S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/20/2016 - 16:25

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం చైనా పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. జీఐఐసీ కంపెనీకి చెందిన సీఈవో జాంగ్‌ ఝువోతో పాటు ఇతర ప్రతినిధులు అమరావతిలో మౌలికసదుపాయాల కల్పన ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం వహించేందుకు సిద్దమని ముఖ్యమంత్రికి వివరించారు.

07/20/2016 - 16:04

విజయవాడ: ఐదుగురు సీనియర్ ఐపీఎస్‌లు మాలకొండయ్య, గౌతం సవాంగ్, వినయ్‌రంజన్‌రే, ఆర్పీ ఠాకూర్‌, వీఎస్‌కే కౌముదికి డీజీపీ ర్యాంక్‌ పదోన్నతి కల్పించారు.

07/20/2016 - 16:01

విజయవాడ : ఏపీ కేడర్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారులు అమిత్‌గార్గ్, హరీష్‌కుమార్‌ గుప్తా తమను తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (క్యాట్) లో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఆగస్టు 10వతేదీకి క్యాట్ వాయిదా వేసింది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు క్యాట్ నోటీసులు జారీ చేసింది.

07/20/2016 - 15:57

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఇటీవల రాయపాటి సతీమణి మృతి చెందారు.

07/20/2016 - 15:49

కర్నూలు: సెల్ఫీ తీసుకోవడంలో నిమగ్నమై ఆకస్మికంగా రైలుకింద పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి మరణించిన ఘటన పాణ్యం మండలం నెరవాడ వద్ద బుధవారం జరిగింది. రైల్వే వంతెనపై ఇంజనీరింగ్ విద్యార్థి ఇద్రస్ బాషా సెల్ఫీ తీసుకుంటూ.. వెనుకనుంచి రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో బాషాను ఢీకొని రైలు వెళ్లిపోయింది. రైలు కింద పడిన బాషా అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో బాషా కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.

07/20/2016 - 15:48

తిరుపతి: తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని భావించి, తిరుమలలో వివాహం చేసుకునేందుకు వచ్చిన ఓ ప్రేమజంటను పోలీసులు పట్టుకున్నారు. ఓ యువతి కిడ్నాప్ అయిందంటూ వచ్చిన సమాచారం మేరకు గాలింపు చర్యలు ప్రారంభించిన పోలీసులకు ఈ జంట చిక్కింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన ఓ యువతిని, ఆమె ప్రియుడిని తిరుపతి పోలీసులు బుధవారం పట్టుకున్నారు.

07/20/2016 - 15:48

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా కోసం పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లుకు తాము మద్దతిస్తామని టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు బుధవారం తెలిపారు. ఆ బిల్లు వల్ల ఏదో జరుగుతుందని తాము భావించడం లేదని, రాష్ట్ర ప్రయోజనాలను ఆశించి తాము సహకరిస్తామన్నారు. తమ పార్టీ ఎన్‌డిఎ కూటమిలో ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

07/20/2016 - 12:46

విజయవాడ: టిడిపి సమీక్షా సంఘం సమావేశం ఆ పార్టీ అధినేత, ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో బుధవారం ఇక్కడ జరిగింది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ప్రజల మనోభావాలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చ జరిగింది. పార్టీని మరింతగా పటిష్టం చేసేలా కృషి చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కమిటీ సభ్యులు, పలువురు ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొన్నారు.

07/20/2016 - 12:44

చిత్తూరు: ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సును వేగంగా వస్తున్న లారీ ఢీకొనడంతో అయిదుగురు విద్యార్థులు గాయపడ్డారు. చంద్రగిరి మండలం కోట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి, లారీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

07/20/2016 - 12:44

విజయవాడ: ఎపికి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ ఎంపీ కెవిపి రామచంద్రరావు పార్లమెంటులో ప్రతిపాదించిన ప్రైవేటుబిల్లుకు అన్నిపార్టీలూ మద్దతు ఇవ్వాలని కోరుతూ యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఇక్కడ భారీ ర్యాలీ జరిపారు. ప్రత్యేక హోదా ఇస్తేనే ఎపి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీవిద్యార్థులు ర్యాలీలో పాల్గొని సంఘీభావం వ్యక్తం చేశారు.

Pages