S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/01/2016 - 16:15

దిల్లీ: దిల్లీలో విడిది చేసిన ఎపి సిఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత శుకవారం మధ్యాహ్నం విజయవాడకు బయలుదేరారు. ఆయన కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్, ఉమాభారతిలతో సమావేశమై నిధుల కేటాయింపు, విభజన సమస్యలపై చర్చించారు.

07/01/2016 - 16:14

దిల్లీ: దేశ రాజధానిలో ఉన్న ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి రాబోయే మూడేళ్లలో కనీసం 5వేల కోట్ల రూపాయలు మంజూరు చేయాలని ఆయన కోరారు. గత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు భర్తీ, ప్రత్యేక హోదా, హైకోర్టు విభజన తదితర అంశాలను ఆయన జైట్లీ దృష్టికి తీసుకెళ్లారు.

07/01/2016 - 15:32

తిరుమల: తిరుమలలో సంచరిస్తున్న చిరుతలను దారి మళ్లించేందుకు ప్రయత్నిస్తామని, వాటిని బంధించలేమని డీఎఫ్వో శివరాంప్రసాద్ స్పష్టం చేశారు. కొన్ని రోజులపాటు భక్తులు, స్థానికులు రాత్రి సమయాల్లో ఒంటరిగా బయట తిరగవద్దు అని ఆయన సూచించారు.

07/01/2016 - 12:22

విజయవాడ: బిసి సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ఇక్కడ ప్రారంభించారు. కానూరు వద్ద త్వరలోనే బిసి కార్పొరేషన్‌ను, ఇతర అనుబంధ విభాగాలను ప్రారంభించి పూర్తి స్థాయిలో సేవలు అందజేస్తామని మంత్రి చెప్పారు.

07/01/2016 - 12:21

తిరుపతి: హిందూ దేవాలయాలపై దాడులకు ఉగ్రవాదులు వ్యూహరచన చేశారన్న సమాచారం మేరకు తిరుపతి, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఆలయాల సందర్శనకు వచ్చే భక్తులను సోదాచేస్తున్నారు. అనుమానిత వస్తువులు, వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.

07/01/2016 - 12:19

కాకినాడ: వేల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్న వైఎస్ జగన్‌కు అసెంబ్లీలో విపక్షనేతగా కొనసాగే నైతిక హక్కు లేదని ఎపి హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల జగన్ అక్రమాస్తులను ఈడీ జప్తు చేసిందన్నారు. ఆయన వైఖరిని గమనించి వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలన్నారు.

07/01/2016 - 12:18

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అయిదు రోజుల చైనా పర్యటన ముగించుకుని దిల్లీ చేరుకున్నారు. ఆయనను ఎపి భవన్‌లో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ కలిశారు. కొందరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు భేటీ అవుతారని తెలిసింది. హైకోర్టు విభజన తదితర అంశాలపై ఆయన చర్చించనున్నట్టు సమాచారం.

07/01/2016 - 11:39

హైదరాబాద్‌: అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల, కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవాకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న అల్పపీడనం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైంది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

,
07/01/2016 - 05:52

విఆర్‌పురం/పోలవరం/శ్రీకాకుళం/విజయనగరం, జూన్ 30: అల్పపీడనం, రుతుపవనాల ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, శబరి నదులు జలకళను సంతరించుకున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇసుక తినె్నలతో దర్శనమిచ్చిన జీవనదులు గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎర్రనీరు చేరుకుని నిండుగా కనిపిస్తున్నాయి. వర్షాలకు విలీన మండలాల్లోని వాగులు, వంకలు, చెరువులు, పొంగి ప్రవహిస్తున్నాయి.

07/01/2016 - 05:48

గుంటూరు, జూన్ 30: రాష్ట్ర ప్రజలతో సత్సంబంధాలు కలిగిన మహిళా, శిశు సంక్షేమ శాఖకు మంచి పేరు వచ్చే విధంగా ఉద్యోగులు కష్టించి పనిచేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత కోరారు. గురువారం గుంటూరు లాడ్జిసెంటర్‌లోని జంపని టవర్స్‌లో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌ను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.

Pages