S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/21/2016 - 07:34

హైదరాబాద్, జూలై 20: ఆంధ్రాలో రాష్టవ్య్రాప్తంగా వెబ్‌ల్యాండ్‌పై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు రెవి న్యూ శాఖ చర్యలు ప్రారంభించినట్టు ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి చెప్పారు. వెబ్‌ల్యాండ్‌లో లోపాలను సరిచేయడానికి జమా బందీ తరహా విధానాన్ని అనుసరించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు చెప్పారు.

07/21/2016 - 07:33

విజయవాడ, జూలై 20: రాష్ట్ర పోలీస్ డైరక్టర్ జనరల్ రాముడు ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ డిజిపిగా నండూరి సాంబశివరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. డిజిపి రాముడు ఈనెలాఖరులో పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే, పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని రెండు నెలలపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, రాముడు అందుకు అంగీకరించలేదని తెలిసింది.

07/21/2016 - 05:44

విజయవాడ, జూలై 20: రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియచేశారు.

07/21/2016 - 05:41

పాణ్యం, జూలై 20: సెల్ఫీ మోజు ఓ బిటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. వేగంగా వస్తున్న రైలుతో సెల్ఫీ తీసుకుంటూ బిటెక్ విద్యార్థి ఇద్రూస్ బాషా (20) దానికింద పడి మృతి చెందాడు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ సమీపంలో బుధవారం ఈ సంఘటన జరిగింది.

07/21/2016 - 05:38

విజయవాడ, జూలై 20: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రభుత్వం రైతుల నుంచి 33వేల ఎకరాలు సేకరించినప్పటికీ ప్రభుత్వానికి మిగిలేది సుమారు 7,240 ఎకరాలు మాత్రమే. భూసేకరణ, భూమి వినియోగానికి సంబంధించి సంపూ ర్ణ అవగాహన లేక కొంతమంది పలు రకాలుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారంటూ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల నుంచి పుట్టిన ఓ అద్వితీయమైన పథకం ల్యాండ్ పూలింగ్.

07/21/2016 - 05:35

విజయవాడ, జూలై 20: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల పనితీరు పట్ల పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి ఇటీవల నియమించిన పదిమంది సభ్యులతో చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి ఇటీవల జరిపించిన సర్వేల వివరాలను కమిటీ ముందు ఉంచారు.

07/21/2016 - 06:43

గుంటూరు, జూలై 20: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి నేడు రెండోవిడత మరో మూడు శాఖల ఉద్యోగులను తరలించనున్నారు. ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో రవాణా, రోడ్లు, భవనాలశాఖ, విజిలెన్స్ కమిషన్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. రవాణా మంత్రి శిద్దా రాఘవరావు తన పేషీని ప్రారంభిస్తారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుండి సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక బస్సులలో బయల్దేరి మధ్యాహ్నం గం.1.35లకు చేరుకుంటారు.

07/20/2016 - 18:24

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి డిజిపిగా ప్రస్తుత ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు ఈనెల 23న బాధ్యతలు చేపడతారని సమాచారం. డిజిపి జెవి రాముడు పదవీ విరమణ చేస్తున్నందున ఇన్‌చార్జి డిజిపిని నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఈనెల 23న ఇక్కడ రాముడికి వీడ్కోలు ఇచ్చిన వెంటనే సాంబశివరావు బాధ్యతలు చేపడతారు.

07/20/2016 - 18:23

విజయవాడ: వచ్చే నెల 12 నుంచి జరిగే కృష్ణా పుష్కరాలను పర్యవేక్షించేందుకు ఎపి ప్రభుత్వం ఇద్దరు ఐఎఎస్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు బి.రాజశేఖర్‌ను, కర్నూలుకు జి.అనంతరామును నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

07/20/2016 - 16:51

హైదరాబాద్‌: నీటి విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే బుధవారం కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో జలమట్టం తక్కువగా ఉందని, నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కృష్ణానది యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్‌ ఛటర్జీ తెలిపారు.

Pages