S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/27/2016 - 04:21

విజయవాడ, జూన్ 26: రాష్ట్రంలో మూడు వేల కోట్ల రూపాయల వ్యయంతో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు చైనాలో అతిపెద్ద ఉక్కు కర్మాగారాల్లో ఒకటైన అన్ స్టీల్ కంపెనీ ముందుకు వచ్చింది. చైనా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అన్ స్టీల్ కంపెనీ చీఫ్ ఇంజనీర్ జువెన్ గేంగ్‌తో భేటీ అయ్యారు.

06/27/2016 - 04:20

విజయవాడ, జూన్ 26: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంగా చైనాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిరోజే బిజీబిజీగా గడిపారు. పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అయ్యారు. పెట్టుబడులకు అమరావతి స్వర్గ్ధామమని, పెట్టుబడిదారులకు అన్నివిధాలా సహకరిస్తామని హామీ ఇచ్చారు. టియాంజిన్‌లోజరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు చైనా వెళ్లడం తెలిసిందే.

06/27/2016 - 04:19

విజయవాడ, జూన్ 26: గోదావరికి వరదొస్తేనే కృష్ణా డెల్టాకు సాగు నీరు సాధ్యమవుతుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఈ ఏడాది కూడా కృష్ణాకు నీరు అసాధ్యమేనన్న అనుమానం ఆయన వ్యక్తం చేశారు. తనకు దక్కనిది మరెవరికీ దక్కకూడదనే భావనతో వైపాక నేత జగన్ వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత పదవి పిచ్చోడి చేతిలో రాయిలా ఉందన్నారు.

06/27/2016 - 04:14

విజయవాడ, జూన్ 26: సోమవారం నుంచి తాత్కాలిక సచివాలయం నుంచే పాలన ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటల మాట ఎలా ఉన్నా ఇక్కడి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడి పరిస్థితుల్ని లోతుగా గమనిస్తే ఇప్పట్లో పాలన మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు.

06/27/2016 - 04:13

గుంటూరు, జూన్ 26: రాజధానికి ఒకదాని వెంట ఒకటిగా ప్రధాన కార్యాలయాలు క్యూ కడుతున్నాయి. పదులు, వందల సంఖ్యలో ఉద్యోగులు తరలివస్తున్నారు. వీరికి వసతి సదుపాయం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ఉద్యోగినులు అవస్థ పడుతున్నారు. ఇప్పటికే గుంటూరులో మార్కెటింగ్, చేనేత, జౌళి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయశాఖ కమిషనరేట్‌తో పాటు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి.

06/26/2016 - 07:02

హైదరాబాద్, జూన్ 25: అమరావతిలోని సదావర్తి భూములను నామమాత్రపు ధరకే ఏపి ప్రభుత్వం విక్రయించినట్లు వచ్చిన అభియోగాలపై న్యాయ విచారణకు ఆదేశించాలని కోరుతూ అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య యువజన విభాగం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

06/26/2016 - 07:00

హైదరాబాద్, జూన్ 25: అమరావతి సీడ్ క్యాపిటల్ నిర్మాణం బాధ్యతలను విదేశీ కంపెనీలకు స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఇవ్వాలన్న రాష్టమ్రంత్రివర్గ నిర్ణయం సరికాదని వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధాని నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలన్నారు.

06/26/2016 - 07:00

గుంటూరు, జూన్ 25: ‘మా ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుంది... ప్రతి పనికీ జవాబుదారీగా వ్యవహరిస్తున్నాం. రాష్ట్భ్రావృద్ధి, రాజధాని నిర్మాణం సంకల్పంతో ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి నిరోధకులు అడుగడుగునా అడ్డుపడి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు’ అంటూ సిఎం చంద్రబాబు మండిపడ్డారు.

06/26/2016 - 06:58

హైదరాబాద్, జూన్ 25: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షాలు ఏదైనా ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పడి కరిచేంత పని చేస్తున్నారని ఎపి శాసనమండలి (కౌన్సిల్) లో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. రాజధాని నిర్మాణ ఒప్పందాలపై చర్చించేందుకు వెంటనే అఖిలపక్షాన్ని పిలవాలని ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు.

06/26/2016 - 06:58

హైదరాబాద్, జూన్ 25: భారత్‌ను హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని, అలాగే నేపాల్‌ను సైతం హిందూ రాష్ట్రంగా గుర్తించాలన్న డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని అఖిల భారత హిందూ అధివేషన్ ప్రకటించింది. గోవాలో జరుగుతున్న అఖిల భారత హిందూ అధివేషన్ సమ్మేళనం పలు తీర్మానాలను చేసిందని జాతీయ అధికార ప్రతినిధి రమేష్ షిండే హైదరాబాద్‌లో చెప్పారు. భారత్‌ను హిందూ రాష్ట్రంగా పార్లమెంటు ప్రకటించాలని ఒక తీర్మానం చేశామని అన్నారు.

Pages