S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2016 - 18:07

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి సిబిసిఐడి పోలీసులు అరెస్టు చేసిన వారందరికీ బెయిల్ లభించడంతో ఆమరణ దీక్షను విరమించేందుకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సమ్మతించారు. కాసేపట్లో దీక్ష విరమించి ఈరోజు రాత్రికి తన స్వస్థలమైన కిర్లంపూడికి ఆయన తన కుటుంబ సభ్యులతో చేరుకుంటారు.

06/21/2016 - 18:05

ఒంగోలు: టంగుటూరు మండలం ఎం.నిడమలూరులోని ఓ పొగాకు గోడౌన్‌లో ప్రమాదవశాత్తూ జారిపడి మంగళవారం నాడు ఇద్దరు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

06/21/2016 - 16:07

విజయవాడ: ఈనెల 26 నుంచి 29 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చైనాలో పర్యటించనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, పలువురు ఉన్నతాధికారులు చైనా పర్యటనకు వెళ్లనున్నారు.

06/21/2016 - 16:05

విజయవాడ: రైతులకు రెండో విడత రుణమాఫీ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని రేపు ఒంగోలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ రుణమాఫీ పత్రాలు 8రోజుల పాటు పంపిణీ చేస్తామన్నారు. ప్రభుత్వ హామీతో ఏకమొత్తంగా రద్దు చేయాలని బ్యాంకర్లను కోరినట్లు మంత్రి తెలిపారు.

06/21/2016 - 14:56

విజయవాడ: ‘ఉద్యోగుల బదిలీలపై అధికారులతో సమన్వయం లేకపోతే ఎలా? గుంటూరులో ఉంటున్న మీకు విజయవాడ ఎంత దూరం?’- అని ఎపి సిఎం చంద్రబాబు రాష్ట్ర వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలపై మంత్రులు, కలెక్టర్లు, కార్యదర్శులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం లోపిస్తోందని, ఈ విషయాన్ని ఇక సహించేది లేదన్నారు.

06/21/2016 - 12:50

విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, ఈ ప్రక్రియ పూర్తి పారదర్శకతతో జరగాలని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఉద్యోగుల బదిలీలపై జిల్లాల వారీగా తాజా పరిస్థితిని ఆయన మంగళవారం ఇక్కడ సమీక్షించారు. ఇష్టానుసారం బదిలీలు చేస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది గనుక ఈ వ్యవహారంలో విధి విధానాలను పాటించాలన్నారు.

06/21/2016 - 12:46

విజయవాడ: ఆధునిక యుగంలో నిత్యం యోగాసనాలు వేస్తుంటే ప్రశాంత జీవనం సాధ్యపడుతుందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మంగళవారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో యోగాతో శారీరక శ్రమ చేయడం అంతే అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు, పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

06/21/2016 - 11:41

విశాఖ: హైదరాబాద్‌ నుంచి రావాల్సిన ఎయిర్‌కోస్టా విమానాన్ని సాంకేతిక లోపంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. ఈ విమానం 4 గంటలు ఆలస్యంగా విశాఖ చేరుకోనుంది.

06/21/2016 - 11:34

విశాఖ: స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు, మంత్రి అయ్యన్న, ఎంపీలు హరిబాబు, అవంతి శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

06/21/2016 - 11:29

చిత్తూరు: 9 మంది ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు. 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మండలం కరకంబాడి దగ్గర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు జరిపారు.

Pages