S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/04/2016 - 12:11

అనంతపురం: ప్రసన్నాయపల్లి వద్ద గురువారం ఉదయం రైలు ఢీకొని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు రిలయన్స్ సంస్థలో ఇంజనీర్లుగా, మరొకరు రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత దగ్గరి బంధువు గిరిగా పోలీసులు గుర్తించారు. సునీతకు వరసకు అల్లుడైన గిరి మరణించడంతో పెద్ద సంఖ్యలో సమీప గ్రామాలవారు ప్రమాద స్థలానికి వచ్చారు. మంత్రి సునీత హుటాహుటిన ప్రసన్నాయపల్లికి వచ్చి గిరి తల్లిదండ్రులను ఓదార్చారు.

08/04/2016 - 12:11

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు గురువారం సాయంత్రం నాలుగు గంటలకు దిల్లీ చేరుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, ఉప రాష్టప్రతి, పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలుసుకుంటారు. ఈనెల 12 నుంచి జరిగే కృష్ణాపుష్కరాలకు రావాల్సిందిగా వీరిని ఆహ్వానిస్తారు.

08/04/2016 - 12:10

ఒంగోలు: ఆర్టీసీ బస్సు, సిమెంటు లోడ్‌తో వెళుతున్న లారీ పరస్పరం ఢీకొనడంతో 23 మంది ప్రయాణీకులు గాయపడ్డారు. సంతమాగలూరు వద్ద గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు వినుకొండ నుంచి నరసారావుపేట వెళుతోంది.

08/04/2016 - 08:10

విజయవాడ, ఆగస్టు 3: రాష్ట్ర ప్రభుత్వం ఏటా రైతులకిచ్చే వ్యవసాయ రుణాల మొత్తాన్ని భారీగా పెంచింది. 2016-17 సంవత్సరానికి గాను మొత్తం 83 వేల కోట్ల రూపాయల రుణాలు అందజేయాలని నిర్ణయించింది.

08/04/2016 - 08:02

హైదరాబాద్, ఆగస్టు 3: ఆంధ్రాకు ప్రత్యేక హోదా గురించి అన్ని పక్షాలను కలుపుకుని పోరాడకుండా, అరటాకులా నలిగిపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొనడం అత్యంత విచారకరమని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. విభజన సమయంలో రక్తం మరుగుతోందని చెప్పారని, ఇప్పుడు మరిగిన రక్తం ఆవిరైందా అని బాబును నిలదీశారు.

08/04/2016 - 08:02

కర్నూలు, ఆగస్టు 3: మహారాష్టల్రో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి శుక్రవారం నాటికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, జాగ్రత్తగా ఉండాలంటూ సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) బుధవారం జిల్లా కలెక్టర్‌కు సమాచారం పంపింది. కృష్ణానదిపై ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల జలాశయాలు ఇప్పటికే నిండినందున వచ్చిన నీరు వచ్చినట్లే దిగువకు విడుదల చేయనున్నారు.

08/04/2016 - 07:59

విశాఖపట్నం, ఆగస్టు 3: రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు అమలు జరుగుతున్న తీరును అధ్యయనం చేసేందుకు 10 రాష్ట్రాల ప్రతినిధులు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఉపాధిలో సాధించిన విజయాలను పరిశీలించడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో అమలు చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ఈ నెల 4 నుంచి మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు తెలిపారు.

08/04/2016 - 07:57

హైదరాబాద్, ఆగస్టు 3: ఒక శాఖ సమీక్షకు ముందు డేటా రావల్సి ఉంటుంది. అది ఉంటేనే సమీక్ష. లేకపోతే లేదు. అది పాత పద్ధతి. ఇప్పుడు ఆ పద్ధతి మార్చేశారు చంద్రబాబు నాయుడు. అధికారుల కంటే ముందే తన ట్యాబ్‌లో సమాచారం సిద్ధంగా ఉంచుకుంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయసు మీరుతున్నకొద్దీ సాంకేతిక పరిజ్ఞానం పెంచుకుంటున్నారు.

08/04/2016 - 07:40

గుంటూరు, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మూడోవిడత మరో మూడు కీలక శాఖలను గురువారం తరలించనున్నారు. రాష్ట్ర హోం, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన చాంబర్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు, రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని 11 గంటలకు, పురపాలకశాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తన కార్యాలయాన్ని ఉదయం 11.30 గంటలకు ప్రారంభించనున్నారు.

08/04/2016 - 07:39

మిడుతూరు, ఆగస్టు 3: ‘ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’గా పిలువబడే బట్టమేక పక్షి ఎట్టకేలకు కనిపించింది. గత పది రోజుల్లో ఏకంగా మూడు బట్టమేక పక్షులు కర్నూలు జిల్లాలోని రోళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో కనిపించినట్లు రైతులు తెలిపారు. గత ఆరేళ్లుగా ఆనవాళ్లు లేకుండా పోయిన ఈ పక్షి మళ్లీ కనిపించడంతో అటవీశాఖ అధికారులు, పక్షి ప్రేమికుల్లో ఆనందం చోటుచేసుకుంది.

Pages