S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/05/2016 - 13:00

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు పెరిగింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను స్వల్పంగా ఎత్తి 4లక్షల47వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది.

08/05/2016 - 12:00

తిరుమల:ఇకపై 90 రోజులు ముందుగానే శ్రీవారి సేవా టికెట్లను అందజేయనున్నట్లు, ఆన్‌లైన్‌లో సేవా టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ ఈవో సాంబశివరావు శుక్రవారం ఉదయం తెలిపారు. నమూనా ఆలయంలో ఉదయం7 నుంచి 9వరకు భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. రాగి డాలర్లను నమూనా ఆలయం వద్ద విక్రయిస్తామని చెప్పారు. 40కోట్లతో బర్డ్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయనున్నట్లు ఈవో ప్రకటించారు.

08/05/2016 - 06:01

హైదరాబాద్, ఆగస్టు 4: కేంద్ర అటవీ శాఖ నుండి త్వరితగతిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు రానున్నాయని రాష్ట్ర అటవీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి చెప్పారు. ఢిల్లీలోని పార్లమెంటు భవన్‌లో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి అనిల్ మాధవ్ దవేతో సమావేశమైన గోపాల కృష్ణారెడ్డి సమావేశ వివరాలను వెల్లడించారు.

08/05/2016 - 06:00

విజయవాడ, ఆగస్టు 4:దగాపడిన కులాలకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రజ క, నారుూ బ్రాహ్మణ, వడ్డెర, కుమ్మరి/శాలివాహన, సగర, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ల చైర్మన్లు, డైరక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగింది. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వెనుకబడిన కులాల వారిని పైకి తీసుకురావడానికి బీజం వేసింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని అన్నారు.

08/05/2016 - 05:58

హైదరాబాద్, ఆగస్టు 4: జిఎస్‌టి అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి ఏటా 4700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని అంచనా వేసినట్టు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఐదేళ్లలో రాష్ట్రానికి జిఎస్‌టి వల్ల 23,500 కోట్లు నష్టం వస్తుందని, దీనిని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.

08/05/2016 - 05:57

హైదరాబాద్, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావుకు, విద్యాశాఖకు చెందిన వివిధ విభాగాల అధికారులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం తారాస్థాయికి చేరింది. పాఠశాల విద్యాశాఖలో ఎస్‌సిఇఆర్‌టి, పరీక్షల బోర్డు, పుస్తక ప్రచురణ విభాగం, ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతోనూ, ఉన్నత విద్యాశాఖ అధికారులతోనూ, సర్వ శిక్షా అభియాన్ అధికారులతో ప్రతి రోజూ పంచాయితీలు నడుస్తున్నాయి.

08/05/2016 - 05:56

హైదరాబాద్, ఆగస్టు 4: విద్యార్ధులతో సదస్సులు నిర్వహించే అర్హత జగన్మోహన్‌రెడ్డికి లేదని ఏపి ఉమెన్స్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 11 కేసుల్లో ఎ-1గా ఉండి జగన్మోహన్‌రెడ్డి ఏ విధంగా విద్యార్థులతో సమావేశం అవుతారని ఆమె ప్రశ్నించారు.

08/05/2016 - 05:55

న్యూఢిల్లీ,ఆగస్టు 4: సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మెగా ఫుడ్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పార్కును రూ.184.88 కోట్ల అంచనా వ్యయం ప్రారంభించనుంది. విశాఖపట్నం, కాకినాడ మధ్యలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, దిగుమతులను ప్రోత్సహించడానికి ఈ పార్కును కోస్టల్ ఎకనామిక్ జోన్‌లో(సిఇజడ్)లో ఏర్పాటు చేయనుంది.

08/05/2016 - 05:55

న్యూఢిల్లీ, ఆగస్టు 4: కేంద్రం ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసిన తరుణంలో రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత రావడంతోనే హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట మారుస్తున్నారని వైకాపా పార్లమెంట్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ప్రత్యేకహోదా ఇవ్వలేమని ప్రధాన మంత్రి లీక్ చేసి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

08/05/2016 - 05:11

విజయవాడ, ఆగస్టు 4: పిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. పార్టీలో చీలిక అనంతరం ఎన్టీఆర్ తెలుగుదేశంలో కొంతకాలం కీలక పాత్ర వహించి ఆపై గడచిన 17ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలలో ముఖ్య పాత్ర వహిస్తూ వచ్చిన నెహ్రూ తెలుగుదేశంలో చేరాలనే నిర్ణయంపై కృష్ణా జిల్లాలో ప్రకంపనలు రేగుతున్నాయి.

Pages