S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/08/2016 - 07:47

విజయవాడ, ఆగస్టు 7: పేదల పాలిట సంజీవని.. బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య దీప్తి... రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చంద్రకాంతి ఎన్టీఆర్ వైద్యసేవ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతను తమ బాధ్యతగా తీసుకుంది. నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి ప్రాణాలను నిలబెడుతోంది.

08/08/2016 - 07:45

వేదాయపాళెం, ఆగస్టు 7: నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన కోటకు చెందిన బాల మేధావి షేక్ తబీబ్ అహ్మద్‌కు అరుదైన రెండు వరల్డ్ రికార్డులు దక్కాయి. భారత్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు ఆదివారం నెల్లూరులో నిర్వహించిన పోటీలో తబీబ్ అహ్మద్ రికార్డు సృష్టించాడు.

08/08/2016 - 07:44

ఒంగోలు, ఆగస్టు 7: రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్, జపాన్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయని, పారిశ్రామికవేత్తలకు అనుమతులు వేగవంతంగా మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు.

08/08/2016 - 07:43

తిరుమల, ఆగస్టు 7: గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు తమ ఇష్టవాహనమైన గరుడినిపై తిరుమాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. రాత్రి 7 నుంచి 9 గంటల నడుమ గరుడ వాహనసేవ అత్యంత రమణీయంగా జరిగింది. శ్రీవారి వాహనాల్లోనూ, సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుడుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పంచమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు.

08/08/2016 - 07:34

నెల్లూరు/ఆత్మకూరు, ఆగస్టు 7: సారా వ్యతిరేక ఉద్యమ వీర వనితగా పేరొందిన దూబగుంట రోశమ్మ అసలు పేరు వర్దినేని రోశమ్మ. పేద కుటుంబానికి చెందిన ఈమె తన జీవనగమనంలో ఎదుర్కొన్న ఆటుపోట్లే సారా ఉద్యమానికి ఊపిరిలూదాయి.

08/08/2016 - 07:34

శ్రీకాకుళం, ఆగస్టు 7: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా నాలుగురోజులుగా ఒడిశాలో కుంభవృష్టికి నాగావళి నదికి వరద పోటెత్తింది. ఈ వరద శ్రీకాకుళం జిల్లాలో కునుకుపేట సమీపంలో గల పొన్నాడలంక ప్రాంతాన్ని చుట్టుముట్టింది. శనివారం ఉదయం లంకలో గల జీడితోటలకు ఎరువులు వేసే పనిలో నిమగ్నమైవున్న విశాఖపట్నం జిల్లా రాంబిల్లి మండలం, రావుపాలేంకు చెందిన 28 మంది కూలీలు చిక్కుకున్నారు.

08/08/2016 - 07:29

మచిలీపట్నం, ఆగస్టు 7: కృష్ణా పుష్కరాల ప్రారంభానికి ముందే దివిసీమలో ఆదివారం మహాద్భుతం ఆవిష్కృతమైంది. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా 10వేల మంది బాలబాలికలతో నిర్వహించిన కోలాట ప్రదర్శన అదరగొట్టింది. జలజల పారే కృష్ణమ్మ తల్లి విశిష్ఠత, దివిసీమ ప్రాశస్త్యాన్ని కోలాట ప్రదర్శన ద్వారా ఆవిష్కరింపజేశారు. అంతరించిపోతున్న ప్రాచీన కళలకు ఈ కోలాట ప్రదర్శన ఊపిరి పోసినట్టైంది.

08/08/2016 - 07:00

కలిగిరి, ఆగస్టు 7: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు సంపూర్ణ మద్య పాన నిషేధానికి మూలకారకురాలైన దూబగుంట రోశమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. మూడేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోశమ్మ ఆదివారం స్వగ్రామం దూబగుంటలో మరణించారు. నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతమైన జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో రోశమ్మ 1923లో జన్మించారు.

08/08/2016 - 06:53

రాజమహేంద్రవరం, ఆగస్టు 7: గోదావరి అంత్య పుష్కర స్నానానికి జనం పోటెత్తారు. అంత్య పుష్కరాలు ఆదివారానికి ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఇప్పటివరకూ లక్షలాదిగా పుణ్య స్నానాలు ఆచరించారు. రాజమహేంద్రవరంలోనీ పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. నాగపంచమి మరింత ప్రసిద్ధంగా భావించి అత్యధికంగా పుణ్య స్నానాలకు వచ్చినట్టు సమాచారం.

08/08/2016 - 06:51

విజయవాడ, ఆగస్టు 7: కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక్క విజయవాడ నగరానికే మూడున్నర కోట్ల మంది యాత్రికులు రాగలరని అధికారులు అంచనా వేస్తున్నారు. దాంతో ప్రధానంగా హోటళ్లు, లాడ్జీలపై ఊహించని రీతిలో తాకిడి పెరిగింది. నగరంలో స్టార్ కేటగిరి హోటల్స్‌సహా ఇతరత్రా లాడ్జీలవరకూ దాదాపు నాలుగువేల గదులున్నాయి.

Pages