S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/21/2016 - 07:52

విశాఖపట్నం, జూలై 20: పెద్ద నగరాల మాస్టర్ ప్లాన్‌ను సమీక్షించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ అంకౌంట్స్ కమిటీ చైర్మన్ బి రాజేంద్రనాథ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. విశాఖలో మూడు రోజుల పాటు వివిధ అంశాలపై సమీక్షించిన కమిటీ బుధవారం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ అవరాలకు అనుగుణంగా నగరాల మాస్టర్ ప్లాన్‌కు సవరణలు చేయాల్సి ఉందని, ఈ అంశాన్ని తాము ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు.

07/21/2016 - 07:51

విజయవాడ, జూలై 20: ఎర్రచందనం స్మగ్లర్లపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కఠినతరమైన చట్టాలు తీసుకువస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విజయవాడలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనంపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

07/21/2016 - 07:50

విశాఖపట్నం, జూలై 20: తీర ప్రాంత భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఎపి డిజిపి జెవి రాముడు పేర్కొన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేట మండలం పెంటకోటలో రూ.47 లక్షలతో నిర్మించిన మెరైన్ పోలీసు స్టేషన్ భవనాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సువిశాల తీర ప్రాంతం ఉన్న నవ్యాంధ్రలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు వెల్లడించారు.

07/21/2016 - 07:43

హైదరాబాద్, జూలై 20: ఏపికి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుపై ఈనెల 22న జరగనున్న ఓటింగ్ ఆసక్తికరంగా మారింది. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలూ సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఎత్తులు వేస్తుండటమే దానికి కారణం. కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు ఓటింగు వరకూ రావడం అనుమానంగానే ఉంది.

07/21/2016 - 07:42

విజయవాడ, జూలై 20: ప్రస్తుత ప్రపంచంలో ఆహార ధాన్యాల కొరత ప్రధాన సమస్యగా మారింది. పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా ఆహారోత్పత్తి జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా దేశాల ప్రభుత్వాలు తిండి గింజల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. భారతదేశంలో ప్రస్తుత జనాభా 120 కోట్ల పైమాటే.

07/21/2016 - 07:42

తిరుపతి, జూలై 20: తెలుగుభాష మనుగడకు సాహితీ సంస్థలు ఉద్యమించాలని రాష్ట్ర ఉప శాసనసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎస్వీ ఆర్ట్స్ బ్లాక్‌లో శంకరంబాడి సుందరాచారి పీఠాన్ని ఆయన ప్రారంభించారు. శంకరంబాడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

07/21/2016 - 07:41

హైదరాబాద్, జూలై 20: నగరంలోని ముషీరాబాద్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ముగ్గురు బాలురు చిన్న కుక్కపిల్లను చంపి.. ముక్కలుగా చేసి కాల్చారు. అంతటితోనే ఆగకుండా ఈ ఘటనను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఇటీవల తమిళనాడులో ఓ కుక్కను వైద్య విద్యార్థి మేడ పైనుంచి కిందికి విసిరేసిన సంఘటన మరువకముందే ముషీరాబాద్ డయారా కమాన్‌లోనూ అలాంటి సంఘటన చోటుచేసుకోవడం జంతు ప్రేమికులను కలచివేసింది.

07/21/2016 - 07:40

హైదరాబాద్, జూలై 20: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు బుధవారం నాడు శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి ఆశీర్వచనాలు అందుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ నుండి శృంగేరీ వెళ్లిన సభాపతి బుధవారం ఉదయం అక్కడ స్వామి వారిని కలుసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్భుత శైవ క్షేత్రంగా కోటప్పకొండను అభివృద్ధి చేస్తున్న క్రమాన్ని డాక్టర్ కోడెల పీఠాధిపతికి వివరించారు.

07/21/2016 - 07:35

హైదరాబాద్, జూలై 20: ఇటీవల న్యాయాధికారుల ఆందోళన సందర్భంగా ప్రెస్‌మీట్‌లో హైదరాబాద్ హైకోర్టు జడ్జి, న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు అభియోగాలపై జూనియర్ సివిల్ జడ్జి ఎస్ రాధాకృష్ణకు కోర్టు ధిక్కారం కింద హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ల సంఘం అధ్యక్షుడు సి నాగేశ్వరరావు వీడియో ఫుటేజి క్లిప్పింగ్‌లను పంపుతూ హైకోర్టుకు లేఖ రాశారు.

07/21/2016 - 07:35

విజయవాడ, జూలై 20: రాష్ట్రంలో 11492 కోట్ల విలువైన 160 ప్రాజెక్ట్‌లు రానున్నాయని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలియచేశారు. రాష్ట్రంలో టూరిజం ప్రాజెక్ట్‌ల అమలు తీరుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం బుధవారం సమావేశమైంది. సమావేశానంతరం యనమల విలేఖరులతో మాట్లాడుతూ 11492 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌ల్లో 3000 కోట్లు విలువైన ప్రాజెక్ట్‌లు గ్రౌండ్ అయ్యాయని అన్నారు.

Pages