S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

07/01/2016 - 05:46

విశాఖపట్నం, జూన్ 30: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారింది. ఈ విషయాన్ని విశాఖలోని తుపాను హెచ్చరికల హెచ్చరికల కేంద్రం అధికారులు గురువారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

07/01/2016 - 05:45

అమరావతి, జూన్ 30: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయం పక్కన కృష్ణానది ఒడ్డున స్నానఘాట్‌ల నిర్మాణానికి తవ్వకాలు జరుపుతుండగా గురువారం ఉదయం 16వ శతాబ్దం నాటి నల్లరాతి అభయముద్రలో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం బయల్పడింది. అలాగే దీంతోపాటుగా నల్లరాతిపై ఉన్న నాగబంధం ఇతర చిన్న చిన్న శిల్పాలు కూడా బయటపడ్డాయని మ్యూజియం అధికారి ఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు.

07/01/2016 - 05:42

తిరుమల, జూన్ 30: ఇటీవల కురిసిన వర్షాలకు, ఈదురు గాలులకు వేళ్ళు బలహీన పడ్డ భారీ వృక్షం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 50వ మలుపువద్ద కూలిపోయింది. దీంతో రెండు కిలో మీటర్లు మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న వి జి ఓ మల్లికార్జున రెడ్డి, అటవీశాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని అరగంట వ్యవధిలో చెట్టునుతొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు.

07/01/2016 - 05:40

విజయవాడ, జూన్ 30: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐదు రోజుల చైనా పర్యటన ముగించుకుని గురువారం రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు. శుక్రవారం ఉదయం ఆయన విజయవాడకు రావల్సి ఉంది. అయితే, ఆయన శుక్రవారం అంతా ఢిల్లీలో గడపనున్నారు. ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ అవనున్నారు. చైనాలోని వివిధ కంపెనీలతో చంద్రబాబు ఒప్పందాలు కుదుర్చుకున్న నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.

07/01/2016 - 05:39

కర్నూలు సిటీ, జూన్ 30: హైకోర్టు విభజన విషయంలో తెలంగాణ న్యాయవాదులు అవలంభిస్తున్న తీరు దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి కెయి.కృష్ణమూర్తి అన్నారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చేగొట్టేలా వారు మాట్లాడుతున్నారన్నారు. వారి వ్యవహారశైలి న్యాయవ్యవస్థను భ్రష్టుపట్టించేదిగా ఉందన్నారు. గురువారం కర్నూలులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విభజన చట్టంలోని పేర్కొన్నట్టుగానే హైకోర్టు విభజన జరుగుతుందన్నారు.

07/01/2016 - 05:38

తిరుమల, జూన్ 30: ప్రేమించలేదని తిరుపతి కనక భూషణం లే ఔట్‌కు చెందిన చందన అనే విద్యార్థిని నవీన్, యశ్వంత్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి ఆమెను హతమార్చడానికి ప్రయత్నించిన కేసులో అలిపిరి పోలీసులు నిర్లక్ష్యం వహించడం పట్ల డిఐజి ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు.

07/01/2016 - 05:37

శ్రీ కాళహస్తి, జూన్ 30: చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే రుద్రాభిషేకం మినహా అన్ని అభిషేకాలను రద్దు చేస్తూ ట్రస్టుబోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు గురువారం సాయంత్రం ఇ ఓ భ్రమరాంబ, ట్రస్టుబోర్డు సభ్యులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు.

07/01/2016 - 05:36

విజయవాడ (క్రైం), జూన్ 30: సైబర్ నేరాల నియంత్రణకు దేశంలోని దర్యాప్తు సంస్ధలు సమీకృత విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవశ్యకత ఉందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. సాంకేతిక పరిఙ్ఞనం విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్ధితుల్లో ఎంత ప్రయోజనం ఉందో అంతే ప్రమాదం కూడా పొంచి ఉందన్నారు.

07/01/2016 - 05:36

గుంటూరు, జూన్ 30: తమ బోధనల ద్వారా సమాజంలో ధార్మిక రుజువర్తనను పెంపొందింపజేసిన శ్రీ శృంగేరీ శ్రీ విరూపాక్ష పీఠాధిపతి జగద్గురు శివకళ్యాణానంద భారతీ మహాస్వామి గురువారం బ్రహ్మైక్యం చెందారు.

07/01/2016 - 05:35

విజయవాడ, జూన్ 30: ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించడానికి గాను విజయవాడ మీదుగా హౌరా-చెన్నై, హౌరా-ఎర్నాకులం స్టేషన్ల మధ్య 68ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

Pages