మద్యం మత్తులో ప్రయాణీకులతో అనుచితంగా, దురుసుగా ప్రవర్తించిన ఒక టిసిని రాజమహేంద్రవరం ఆర్‌పిఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. గంగాప్రసాద్ అనే టిసి జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో సోమవారం విధి నిర్వహణలో భాగంగా టిక్కెట్ల పరిశీలన చేపట్టారు.

08/09/2016 - 04:36

రాజమహేంద్రవరం, ఆగస్టు 8: గోదావరి నదిలో వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. ఎగువన భద్రాచలం వద్ద వరద మట్టం తగ్గుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజి వద్ద కూడా నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. సోమవారం ధవళేశ్వరం బ్యారేజి వద్ద 8.7 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద 35.7 అడుగులు నమోదైంది.

Pages