S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/07/2016 - 03:55

కర్నూలు, ఆగస్టు 6: రాష్ట్రంలోని రైతులకు సాగునీటి రక్షణ కల్పించడానికి నిరంతరం శ్రమిస్తున్నామని, లోటు బడ్జెట్ ఉన్నా ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కర్నూలులో శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు హంద్రీ-నీవా, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేశామన్నారు.

08/07/2016 - 03:54

విశాఖపట్నం, ఆగస్టు 6: ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకురాలు సుపర్ణ ఎస్.పచౌరీ పేర్కొన్నారు. మూడు రోజుల పాటు విశాఖలో జరిగిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఇంటర్ స్టేట్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ ముగింపు శనివారం జరిగింది. 10 రాష్ట్రాల నుంచి వచ్చిన 38 మంది అధికారులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో క్షేత్ర పర్యటనలు చేశారు.

08/07/2016 - 03:14

కాకినాడ, ఆగస్టు 6: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి జీతాల చెల్లింపు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానే్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమలుచేయాలని ఉపాధి హామీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వారు కోరుతున్నారు.

08/07/2016 - 03:14

తిరుమల, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా విషయంలో సానుకూలంగా ఉన్నట్టు అనిపిస్తోందని టిడిపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ అన్నారు. హోదా విషయాన్ని అభ్యర్థించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంలో ఆయన ‘‘ మీ సమస్య నా సమస్య’’ అని హామీ ఇచ్చారని, ఆయన తప్పకుండా రాష్ట్రాన్ని అన్నివిధాలా ఆదుకుంటారని తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆయన అన్నారు.

08/06/2016 - 18:17

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా విషయంలో కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని కేంద్రమంత్రి సుజనాచౌదరి శనివారం ఇక్కడ మీడియాతో అన్నారు. బంద్‌లు, ఆందోళనలతో హోదా రాదని, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే దిల్లీలో దీక్షలు చేయాలన్నారు. ప్రత్యేక హోదా సాధించేందుకు సిఎం చంద్రబాబు ఇప్పటికే ప్రధాని మోదీతో, కేంద్రమంత్రులతో చర్చలు జరిపారన్నారు. త్వరలోనే ప్రత్యేక హోదా సాధిస్తామన్న నమ్మకం తమకు ఉందన్నారు.

08/06/2016 - 18:16

ఒంగోలు: శ్రీశైలం నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు ప్రకాశం జిల్లా గండ్లకమ్మ వద్ద అదుపు తప్పి రోడ్డుపక్కన విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన 20 మందిని పోలీసులు వైద్య చికిత్స నిమిత్తం మార్కాపురం ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ వైర్లు బస్సుకు తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణీకులు చెప్పారు.

08/06/2016 - 17:59

విజయవాడ: నగరంలోని గాంధీ మహిళా కాలేజీ సమీపంలో బాపట్లకు చెందిన భాగ్యరాజ్ అనే వ్యక్తి పుష్కరాల పనుల్లో విద్యుత్ స్తంభానికి రంగులు వేస్తుండగా మరణించాడు. అతడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు రాస్తారోకో చేశారు.

08/06/2016 - 17:51

విశాఖ: అంతర్ జిల్లా నేరస్తుడు రౌతు మల్లేశ్‌తో పాటు మరో ముగ్గురు దొంగలను విశాఖ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి పోలీసులు 317గ్రాముల బంగారం, 5.35 కిలోల వెండి, రెండు బైక్‌లు, రూ.3500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నేరస్తుడు మల్లేశ్‌పై అనేక జిల్లాల్లో కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు. వీరి కోసం ఎప్పటి నుంచో వలపన్నామని పోలీసులు వెల్లడించారు.

08/06/2016 - 17:49

విజయవాడ: కృష్ణా జిల్లాలో పుష్కరాలకు 3 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, శాటిలైట్ బస్సు, రైల్వే స్టేషన్‌లు ఏర్పాటు చేశామని కలెక్టర్ బాబు చెప్పారు. పుష్కరవిధుల్లో 60వేల మంది ఉద్యోగులు, 15వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని తెలిపారు. పుష్కరాలలో వాలంటీర్ల సేవలు వినియోగించుకుంటామని పేర్కొన్నారు.

08/06/2016 - 15:44

శ్రీకాకుళం: సంతకవిటి మండలం రంగరాయపురం వద్ద స్కూలు విద్యార్థులతో వెళ్తున్న పడవకు త్రుటిలో ప్రమాదం తప్పింది. సంతకవిటి గ్రామానికి చెందిన 15 మంది విద్యార్థులు నాగావళి ఆవలి ఒడ్డున ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారు. శనివారం ఉదయం వారు బయలుదేరిన పడవకు నారాయణపురం ఆనకట్ట సమీపంలో దట్టంగా ఉన్న గుర్రపుడెక్క ఆకు అడ్డుపడింది. పడవ మునిగిపోయే ప్రమాదంలో పడింది.

Pages